E-Paper

Food Safety: మీరు తినే పనీర్ బిర్యానీ వెనుక ఇంత ఘోరమా?.. గుండె పగిలే నిజాలు!

Food Safety: మీరు తినే పనీర్ బిర్యానీ వెనుక ఇంత ఘోరమా?.. గుండె పగిలే నిజాలు!
Advertisement

Food Safety: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్ రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ తింటున్నారా? అయితే.. ఇది మీలాంటోళ్ల కోసమే! మీరు ఆర్డర్ చేసిన ఫుడ్.. మీ టేబుల్ మీదకు రాకముందు ఎలా ఉంటుందో తెలుసా? మీరు తినే వెరైటీలు.. ఎలాంటి పదార్థాలతో తయారుచేస్తున్నారో చూస్తారా? చూసేయండి.. టేస్ట్ పేరిట అమ్ముతున్న వేస్ట్ ఏంటో!

ఎక్కడికెళ్లినా కల్తీ..

భాగ్యనగరంలో ఏ హోటల్‌కు వెళ్లినా, ఏ రెస్టారెంట్ కిచెన్ డోర్ ఓపెన్ చేసినా, ఏ ఫుడ్ ప్రొడక్ట్స్ గోడౌన్ గేటు తెరిచినా.. ఫుడ్ సేఫ్టీ అధికారులకు మైండ్ పోతోంది. ఎక్కడికెళ్లినా కల్తీ ఆహార పదార్థాలు, పాడైపోయిన పదార్థాలు, కిచెన్‌లో వ్యర్థాలే కనిపిస్తున్నాయ్. ఈమధ్యే అంతేరా రెస్టారెంట్ కిచెన్ చూసి.. పేరుగళ్ల హోటళ్లన్నీ ఇంతేనారా? అనుకున్నారు. ఇప్పుడు అలాంటి సీన్లు సిటీలో ఫుడ్ దొరికే ఏ చోటుకెళ్లినా కనిపిస్తున్నాయ్.

Advertisement

ఆకస్మిక దాడి..

చార్మినార్ దగ్గరున్న హుస్సేనీ ఆలంలో అక్రమంగా నిర్వహిస్తున్న మెసర్స్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్‌పై హెచ్-ఫాస్ట్ టీమ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌తో కలిసి ఆకస్మిక దాడి చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ లైసెన్స్ లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో నిషేధిత కృత్రిమ రంగులు, పాడైపోయిన వంట నూనెతో ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో 110 కిలోల ఫ్రైడ్ చికెన్, 6 టిన్నుల వంట నూనె, కెమికల్ కలర్స్‌ని స్వాధీనం చేసుకునున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Also Read: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. స్టార్ హీరో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు!

పనీర్ పేరుతో..

కల్తీ పనీర్ తయారీ కేంద్రాలపైనా.. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఒకేసారి 45 ఫుడ్ అవుట్‌లెట్లు, 8 తయారీ యూనిట్లలో సోదాలు చేశారు. 825 కిలోల కల్తీ పనీర్‌ని స్వాధీనం చేసుకున్నారు. చీజ్ అనలాగ్‌ని.. పనీర్ పేరుతో అమ్ముతున్నట్లు గుర్తించారు. సరైన వివరాలు లేకుండానే విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. స్టార్చ్, అధిక నీరు, నాన్ మిల్క్ ఫ్యాట్స్ కలిపి.. కల్తీ పన్నీర్ తయారు చేస్తున్నారు. సింథటిక్ పాలు, పామాయిల్, కెమికల్స్‌తో.. హైదరాబాద్ సహా ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కల్తీ పన్నీర్ తయారు చేస్తున్నారు. కెమికల్స్, క్వాలిటీ లేని పదార్థాలతో ఈ పనీర్ తయారుచేసి, నగరంలోని ప్రముఖ హోటళ్లు, డెయిరీ ఫామ్‌లు, మార్కెట్లకు సప్లై చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి కల్తీ ముఠాలపై.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్-ఫాస్ట్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పనీర్ కొనే ముందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు కలిగించే ఇలాంటి కల్తీలని నివారించేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు సిద్ధంగా ఉంటారని చెప్పారు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్.

హైదరాబాద్ ఫుడ్ లవర్స్..

హైదరాబాద్ హోటళ్లు, రెస్టారెంట్లలో జరుగుతున్న కల్తీకి, వ్యర్థ పదార్థాలకు ఇవి శాంపిల్స్ మాత్రమే. కడుపులో తిప్పేసే ఇలాంటి సీన్లు.. తనిఖీలు చేసిన ప్రతిసారీ కనిపిస్తూనే ఉంటాయ్. నగరంలో దొరికే కల్తీ ఫుడ్‌కు ఎప్పటికప్పుడు, ఎక్కడికక్కడ, ఫుడ్ సేఫ్టీ అధికారులు చెక్ పెట్టాలని, రెగ్యులర్‌గా తనిఖీలు నిర్వహించాలని.. హైదరాబాద్ ఫుడ్ లవర్స్, నగరవాసులు కోరుతున్నారు.

Also Read: ప్రియుడితో కలిసి భర్తను నీటి ట్యాంకులో తోసి చంపిన ఇన్‌ఫ్లుయెన్సర్!

Related News

Millionaire Migration: భారత్‌కు హెన్లీ రిపోర్ట్ బిగ్ షాక్.. దేశం దాటుతున్న ఇండియన్ కుబేరులు.. అసలు కారణాలివే..?

Trump Netanyahu: మిత్రుల మధ్య చిచ్చు పెట్టిన ఇరాన్ డీల్.. నెతన్యాహును ‘క్రేజీ’ అని తిట్టిన ట్రంప్..!

Parliament Numbers: రాజ్యాంగ సవరణకు మోదీ సర్కార్ అడుగులు.. ఆ 6 ఓట్ల కోసం డీఎంకేతో బీజేపీ దోస్తీ..?

Hangor Submarines: బంగాళాఖాతంలో మళ్లీ యుద్ధ మేఘాలు.. భారత్ ముంగిట్లోకి పాక్ సబ్‌మెరైన్లు..!

Temple Donations: రచ్చకెక్కిన అయోధ్య రామాలయం.. వజ్రాలు, బంగారం, హుండీ డబ్బులు మాయం..!

రోజంతా ఇంట్లోనే ఉంటావుగా.. ఏం చేస్తావు? అనేవారికి సుప్రీంకోర్టు చెంపదెబ్బ!

పెట్రోల్ బంకుల్లో కొత్త రూల్స్.. చమురు విక్రయాలపై కఠిన ఆంక్షలు.. పరిమితి విధింపు!

Big Stories

×