Mohan Babu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) ఇటీవల కాలంలో సినిమాల పూర్తిగా తగ్గించారు. ఈయన కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు. తాజాగా శ్రీకాంత్ ఓదెల(Sreekanth Odela) దర్శకత్వంలో నాని (Nani)ప్రధాన పాత్రలో నటించిన ది ప్యారడైజ్ (The Paradise)సినిమాలో శికంజా మాలిక్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. విలన్ పాత్రలో మోహన్ బాబు తన అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా విడుదల ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో చిత్ర బృందం నేడు సాయంత్రం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా మోహన్ బాబు మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇటీవల కాలంలో దర్శకులు చాలామందిని చూశాను కానీ శ్రీకాంత్ ఓదెల తరహా దర్శకుడిని తాను ఎక్కడ చూడలేదని తెలిపారు ఆయనకి ఉన్న టాలెంట్ చూస్తే మాత్రం ఇండియాలోనే నెంబర్ వన్ దర్శకుడు అవుతాడు అంటూ మోహన్ బాబు శ్రీకాంత్ పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఇండస్ట్రీలో నెంబర్ వన్ డైరెక్టర్ అవుతావని, ఇండస్ట్రీ ఎవడి అబ్బ సొత్తు కాదు.. టాలెంట్ ఉన్న వారిని కళామతల్లి ప్రోత్సహిస్తుంది అంటూ మోహన్ బాబు మాట్లాడారు.
ఇండస్ట్రీ ఒకరి సొత్తు కాదని టాలెంట్ ఉంటే ఎవరైనా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారనే ఉద్దేశంతో మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే మోహన్ బాబు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈయన కొంతమందిని ఉద్దేశించే ఈ కామెంట్స్ చేశారు అంటూ అభిమానులు మరింత వైరల్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో సో కాల్డ్ పెద్ద అనుకునే వారి గురించి మోహన్ బాబు ఈ కామెంట్స్ చేశారా? అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. మోహన్ బాబు ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశారనే విషయం పక్కన పెడితే టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వటానికి ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ ఉండాల్సిన పని లేదనే విషయం అందరికీ తెలిసిందే. ఇలా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ అందుకున్న వారు ఎంతో మంది ఉన్నారు.
ఇక శ్రీకాంత్ ఓదెల దసరా సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యారు. తన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న శ్రీకాంత్ అనంతరం నానితోనే తన రెండో సినిమా ది ప్యారడైజ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన తదుపరి సినిమా నాని నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ రాబోతోందని తెలుస్తోంది.
Also Read: మలేషియాలో బ్యాన్ చేసిన కీర్తి సురేష్ బోల్డ్ మూవీ.. తెలుగులో రిలీజ్, ఎప్పుడంటే?