Big Stories

Danger Mangoes: ఈ మామిడి యమ డేంజర్ గురూ.. జర జాగ్రత్త

Chemical Carbide Mango Fruits
 
- Advertisement -

మ్యాంగో సీజన్ వచ్చేసింది.ఆర్టిఫిషియల్ మాజా బాటిల్స్‌ను పక్కనపెట్టి.. అసలు సిసలు మామిడిని ఎంజాయ్ చేసే సమయం ఇది. కానీ కాస్త ఆగండి అంటున్నారు డాక్టర్స్.. మార్కెట్లో పసుపు పచ్చగా నిగనిగలాడుతూ కనిపించే మ్యాంగోస్‌ను కొంటే.. కేవలం పండ్లనే కాదు.. వ్యాధులను కూడా కొని ఇంటికి తెచ్చుకున్నట్టే అని వార్న్ చేస్తున్నారు. దీనికి వాళ్లు చెప్పే రీజన్.. అవి పండే పద్ధతి..

- Advertisement -

సీజన్‌కు తగ్గట్టుగా వ్యాపారం చేయడం వ్యాపారుల పని. అదే ప్రజల వీక్‌నెస్‌ను బేస్‌ చేసుకొని వ్యాపారం చేయడం ఓ దందా.. ఇప్పుడిదే దందా చేస్తున్నారు పండ్ల వ్యాపారులు.. పండు అది తనంత తానుగా పండే వరకు వెయిట్ చేయకుండా.. కెమికల్స్‌ను ఉపయోగిస్తున్నారు. విషయం పాతదే అంటారా.. కానీ వివరణ కొత్తది. కాల్షియం కార్బైడ్.. ఈ మొత్తం వ్యవహారంలో మెయిన్ కల్‌ప్రిట్..ఈ కెమికల్‌తోనే పండ్లను త్వరగా మాగేలా చేస్తారు.. అలాంటి పండు తింటే జ్వరం, దగ్గు లాంటివి ఇమిడెట్‌గా.. క్యాన్సర్, నాడీ వ్యవస్థ తినడం లాంటి సమస్యలు చాలా ఆలస్యంగా వస్తాయంటున్నారు డాక్టర్స్..

Also read: కాంగ్రెస్ మూడో జాబితా విడుదల.. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్..

ఇంతకీ ఏంటి కాల్షియం కార్బైడ్.. 1988లో స్టార్టైంది ఈ కెమికల్ యూసేజ్..సున్నం, కోక్ మిశ్రమాన్ని ఎలక్ట్రిక్ ఫర్నెస్‌లో దాదాపు 2 వేల డిగ్రీల టెంపరేచర్ వద్ద మండిస్తే ఏర్పడుతుంది.
ఈ హై టెంపరేచర్‌లో నైట్రోజన్‌ కలిసినప్పుడు కాల్షియం సైనమైడ్‌ ఏర్పడుతుంది. దీన్ని ఎరువుగా వాడుతారు.. స్టీల్ ఫ్యాక్టరీలో కూడా ఉపయోగిస్తారు.. అయితే కాల్షియం కార్బైట్ కాస్త తేమతో కలిసిప్పుడు
ఎసిటిలీన్‌ అనే గ్యాస్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ గ్యాస్‌ పండ్లను మాగేలా చేస్తుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.

కానీ ఈ కెమికల్‌లో 20 శాతం మలినాలు ఉంటాయి.. అంతేకాదు కొద్దిగా ఆర్సెనిక్, ఫాస్పరస్‌ కాంపౌండ్‌లు ఉంటాయి.. ఇవే ఇప్పుడు ప్రజల ప్రాణాలకు ముప్పులా మారేవి.. ఈ కాంపౌండ్స్ ఎసిటాల్డిహైడ్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీని వల్లే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు.. ఈ గ్యాస్‌ మెదడుకు ఆక్సిజన్ సప్లైను తగ్గిస్తుంది. ఇదే జరిగితే నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు చర్మంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. నిద్రపట్టనివ్వదు.. లంగ్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇవన్నీ అప్పటికప్పుడే జరగవు.. మెల్లిగా ఎఫెక్ట్‌ చూపిస్తాయి..

ఈ విషయాలన్ని గమనించే చాలా దేశాల్లో కాల్షియం కార్బైడ్‌లతో పళ్లను మాగించడాన్ని నిషేధించారు.. మన దేశంలో కూడా ఉంది ఈ నిషేధం. ప్రివెన్షన్ ఆఫ్‌ ఫుడ్ అడల్టరేషన్‌ యాక్ట్ 44ఏఏ ప్రకారం ఇలాంటి పళ్లపై నిషేధం ఉంది.. మరి ఇది అమలవుతుందా? అంటే నో అనే ఆన్సర్.. అడపాదడపా తనిఖీలు తప్ప.. పూర్తి స్థాయిలో చర్యలు ఏ ఇయర్‌లోనూ జరగలేదు. ఈ ఇయర్‌లో జరుగుతాయన్న భరోసా కూడా లేదు.

ప్రభుత్వ నిషేధం ఉంది.. ప్రజల ఆరోగ్యానికి ముప్పని తెలుసు.. మరి అయినా కార్బైడ్‌ను ఎందుకు వాడుతున్నారు వ్యాపారులు.. సింపుల్ ఆన్సర్.. మనీ.. పండు చెట్టుపైనే పండాలి.. ఆ తర్వాత కోయాలి.. మార్కెట్‌కు తీసుకురావాలి.. ఇవన్నీ జరగాలంటే టైమ్ కావాలి..కానీ అంత ఓపిక మనకెక్కడిది. కాయ పచ్చిగానే ఉన్నప్పుడు కోసి.. మార్కెట్‌కు తీసుకొచ్చి మగ్గపెడితే.. కలర్‌కు కలర్ ఉంటాయి.. రేటుకు రేటు దక్కుతుంది.. ఈ వ్యాపారులు అత్యాశే ఇప్పుడు ప్రజల ప్రాణాలు తీస్తోంది.

Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్ రావు పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు..

ఈసారి అధికారులు కాస్త ముందుగానే మేల్కోన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న కెమికల్ మ్యాంగో దందా గుట్టురట్టు చేశారు.. ఐదు గోడౌన్స్‌లో తనిఖీలు చేసి.. 4 క్వింటాళ్ల మామిడి పండ్లను సీజ్ చేశారు.. అంతేకాదు.. ఇథలీన్, కాల్షియం కార్బైడ్, కాల్షియం ఎసిటైలైడ్ కెమికల్​ పౌడర్ ప్యాకెట్లను సీజ్ చేశారు.. ఈ రెయిడ్స్‌లో కొన్ని కీలక పాయింట్స్ తెరపైకి వచ్చాయి.. అవేంటంటే ఇలా మాగపెట్టిన పండ్లు బహిరంగ మార్కెట్లోకి ఎన్ని వస్తున్నాయో.. అదే స్థాయిలో మనకి తెలీకుండా మన వద్దకి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా జ్యూస్ సెంటర్స్‌కు ఎక్కువగా వెళుతున్నాయి ఈ మ్యాంగోస్.. సో ఇకపై జ్యూస్‌ సెంటర్లలో మీరు మ్యాంగో జ్యూస్ తాగేముందు.. ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి..

మరి మాగపెట్టిన మామిడికి.. మాములుగా పండిన మామిడికి తేడా ఏంటి? ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ ఉంది.. చాలా తేడా ఉంటుంది ఈ రెండు రకాల పండ్ల మధ్య.. కలర్‌ఫుల్‌గా నిగనిగలాడుతూ కనిపిస్తుందా.. అయితే అది మాగిన పండే.. ఎందుకంటే నాచురల్‌గా పండిన పండు అంత కలర్‌ఫుల్‌గా ఉండదు.. మచ్చలు మచ్చలుగా ఉంటుంది. ఇంకా నాచురల్ పండ్లలోనే రసం ఎక్కువగా ఉంటుంది.. టెస్ట్ కూడా అదిరిపోతుంది. మాగిన పండ్లలో మీకు ఆ టెస్ట్ కనిపించదు..

సో ఇకపై మామిడిపండ్లను కొనేప్పుడు కళ్లకు కాకుండా మెదడుకు పని పెట్టండి. మంచి మామిడి పండ్లనే కొనుక్కెళ్లండి.. రోగాలను కాదు.. అంతేకాదు మీ చుట్టుపక్కల ఎక్కడైనా గోడౌన్స్‌లో ఈ దందా జరుగుతున్నట్టు కనిపిస్తే.. వెంటనే ఫుడ్ సెఫ్టీ అధికారులకు ఇన్ఫర్మేషన్‌ ఇవ్వండి.. ఇలా చేస్తే కొంతమందికైనా మీరు హెల్ప్‌ చేసినవారవుతారు..

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News