E-Paper
Advertisement

రాజకీయాల్లోకి వచ్చి నష్టపోయా! లేకపోతే.. మరో పది హోటళ్లు పెట్టేవాడిని..! ఆల్తుఫాల్తు గాన్ని కాదు.. ఆదాయం ఊరికే రాలేదు…!

రాజకీయాల్లోకి వచ్చి నష్టపోయా! లేకపోతే.. మరో పది హోటళ్లు పెట్టేవాడిని..! ఆల్తుఫాల్తు గాన్ని కాదు.. ఆదాయం ఊరికే రాలేదు…!
Advertisement

డబ్బులు ఊరికే రావు.. అని బంగారు వ్యాపారి యాడ్‌ డైలాగ్‌లా.. ఆస్తులు ఉత్తగనే రాలే…! అని కేటీఆర్‌ తన ఆస్తులు, ఆదాయం పై  క్లారిటీ ఇచ్చాడివాళ. సిరిసిల్ల కేంద్రంగా సీఎం .. కేటీఆర్‌పై చేసిన ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల ఆస్తుల ప్రస్తావనపై కేటీఆర్‌ స్పందించాడు. తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

రేవంత్‌ రెడ్డి నేపథ్యాన్ని, కుటుంబ పరిస్థితులను ఏకరువు పెట్టిన కేటీఆర్‌.. ఆయనలా నేను పేద కుటుంబం నుంచి రాలేదని చెప్పుకొచ్చాడు. కేసీఆర్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి మొదలు పెట్టి, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, డిప్యూటీ స్పీకర్‌ పదవి.. ఇవన్నీ చెప్పుకొచ్చాడు. అప్పటికే తన చదవు, అమెరికా ఉద్యోగం గురించి ప్రస్తావించాడు.

Advertisement

2006లో రాజకీయాల్లోకి వచ్చి కేసీఆర్‌ వెంట నడిచానని చెప్పుకున్న కేటీఆర్‌.. అప్పుడే తను సంపాదించుకున్న సొమ్ముతో ఒక్క హోటల్ పెట్టుకున్నానని, అవిప్పుడు మూడు హోటళ్లుగా మారాయని వివరించాడు. అనవసరంగా రాజకీయాల్లో ఉంటూ నష్టపోయాను గానీ, అదే పూర్తి స్థాయిలో బిజినెస్‌ చేస్తే ఇలాంటి మరో పది హోటళ్లు పెట్టి ఉండేవాడినని కూడా చెప్పుకొచ్చాడు.

ఆ వెంటనే మళ్లీ ఏం వ్యాపారం చేసుకోవద్దా…? అది తప్పా..? ఇంత వ్యాపారం కూడా చేసుకోకపోతే.. పెండ్లాం పిల్లలను ఎలా పోషించుకుంటామని ఎదురు ప్రశ్నించాడు. తండ్రి 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారని, తాతకు ఆస్తులున్నాయని.. ఆ వివరాలు కూడా సీఎంకు ఇస్తానన్నాడు కేటీఆర్‌. ఇవన్నీ చెప్పడం వెనుక.. అంతటి బ్యాక్‌ గ్రౌండ్‌ ఉన్న నాకు ఈ చిన్నపాటి ఆస్తులు కూడా ఉండొద్దా..? ఇవేం పెద్ద ఆస్తులు కావే..? అన్నట్టుగానే సాగాయి కేటీఆర్‌ మాటలు.

Advertisement

తొమ్మిదో తరగతి చదివిన రేవంత్‌ తమ్ముడు కొండల్‌ రెడ్డి ఏరోస్పేస్‌ కంపెనీకి ఓనర్‌ అయ్యాడని, 200 కోట్ల జాగాను అప్పనంగా అప్పగించారని, అమెరికాలో ఉన్న మరో అన్న జగదీశ్‌రెడ్డి ఓ వెయ్యి కోట్లు తీసుకుని వచ్చి ఇక్కడ కంపెనీలు పెడతానని అంటున్నాడని, నువ్వో పెయింటర్‌వు.. నీ కుటుంబ నేపథ్యం నాకు తెలుసు.. మరి నీ కుటుంబమే మూడేండ్లలో ఇంతలా ఎదిగితే.. నా తండ్రి 45 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నాడు.. నేను అమెరికాలో జాబ్‌ చేసి సంపాదించి.. ఇక్కడ బిజినెస్‌ మొదలు పెట్టినా.. నాకు ఆస్తులుండవా? అని రేవంత్‌ను ప్రశ్నించాడు కేటీఆర్‌.

మొన్నటి దాకా..ఆస్తులపై దాటవేసేలా.. ఫామ్‌హౌజ్‌ నాదే కాదు అనేలా సాగిన కేటీఆర్‌ మాటలు .. ఇవాళ పూర్తిగా మారిపోయాయి. సిరిసిల్లలో సీఎం హోటళ్ల ప్రస్తావన తీయడంతో జనాల్లో ఇది చర్చకు వచ్చిందని భావించినట్టున్నాడు. అందుకే దీనిపై సుధీర్ఘ వివరణ ఇచ్చాడు కేటీఆర్‌.

భూస్వామ్య కుటుంబం, రాజకీయ నేపథ్యం.. బిజినెస్‌మెన్‌గా పెట్టుబడులు.. ఇలా మూడు రకాలుగా తనకు ఆదాయం సమకూరితే.. ఇంతపాటి ఆస్తులు ఉండవా? అన్నట్టుగానే సాగాయి కేటీఆర్‌ మాటలు. ఇవే కాదు.. రేపు మళ్లీ కొత్త ఆస్తుల లిస్టులు సీఎం బయటకు తెచ్చినా.. దీన్నీ బాజాప్తా ఒప్పుకుని.. అవును.. అవీ నావే.. ఏం వ్యాపారం చేయొద్దా..? అని ఎదురు ప్రశ్నించేందుకు కేటీఆర్‌ సిద్దమైనట్టుగానే అనిపించింది ఆ మాటల తీరు చూస్తుంటే.  మూడేండ్లలో మీరే అంత సంపాదిస్తుంటే.. మేము ఇది కూడా సంపాదించొద్దా? అనేదే .. ఆస్తుల చిట్టాపై సీఎంకు కేటీఆర్‌ ఇచ్చిన అల్టిమేట్‌ ఆన్సర్ గా జనం భావించాలని కేటీఆర్ భావనలా అనిపించింది.

Tags

Related News

గులాబీకి సవాల్‌గా ఖైరతాబాద్ ఎన్నిక.. సరైన అభ్యర్థి ఎంపికకోసం మల్లగుల్లాలు..!

ఈ టోల్ ఫ్రీ 1064 నెంబర్‌కి ఫిర్యాదు చేసేముందు ఇది చదవండి.. వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్!

నామినేటెడ్ పదవుల ఎంపికలో సీఎం రేవంత్ సంచలనం.. వారికే పెద్దపేట?

రేవంత్‌ పొలిటికల్‌ గేమ్‌లో సెల్ఫ్‌గోల్‌! అధికార పార్టీపై కౌంటర్‌ స్ట్రాటజీ అట్టర్‌ ఫ్లాప్.. తామే సీఎంకు అస్త్రాలను అంధించి..!

ముంబైలో షాకింగ్ ఘటన.. మళ్లీ జీవం వస్తుందని క్లినిక్‌లో 80 ఏళ్ల వృద్ధుడి బాడీ భద్రం!

సినిమా రేంజ్‌లో స్కెచ్చేసిన దొంగలు.. ఆర్టీసీ బస్సులో రూ.3 కోట్ల గోల్డ్ మాయం.. కానీ చివరకి..?

సకుటుంబ సపరివారానికీ.. తిట్ల తలంటు..! మీరిక వర్తమానం.. భవిష్యత్తు శూన్యం.. కొడుకు గడీనీ కూల్చుతాం!

Big Stories

Advertisement
×