Big Stories

Electoral Bonds Data: ఎలక్టోరల్ బాండ్స్ లెక్కలివే.. BRS తో సహా ఏ పార్టీకి ఎంతంటే..

Electoral Bonds Data

- Advertisement -

Electoral Bonds Data Latest Update (latest political news in India): మనం ముందే డిస్కస్ చేశాం కదా.. ఎప్పుడైతే కోడ్ నంబర్స్‌తో సహా ఎలక్టోరల్ బాండ్లు బయటికి వస్తాయో.. అటు పార్టీలు, ఇటు కంపెనీల బండారం.. నడి బజార్లో బయటపడుతోంది. అసలు లెక్కలు తెలుస్తాయని.. అదే జరిగింది. ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళమిచ్చింది? ఇచ్చిన కంపెనీలు ఎలా లాభం పొందాయి? ఈ విషయాలన్నింటిపై ఇప్పుడు డిస్కస్ చేద్దాం.. అయితే కొన్ని కంపెనీలు, అస్సలు ఊహించని పార్టీలకు గంపగుత్తగా కోట్లు కట్టబెట్టడం ఇక్కడ మరో ట్విస్ట్.. ఇంతకీ ఆ కంపెనీలేంటి? ఏ పార్టీకి అవి ఎంత విరాళాలిచ్చాయి?
.
ముందుగా కైటెక్స్ సంగతి చూద్దాం.. కైటెక్స్.. ఈ పేరు మీరు వినే ఉంటారు. వరంగల్‌ డిస్ట్రిక్‌లోని హవేలీలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో .. ఈ కంపెనీకి భూములు కేటాయించింది అప్పటి కేసీఆర్ సర్కార్.. జులై 7, 2021లో కుదిరింది ఈ ఒప్పందం. 1200 కోట్లతో 187 ఎకరాల్లో చిన్న పిల్లల దుస్తుల తయారీ యూనిట్ నెలకొల్పుతోంది. అదిగో ఆ కంపెనీ సరిగ్గా ఎన్నికల ముందు నవంబర్‌లో బీఆర్‌ఎస్‌కు..
అక్షరాలా 25 కోట్ల రూపాయలను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ముట్టచెప్పింది.

- Advertisement -

Also Read: వాలంటీర్లపై వేటు..! వాళ్ళకి అంత పవరుందా..?

వరంగల్‌లోనే కాదు..రంగారెడ్డిలో కూడా ఈ కంపెనీకి 250 ఎకరాల భూమిని కేటాయించింది అప్పటి ప్రభుత్వం.. అంతేకాదు వాస్తు కోసం మరో 13 ఎకరాలను కేటాయించాలని కోరింది.. కేసీఆర్ సర్కార్ పెద్ద మనసు చేసుకొని ఇచ్చేసింది. దీనికి బదులుగా తన రెండు కంపెనీల నుంచి బీఆర్‌ఎస్‌కు భారీగా విరాళాలు ఇచ్చింది కైటెక్స్.. కైటెక్స్ చిల్డ్రన్ వేర్‌ లిమిటెడ్ పేరు మీద 9 కోట్లు.. కైటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ పేరు మీద 16 కోట్లు..ఎలక్టోరల్ బాండ్లు కొని రుణం తీర్చుకుంది..

ఇది కైటెక్స్.. ఇక మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ విషయానికి వద్దాం.. 966 కోట్లతో డోనేషన్స్‌ లిస్ట్‌లో సెకండ్ ప్లేస్‌ మేఘాదే అని గుర్తుందిగా.. అసోసియేటెడ్ కంపెనీలతో కలిపితే అది 1186 కోట్లకు చేరింది. మరి మేఘా ఇంత భారీ మొత్తం ఎవరికి ఇచ్చింది అంటే.. తిలా పాపం.. తలా పిడికెడు అన్నట్టుగా.. అధికార పార్టీలకు భారీగా.. విపక్ష పార్టీలకు కొంచెం.. కొంచెంగా పంచేసింది మెయిల్..భారీగా కేంద్ర ప్రాజెక్టులను దక్కించుకున్న మేఘా.. 966 కోట్లలో 584 కోట్లను ఒక్క బీజేపీకే ఇచ్చేసింది మెయిల్.. ఆ తర్వాత తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరంతో పాటు కీలక ప్రాజెక్టులు దక్కించుకున్నందుకు ప్రతిఫలం అన్నట్లు బీఆర్‌ఎస్‌కు 195 కోట్లు ఇచ్చింది. తమిళనాడులో అధికారపార్టీ DMKకు 85 కోట్లు దానం చేసింది మెయిల్..ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి 37 కోట్లు..
విపక్షంలో ఉన్న టీడీపీకి 28 కోట్లు.. బీహార్‌లోని అధికార పార్టీ జేడీయూకి 10 కోట్లు.. ఇలా పంచుకుంటూ పోయింది మెయిల్..

డోనేషన్ లిస్ట్‌లో 1365 కోట్లతో టాప్‌ ప్లేస్‌లో ఉన్న ఫ్యూచర్‌ గెమింగ్‌ కంపెనీది మరో కథ.. ఈ కంపెనీ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు 542 కోట్లు కుమ్మరించింది. ఆ తర్వాత తమిళనాడులోని అధికారపార్టీ DMKకు 503 కోట్లు ఇచ్చింది. ఇక ఏపీలోని అధికార పార్టీ వైసీపీకి 154 కోట్లు డోనెట్ చేసింది. కేంద్రంలోని అధికార బీజేపీకి వంద కోట్లు..విపక్ష కాంగ్రెస్‌కు 50 కోట్లు.. సిక్కింలోని పార్టీలకు 16 కోట్లు డోనెట్ చేసింది. ఇలా డోనెట్ చేస్తూ వెళ్లింది ఫ్యూచర్ గేమింగ్..ఇంతకీ ఈ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ అధినేత ఎవరో తెలుసా.. లాటరీ కింగ్‌గా పేరు సంపాదించిన మార్టిన్ అనే తమిళనాడుకు చెందిన వ్యక్తిది. వెస్ట్‌ బెంగాల్‌లో డయల్ లాటరీ పేరుతో భారీగా బిజినెస్ చేస్తుంది.

అందుకే అక్కడ ఇచ్చిందనుకుందాం.. ఇక తమిళనాడు వ్యక్తి కాబట్టి.. డీఎంకేపై అభిమానంతో ఇచ్చాడనుకున్నా.. అంత మొత్తం ఎందుకిచ్చాడన్నది మాత్రం చాలా పెద్ద డౌట్‌.. ఈ రెండు రాష్ట్రాల సంగతి అలా ఉంచితే.. ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీకి ఎందుకు విరాళాలు ఇచ్చిందన్నది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. ఎందుకంటే ఏపీలోనూ లాటరీపై నిషేధం ఉంది. అసలు వైసీపీకి, మార్టిన్‌కు సంబంధం కూడా లేదు.. అయినా కానీ 154 కోట్లు ఇచ్చింది ఫ్యూచర్ గేమింగ్.. లాభం లేనిదే పైసా కూడా విదల్చని కంపెనీలు.. ఏకంగా 154 కోట్లు ఎందుకు ఇచ్చిందన్నది ఓ పెద్ద మిస్టరీ..

ఇదే కాదు.. ఈ లిస్ట్‌ను అబ్జర్వ్‌ చేస్తే మరో అంతుచిక్కని విషయం కూడా బయటపడింది. అదేంటంటే.. టీడీపీ, శిరిడిసాయి ఎలక్ట్రికల్స్‌ కంపెనీ లింక్.. ఎందుకంటే శిరిడిసాయి ఎలక్ట్రికల్స్ అనేది వైసీపీ హయాంలో కీలక ప్రాజెక్టులను దక్కించుకున్నది.. ఈ కంపెనీ వైసీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే ఎన్‌.విశ్వేశ్వర్‌రెడ్డిది. అస్సలు అర్హత లేకపోయినా ఈ కంపెనీ కాంట్రాక్టులు దక్కించుకుందన్న ఆరోపణలు ఉన్నాయి.. అలాంటి కంపెనీ అయితే వైసీపీకి విరాళాలు ఇవ్వాలి..కానీ టీడీపీకి విరాళాలు ఇచ్చింది.. అది కూడా ఏకంగా 40 కోట్లు.. టీడీపీకి వచ్చిన డోనేషన్స్ లిస్ట్‌ను అబ్జర్స్‌ చేస్తే తేలిందేంటంటే.. వారికి వచ్చిన ఫండ్స్‌లో శిరిడిసాయి ఎలక్ట్రికల్స్ ఇచ్చిందే హయ్యెస్ట్‌.. ఏపీలో ఈ మధ్య విద్యుత్‌శాఖకు సంబంధించిన కాంట్రాక్టుల్లో ఎక్కువభాగం ఈ కంపెనీనే చేసింది.

అలాంటి కంపెనీ వైసీపీకి ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వకుండా, టీడీపీకే ఎందుకు ఇచ్చిందన్నదే మిస్టరీగా మారింది.శిరిడిసాయితో పాటు పలు ఫార్మా కంపెనీలు టీడీపీకి కోట్లు కుమ్మరించాయి. అందులో వెస్ట్రన్ యూపీ పవర్ ట్రాన్స్‌కో 20 కోట్లు.. నాట్కో ఫార్మా 14 కోట్లు.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 13 కోట్లు.. భారత్‌ బయోటెక్ 10 కోట్లు.. ఇక ఇతర కంపెనీలు 86 కోట్లు.. ఇలా టీడీపీకి కూడా బాగానే ఫండ్స్ వచ్చాయి..

Also Read: కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్..మోడీ కుట్ర నేనా?

బీజేపీకి వచ్చిన 6 వేల కోట్లు ఇచ్చిన కంపెనీల లిస్ట్‌లో 584 కోట్లతో మేఘ టాప్‌లో ఉంది. ఆ తర్వాత క్విక్ సప్లై చైన్ 375 కోట్లు.. వేదాంత లిమిటెడ్ 227 కోట్లు.. భారతీ ఎయిర్‌టెల్ 236 కోట్లు.. మదన్‌లాల్ లిమిటెడ్ 176 కోట్లు.. కెవెంటెర్ గ్రూప్ 145 కోట్లు.. సంజీవ్ గోయెంకా గ్రూప్ 127 కోట్లు.. ఆదిత్యా బిర్లా గ్రూప్ 275 కోట్లు.. ఇలా వందల కోట్లు బీజేపీకి డోనెట్ చేశాయి కంపెనీలు..

ఇవీ కంపెనీల వివరాలు.. ఇక ఇండివ్యూజువల్‌గా బీజేపీకి డోనెట్ చేసిన వివరాలు చూస్తే మీ కళ్లు చెదిరిపోతాయి.. లక్ష్మీ నివాస్ మిట్టల్ బీజేపీకి 35 కోట్లు. రాహుల్ భాటియా 20 కోట్లు డోనెట్ చేయగా.. అందులో 16 కోట్లు తృణమూల్‌ కాంగ్రెస్‌కే ఇచ్చారు..రాజేష్‌ అగర్వాల్ కాంగ్రెస్‌కు 20 కోట్లు.. రాజేష్‌ మదన్‌లాల్‌ అగర్వాల్ 13 కోట్లు ఇవ్వగా.. అందులో బీజేపీ, బీఆర్‌ఎస్‌కు చెరో 5 కోట్లు ఇచ్చారు.. ఇలా పర్సనల్‌గా కూడా అధికార పార్టీలకు కోట్లు కుమ్మరించారు కార్పొరేట్ పెద్దలు..

చూశారుగా.. ఇదంతా.. మొత్తంగా కార్పొరేట్ కంపెనీల వాలకం చూస్తుంటే.. అటు అధికార, ఇటు విపక్ష పార్టీలకు డబ్బులు మాత్రం పంచాయి.. కాకపోతే అధికారంలో ఉంటే చాలా ఎక్కువ.. విపక్షంలో ఉంటే తక్కువ.. ఎందుకంటే ఎప్పుడు ఎవరు గద్దెనెక్కుతారో తెలియదుగా.. అందుకే అందరితో మంచిగా ఉండటమే బెటర్‌ అనే ఆలోచన కనిపిస్తోంది వారిలో..

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News