Big Stories

Congress Bank Account Frozen: కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్.. మోడీ కుట్ర నేనా..?

Congress Bank Account Frozen

- Advertisement -

Congress Bank Account Frozen: రాజకీయ పార్టీలు ట్యాక్స్‌లు కట్టాల్సిందేనా? కట్టకపోతే అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తారా? ఈ రూల్ ఒక్క కాంగ్రెస్‌కేనా? లేక అన్ని పార్టీలకు వర్తిస్తుందా? గాంధీ ఫ్యామిలీ చెబుతున్నట్టు ఇది కుట్రలో భాగమేనా? అసలు నిజంగా రాజకీయ పార్టీలు పన్నులు చెల్లిస్తాయా? కాంగ్రెస్‌ అకౌంట్స్ ఫ్రీజ్‌ వెనుక అసలు కథేంటి?

- Advertisement -

ఫస్ట్.. అసలు రాజకీయ పార్టీలు పన్ను చెల్లిస్తాయా? నో చెల్లించవు.. రాజకీయ పార్టీలకు వచ్చే ఆదాయంపై ఎలాంటి ఆదాయపు ప్ను ఉండదు. ఇన్‌కమ్ ట్యాక్స్‌ యాక్ట్ 13ఏ చెబుతున్నదాన్ని బట్టి..రాజకీయ పార్టీలకు వచ్చే స్వచ్ఛంద విరాళాలు.. వాటి నుంచి వచ్చే ఏ ఆదాయం, ఆస్తులు నుండి వచ్చే..ఇంట్రెస్ట్ అంటే వడ్డీ.. రెంట్‌ లాంటివన్నింటికి పన్ను మినహాయింపు ఉంటుంది. సో పొలిటికల్ పార్టీస్‌కి ఎలాంటి ట్యాక్స్‌ ఉండదని ఇక్కడ అర్థమవుతోంది. అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. అదేంటంటే ఈ ట్యాక్స్‌ నుంచి మినహాయించుకోవాలంటే.. ప్రతి పార్టీ బ్యాంక్‌ అకౌంట్స్‌ను మెయింటేన్ చేయాలి.. ట్రాన్సక్షన్స్‌ వాటి ద్వారానే చేయాలి..అండ్ 20 వేల కంటే ఎక్కువున్న డొనేషన్స్‌ డిటేయిల్స్‌ అన్నింటిని.. ఎలక్షన్ కమిషన్‌కు ఇవ్వాలి.. ఎట్‌ ది సేమ్‌ టైమ్.. ఐటీ డిపార్ట్‌మెంట్‌కు రిటర్న్స్‌ కోసం ఫైల్ చేయాలి.. సో.. క్యాష్‌ రూపంలో కాకుండా అకౌంట్స్‌ నుంచి జరిగే డోనేషన్ ట్రాన్సక్షన్స్‌కు ఎలాంటి.. ట్యాక్స్‌ ఉండదని దీన్ని బట్టి అర్థమవుతోంది.

మరి కాంగ్రెస్‌కు ఐటీ ఎందుకు నోటిసులు ఇచ్చింది..? వాటి అకౌంట్స్‌ను ఎందుకు ఫ్రీజ్ చేసింది.. ? గత నెలలో AICC, యూత్ కాంగ్రెస్, NSUIకి చెందిన 11 బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి 135 కోట్లు వెంటనే డిపాజిట్ చేయాలని నోటీసులు జారీ చేసింది. ఈ డబ్బుతో పాటు ఇంట్రెస్ట్‌ 75 కోట్లు.. మొత్తం 210 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో తెలిపింది. అంతేకాదు కాంగ్రెస్‌ బ్యాంక్‌ అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ ప్రపంచానికి తెలిపారు. ఆయన ప్రెస్‌మీట్ పెట్టిన కాసేపటికే మళ్లీ అకౌంట్స్‌ను పునరుద్దరించారు.. మరి రాజకీయ పార్టీలకు ట్యాక్స్‌ ఉండదు కదా.. మరి నోటీసులు ఎందుకు? అనే కదా మీ ప్రశ్న.. అయితే 2018-19 ఫైనాన్షియల్ ఇయర్‌కి సంబంధించి.. ఐటీ రిటర్న్స్‌ను 45 రోజుల పాటు ఆలస్యంగా సబ్మిట్ చేసింది కాంగ్రెస్.. ఇంకేముంది ఐటీ నోటీసులు జారీ చేసింది. అంతేకాదు.. ఐటీ యాక్ట్ 13ఏకు అనుగుణంగా మీ ఆదాయం లేదని బాంబ్ పేల్చింది.. రిటర్న్‌ ఫైల్ చేయడం లేట్ అవ్వడం.. అకౌంట్స్‌లో ఉన్న తేడాల కారణంగా.. మొత్తం 210 కోట్లు కట్టాల్సిందే అంటోంది ఐటీ..

Also Read:  సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు..

అన్ని పార్టీలకు ఉన్న పన్ను మినహాయింపు రూల్స్.. ఉన్నట్టుండి కాంగ్రెస్‌కు మాత్రమే ఎందుకు అప్లై కావడం లేదు? సరిగ్గా ఎలక్షన్స్‌కు ముందే ఇదంతా ఎందుకు జరుగుతోంది? అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్..ఇప్పటికే ఈ టాపిక్‌పై పొలిటికల్‌ వార్ స్టార్టయ్యింది. ఐటీ డిపార్ట్‌మెంట్‌ను వెనకుండి నడిపించేది బీజేపీనే అన్నది కాంగ్రెస్ ఆరోపణ.. ఇది తమ పార్టీపై కాదు.. ప్రజాస్వామ్యంపైనే దాడి అని చెబుతోంది..
కనీసం టికెట్ కొనేందుకు కూడా డబ్బులు లేకుండా చేశారంటున్నారు ఆయన.. ఎన్నికల సమయంలో ప్రచారానికి చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.. కావాలనే ఎలక్షన్స్‌ ముందు టార్గెట్ చేశారని..
తమ పార్టీ ఆర్థికమూలాలను దెబ్బతీస్తున్నారని రాహుల్ గాంధీ పైర్ అవుతున్నారు. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అంటున్నారు సోనియాగాంధీ.

ఇక్కడ కాంగ్రెస్‌ కొన్ని ప్రశ్నలను తెరపైకి తీసుకొస్తోంది. అవేంటంటే.. 2017-18లో 199 కోట్ల రూపాయల డోనేషన్స్‌ వచ్చాయి.. అందులో 14 లక్షల 49 వేలు క్యాష్‌ రూపంలో వచ్చాయి. వచ్చిన డొనేషన్స్‌లో వాటి పర్సంటేజ్ 0.07 మాత్రమే.. కానీ వేసిన ఫైన్ మాత్రం ఏకంగా 210 కోట్లు.. అంటే 106 పర్సెంట్..ఇది నక్కకు నాగలోకానికి ఉన్న తేడా లేదా? ఇది కావాలని చేసింది కాకపోతే ఇంకేంటి? మరో ప్రశ్న.. 2017-18 ఇష్యూకు సంబంధించి.. ఏడేళ్ల తర్వాత అది కూడా ఎలక్షన్స్‌ ముందు చర్యలు తీసుకోవడం వెనుక మీ ఉద్దేశమేంటి? 210 కోట్లను ఫ్రీజ్ చేయడమే గాకుండా..

Also Read: ఈ మామిడి యమ డేంజర్ గురూ.. జర జాగ్రత్త

అకౌంట్స్‌లో ఉన్న 285 కోట్లను ఉపయోగించుకోకుండా చేశారు.. ఇది విపక్షాన్ని కావాలనే ఇరుకున పెట్టే చర్య కాదా? ఇవన్నీ కాకుండా 1994-95కి సంబంధించి మరో ఫ్రెష్‌ నోటీస్ ఇచ్చారు.. అప్పు సితా రామ్‌ కేసరీ ట్రెజరర్‌గా ఉన్నారు.. 30 ఏళ్ల తర్వాత నోటీసులు ఇవ్వడం వెనుక రీజనేంటి? ప్రస్తుతం ఈ ప్రశ్నలను సంధిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ.. కానీ సమాధానాలు చెప్పేవారే లేరు..

మొత్తంగా చూస్తే ఇదంతా కాంగ్రెస్‌ను కట్టడి చేసే కుట్రే అన్నది ఆ పార్టీ నేతల అనుమానం. .కోర్టులకు వెళితే సులభంగా న్యాయం దొరుకుతుంది. కానీ ఆలోపు కీలకమైన ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కదా? అనేది ఆ పార్టీల నేతల ప్రధాన ప్రశ్న. మరి కాంగ్రెస్‌ పార్టీకి ఆర్థిక కష్టాలు తీరుతాయా? మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే ఓట్ల పండుగలోపు డబ్బులు ఉపయోగించుకోగలరా?

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News