EPAPER

Global AI Summit: హైదరాబాద్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. రాజధానిగా మారనుందా?

Global AI Summit: హైదరాబాద్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. రాజధానిగా మారనుందా?

Hyderabad to Host Global AI Summit: ప్రపంచ టెక్నాలజీలో ప్రస్తుతం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కీలకంగా మారింది. ఇక, రాబోయే కాలమంతా కృత్రిమ మేధస్సుదేనని ఇప్పటికే స్పష్టమయ్యింది. ఈ తరుణంలో హైదరాబాద్ నగరం ఏఐ దిశగా పరుగులు పెడుతుంది. దీనికి ఊతమిస్తూ తెలంగాణ సర్కారు కూడా ఏఐ అభివృద్ధికి పెద్ద పీట వేస్తోంది. త్వరలో గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సదస్సుకు ఆతిథ్యమిస్తుంది. అయితే, భాగ్యనగరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మారనుందా? ఈ దిశగా సర్కారు తీసుకుంటున్న చర్యలేంటీ..? ఉద్యోగాల కల్పన ఎలా ఉండనుంది..?


ఐటీ రంగంలోనే విప్లవాత్మక మార్పులకు కేంద్రంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది. ఈ వాతావరణంలో హైదరాబాద్ నగరం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మారనుందా? అంటే అవునంటోంది తెలంగాణ సర్కారు. కృత్రిమ మేధస్సులో హైదరాబాద్ సాధిస్తున్న ప్రగతి చూస్తుంటే త్వరలోనే ఈ ప్రయత్నాలు ఫలిస్తాయనే సూచనలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం గణనీయంగా పెరుగుతుండటంతో దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీని దిశగా ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టగా… సెప్టెంబర్‌ 5-6 తేదీల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ కార్యక్రమం ఏఐ గ్లోబల్‌ సమ్మిట్‌ను భాగ్యనగరంలో నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని, వెబ్‌సైట్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు ఇటీవల ప్రారంభించారు.

హైదరాబాద్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ ఏఐ గ్లోబల్‌ సమ్మిట్‌ కార్యక్రమానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలైన గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా, యోట్టా, ఎన్‌విదియా వంటి టెక్నాలజీ కంపెనీలు భాగస్వాములుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఇండస్ట్రీ పార్ట్‌నర్స్‌ హైసీయా, సీఐఐ, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం, నాలెడ్జ్‌ పార్టనర్‌గా నాస్‌కామ్‌లు ఉన్నాయి. ఇక, హెచ్‌ఐసీసీ వేదికగా రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్‌పై దేశ, విదేశాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది తెలంగాణ సర్కారు. ఇప్పటికే సదస్సులో ప్రధానంగా చర్చించాల్సిన అంశాలను ఎంపిక చేసి, వాటిపై విస్త్రత అనుభవం ఉన్న నిపుణులతో కీలక ప్రసంగాలు చేసేలా.. షెడ్యుళ్లను నిర్ణయించారు. ఏఐ ఫర్‌ సోషల్‌ చేంజ్‌, సేఫ్‌ ఏఐ, పుషింగ్‌ బౌండరీస్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌, పారడిజిమ్‌ షిప్ట్‌ ఇన్‌ ఇండస్ట్రీ తదితర అంశాలపై నిపుణులు ఇక్కడ చర్చించనున్నారు.


ఇటీవల, గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ సమ్మిట్ లోగోను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నగరాన్ని ఏఐ సిటీగా మార్చేందుకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. సాంకేతిక ఆవిష్కరణలతో తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందంజలో ఉంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. ‘మేకింగ్ ఏఐ వర్క్ ఎవ్రీ వన్’ అనే కాన్సెప్ట్‌తో గ్లోబల్ ఏఐ సమ్మిత్ ఉంటుందని తెలిపారు. అయితే, సమాజానికి ఏఐ ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో, ఎలా సాధికారత కల్పిస్తుందో అన్వేషించటమే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతుంది. ఏఐ పరిజ్ఞానంతో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి… ప్రపంచం ఎదుట ఉన్న సవాళ్లను పరిష్కరించడానికి ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకు వీలుగా ఏఐ సామర్థ్యాలను అన్వేషించేందుకు ఈ సమ్మిట్ కీలక వేదికగా మారనున్నట్లు తెలుస్తోంది.

Also Read: బిగుస్తున్న ఉచ్చు.. కేసీఆర్, హరీష్, ఈటలకు నోటీసులు

హైదరాబాద్ నగరాన్ని ఏఐ రాజధానిగా మార్చడానికి కావాల్సిన అన్ని వనరులను సమకూరుస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియా పర్యటన సాగిందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. పలు కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. మొత్తం 19 కంపెనీలతో MOUలు కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి 31 వేల 500 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఇక, ఏఐ ప్రాధాన్యతను గుర్తించిన సీఎం రేవంత్ రెడ్డి 200 ఎకరాల స్థలంలో ‘ఏఐ సిటీ’ నిర్మాణాన్ని చేపడుతున్నారు. 2030 సంవత్సరానికల్లా ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఇప్పటికే పలుమార్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేస్తున్న ఏఐ సిటీ రూపకల్పనపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

ఇక, టెక్నాలజీ విద్యాసంస్థలు కూడా దీని దిశగా కోర్సులు రూపొందించాలనీ… విద్యార్థులను ఏఐ టెక్నాలజీ దిశగా ప్రోత్సహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని ఏఐ రాజధానిగా మార్చడం కోసం మేథావులు సూచనల మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ భవిష్యత్తు, కొత్త ప్రాజెక్టులకు నాంది పలికే అవకాశం ఉందని నిపుణులు కూడా ఒప్పుకుంటున్నారు. కాగా, ప్రభుత్వ పరిపాలన, పారిశ్రామిక రంగాల్లో కృత్రిమ మేధ వినియోగానికి అనుసరించాల్సిన విధానాలపై కూడా తెలంగాణ సర్కారు రోడ్‌ మ్యాప్‌ రూపొందిస్తోంది. అలాగే, హైదరాబాద్‌లో ఏఐ అభివృద్ధి కోసం, పెట్టుబడుల సాధనకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని ఇప్పటికే సర్కారు పిలుపునిచ్చింది. ఇటీవల అమెరికా పర్యటనల్లో దీనికి సంబంధించి పలువురు ఎన్నారైలతో సీఎం ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇలా వచ్చే ప్రవాస భారతీయులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందనే సందేశాన్ని సీఎం ఇచ్చినట్లు తెలుస్తోంది. .

Related News

Hindupuram Municipality Politics: బాలయ్య Vs జగన్.. ప్రతిష్టాత్మకంగా మారిన హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ పదవి పోరు

Nellore Nominated Posts: నెల్లూరు జిల్లాల్లో నామినేటెడ్ పోస్టుల టెన్షన్.. సెకండ్ లిస్టుపై కూటమి నేతల చూపులు.

Air India Flight Tricky Situation: 2 గంటలకు గాల్లోనే విమానం.. ఎయిర్ ఇండియా తిరుచురాపల్లీ-షార్జా ఫ్లైట్‌లో ఏం జరిగింది?

Kadapa Land Grabbing: కడప జిల్లాలో విచ్చలవిడిగా భూ కబ్జాలు.. వైసీపీ నేతల చేతుల్లో పేదల భూములు!

Mopidevi Shocks Jagan: టీడీపీలో చేరిన మోపిదేవి.. వాన్‌పిక్ కేసుల భయంలో జగన్!

Jagan INDIA Bloc: జగన్ తీరు అప్పుడలా.. ఇప్పుడిలా.. ఇండియా కూటమి వైపు చూపులు?

BJP BRS Alliance: బీఆర్ఎస్‌తో పొత్తా? నో.. నెవర్, హైడ్రా ఏమీ కొత్తదేం కాదు: బీజేపీ నేత కిషన్ రెడ్డి

Big Stories

×