E-Paper
Advertisement

వాట్సాప్‌లో ఈ 3 సీక్రెట్ ఫీచర్లు తెలుసా? మీ పని చాలా ఈజీ అయిపోతుంది!

వాట్సాప్‌లో ఈ 3 సీక్రెట్ ఫీచర్లు తెలుసా? మీ పని చాలా ఈజీ అయిపోతుంది!
Advertisement

WhatsApp Tips: వాట్సాప్ ఉపయోగించే చాలా మంది మెసేజ్ లు పంపడం, కాల్స్ చేయడం వంటి అంశాలకే పరిమితం అవుతారు. కానీ ఈ పనిని సులభతరం చేసే, ప్రైవసీని పెంచే ఎన్నో అద్భుతమైన ఫీచర్లను అస్సలు పట్టించుకోరు. అయితే ఆ ఫీచర్లను ఉపయోగిస్తే సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, వాట్సప్ వినియోగాన్ని మరింత ఈజీగా, సెక్యూర్ గా మార్చుకోవచ్చు. కాబట్టి ప్రతీ ఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన 3 కీలక వాట్సాప్ ఫీచర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.

ఫోన్ ఆఫ్ అయినా వాట్సాప్ వాడొచ్చు!

సాధారణంగా డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌లో వాట్సాప్ వెబ్ వాడాలంటే మొబైల్‌లో ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరి. కానీ ‘లింక్డ్ డివైసెస్’ (Linked Devices) ఫీచర్‌తో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. మీ ఫోన్ ఆఫ్ అయినా, బ్యాటరీ అయిపోయినా సరే.. కంప్యూటర్ లేదా ట్యాబ్‌లో వాట్సాప్ సేవలను అంతరాయం లేకుండా ఉపయోగించవచ్చు. రోజులో అధిక భాగం సిస్టమ్ ముందు కూర్చుని పనిచేసే ఉద్యోగులకు ఈ ఆప్షన్ ఎంతో ఉపయయోగపడనుంది. ఈ ఫీచర్ కోసం ఫోన్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘లింక్డ్ డివైసెస్’ ను క్లిక్ చేయాలి. అనంతరం వెబ్ లోని క్యూఆర్‌ కోడ్ స్కాన్ చేసి ఈ ఫీచర్ ను ఉపయోగించుకోవచ్చు.

‘వ్యూ వన్స్’, ‘డిసప్పియరింగ్ మెసేజెస్’

Advertisement

వ్యక్తిగత ఫోటోలు, కీలక డాక్యుమెంట్లు పంపేటప్పుడు ప్రైవసీ సమస్య తలెత్తకుండా వాట్సప్ కీలకమైన ఫీచర్ అందుబాటులో ఉంచింది. వాట్సాప్ అందిస్తున్న ‘వ్యూ వన్స్’ (View Once) ఆప్షన్ ద్వారా పంపిన ఫోటోలు లేదా వీడియోలను ఎదుటివారు ఒక్కసారి మాత్రమే చూసేందుకు వీలుకలుగుతుంది. వారు చూసిన వెంటనే అవి ఆటోమేటిక్‌‌గా డిలీట్ అవుతాయి. అలాగే ‘డిసప్పియరింగ్ మెసేజెస్’ (Disappearing Messages) ఫీచర్ ఉపయోగించి.. నిర్దిష్ట సమయం తర్వాత చాట్‌లు తమంతట తామే అదృశ్యమయ్యేలా సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల ప్రైవసీతో పాటు ఫోన్ స్టోరేజ్ కూడా వృథా కాకుండా ఉంటుంది.

Also Read: ఇదేందయ్యా ఇది.. కుక్కలు, పిల్లులకు ప్రత్యేక ఆలయాలు.. తరలివెళ్తున్న పెంపుడు జంతువులు!

‘ఆర్కైవ్ చాట్స్’ (Archive Chat)

Advertisement

వాట్సప్ చాటింగ్ లో అనవసరమైన పాత మెసేజ్‌లు ఉంటే.. అలాంటి చాట్‌లను డిలీట్ చేయకుండా దాచడానికి ‘ఆర్కైవ్ చాట్’ (Archive Chat) ఉపయోగపడుతుంది. పనిచేసి పూర్తయిన ప్రాజెక్ట్ గ్రూప్‌‌లు, ఆఫర్ మెసేజ్‌లు వంటి వాటిని ఆర్కైవ్‌లో పెడితే ఇన్ బాక్స్ కాస్త ఫ్రీగా కనిపిస్తుంది. భవిష్యత్తులో అవసరమైనప్పుడు ఆ చాట్ లను మళ్లీ వెనక్కి తెచ్చుకునే వెసులుబాటు కూడా ఈ ఫీచర్ ద్వాలా వాట్సప్ కల్పిస్తోంది. మెుత్తంగా వాట్సాప్‌ను కేవలం సమాచార మార్పిడికే కాకుండా.. రోజువారీ పనిని వేగవంతం చేసే సాధనంగా మార్చుకోవడానికి ఈ ఫీచర్లు ఎంతగానో తోడ్పడతాయి.

Also Read: కొత్త మెుబైల్ నెంబర్ తీసుకుంటున్నారా? ఏ అంకెలు ఉంటే అదృష్టం? ఏ సంఖ్యలతో దురదృష్టం!

Tags

Related News

బడ్జెట్‌లో నెంబర్-1 కిచెన్ అప్లయెన్స్..ఈ మిక్సీ మిస్సయ్యారంటే కష్టమే!

టీనేజర్ల కోసం వాట్సప్ కీలక నిర్ణయం.. ఇకపై ఆ ఆప్షన్ మారాలంటే పేరెంట్స్ పర్మిషన్ కావాల్సిందే!

ఇంటినే థియేటర్‌గా మార్చే Noise Soundbar.. ధర రూ.4,999 నుంచే!

సగం ధరకే మోటరోలా 100 ఇంచుల టీవీ, ఫీచర్లకు చూస్తే మతిపోతుంది !

ఇలాంటి డివైజ్ ఒక్కటి ఉంటే చాలు.. ఫోన్, వాలెట్, తాళాలు ఎక్కడున్నా నిమిషాల్లో పట్టేయవచ్చు!

కొత్త మెుబైల్ నెంబర్ తీసుకుంటున్నారా? ఏ అంకెలు ఉంటే అదృష్టం? ఏ సంఖ్యలతో దురదృష్టం!

ఫిట్‌నెస్ ప్రియులకు ఇదొక్కటి చాలు.. గుండె వేగం నుంచి ఆక్సిజన్ వరకు అన్నీ ఈ బ్యాండ్ గుప్పిట్లోనే!

Big Stories

Advertisement
×