India Pakistan: కుక్క తోకే కాదు.. పాక్ బుద్ధి కూడా మారదు అని టైమొచ్చినప్పుడల్లా బయటపడుతూనే ఉంటుంది. ఈసారి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వేదికగా.. మరోసారి అది ప్రూవ్ అయింది. పాకిస్థాన్‌కు ఐక్యరాజ్యసమితి వేదికగా గట్టిగా బదులిచ్చింది భారత్. UN సర్వసభ్య సమావేశంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు దీటుగా సమాధానమిచ్చింది. జమ్ము కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్‌పై ఆయన చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. యూఎన్‌లో భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ పేటల్ గెహ్లాట్.
జమ్ముకశ్మీర్‌పై తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించారు షరీఫ్. గతేడాది ఇరుదేశాల మధ్య జరిగిన సైనిక ఉద్రిక్తతలపై తమ వైఖరిని వివరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారలేదన్నారు. కశ్మీర్ అంశంపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారత్ స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత భూభాగమేనని.. షరీఫ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఇండియా. అంతేకాదు.. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు పేటల్. ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించుకునే హక్కు తమకుందని తెలిపారు. పాకిస్థాన్ పదేపదే ఒకే రకమైన ఆరోపణలు చేసినంత మాత్రాన అవి నిజాలు కావన్నారు.
అంతర్జాతీయ వేదికలపై దాయాది పాకిస్థాన్ అబద్ధపు ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఉగ్రవాదం, మోసం, కపటమైన చర్యలతో.. ప్రపంచ దేశాలను మభ్యపెట్టాలని చూస్తోంది. కానీ ఎప్పటికప్పుడు భారత్ వాటిని తిప్పికొడుతూనే ఉంది. వాస్తవాలేంటో.. ప్రపంచం ముందు ఉంచుతోంది.
Also read: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్!