E-Paper
Advertisement

రవితేజ వివేక్ ఆత్రేయ సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్?

రవితేజ వివేక్ ఆత్రేయ సినిమాకు అదిరిపోయే టైటిల్ ఫిక్స్?
Advertisement

Raviteja -Vivek Athereya: టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ(Raviteja) ఇరుముడి సినిమా (Irumudi)ద్వారా సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే.గత కొద్దిరోజులుగా వరుస ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న ఈ మాస్ హీరో డివోషనల్ టచ్ ఇస్తూ ఇరుముడి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఊహించని విధంగా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం థియేటర్లలో మాత్రమే కాకుండా డిజిటల్ మీడియాలో కూడా ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభించింది.

హర్రర్ కామెడీ నేపథ్యంలో..

ఇలా ఇరుముడి సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో రవితేజ తదుపరి సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే రవితేజ పలు సినిమాలో షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు అయితే ఈయన ఇటీవల మరొక అండ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో(Vivek Athereya) మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ పనులన్నీ కూడా పూర్తి అయినట్టు సమాచారం. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

తులాభారం టైటిల్ లాక్..

Advertisement

వివేక్ ఆత్రేయ రవితేజ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా హర్రర్ జోనర్ లో ఉండబోతుందని తెలుస్తోంది. రవితేజ ఇప్పటికే ఎన్నో విభిన్నమైన జోనర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ హర్రర్ జోనర్ మాత్రం ఇప్పటివరకు టచ్ చేయలేదు ఈ నేపథ్యంలోనే వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమా హర్రర్ జోనర్ లో సమాచారం ఇక ఈ సినిమాకు “తులాభారం”(Thulabharam) అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా విభిన్నమైన టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయం తెలియడంతో ఈ సినిమా పై కూడా కొంచెం అంచనాలు ఏర్పడ్డాయి.

దసరా సందర్భంగా పూజ కార్యక్రమాలు..

ఇలా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అతి త్వరలోనే ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారకంగా ప్రకటించబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ పనులన్నీ ఇప్పటికే పూర్తి కావడంతో దసరా పండుగను పురస్కరించుకొని ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో రవితేజకు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan)హీరోయిన్ గా నటించగా బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై లక్ష్మణ్, శ్రీని నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే ఈ విషయాలన్నింటినీ కూడా చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించబోతున్నారు. మరి ఇరుముడి వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత రవితేజ ఇదే జోష్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Advertisement

Also Read: రూ.46 కోట్ల చెక్కు వివాదం… సీసీబీ విచారణకు హాజరైన రాధ!

Related News

అల్లు రామలింగయ్య జయంతి.. గుడ్ న్యూస్ చెప్పిన అల్లు అర్జున్!

ది ప్యారడైజ్ డైరెక్టర్ శ్రీకాంత్ మోహన్ బాబును మోసం చేశాడా?

అక్టోబర్లో థియేటర్లలో విడుదల కాబోతున్న చిత్రాలివే!

మంచిగా ఉంటూనే తొక్కేయాలని చూస్తుంటారు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు!

షూటింగ్లో గాయపడ్డ అమితాబ్ బచ్చన్.. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే?

మోహన్‌లాల్ తో నటించడంపై భాగ్యశ్రీ ఎమోషనల్ పోస్ట్!

‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ లాంఛ్ డేట్ ఫిక్స్.. ఆ అనుమానాలు మీకొద్దు- నిర్మాత నాగవంశీ!

Big Stories

Advertisement
×