Yoga Benefits: జీవితం నిండా టెన్షన్స్ టెన్షన్స్. బతుకు మొత్తం భారమై పోతోంది. ఇన్ని సమస్యలకు ఒకటే వైద్యం ఏదైనా ఉందా? ఎన్ని టాబ్లెట్స్ వేసుకున్నా నయం కావడం లేదు. ఎన్నేసి టానిక్కులు తాగినా బలం రావడం లేదు. మనసుకు ప్రశాంతత లేదు. జీవితానికంటూ ఒక విశ్రాంతి లేదని తెగ బాధ పడిపోయేవారికి సింగిల్ విండో సొల్యూషన్ యోగా. ఈ యోగా డే సందర్భంగా అసలేంటీ విధానం? ఇందులో దాగిన మానసిక శారీరక ఆరోగ్య రహస్యమేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
భారత గడ్డపై పుట్టి విశ్వవ్యాప్తమైన అద్భుత విద్య యోగా.. వేల ఏళ్ల క్రితం పతంజలి మహర్షి అందించిన ఈ జీవన సూత్రం, నేడు ప్రపంచానికి ఆరోగ్య సంజీవనిగా మారింది. కేవలం శారీరక వ్యాయామంగా కాకుండా, శరీరాన్ని, మనస్సును ఏకం చేసే ఒక దివ్య సాధనంగా గుర్తింపు పొందింది యోగా. 2014లో ఐక్యరాజ్యసమితి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిన తర్వాత… నేడు కుల, మత, దేశ సరిహద్దులు దాటి ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోంది. శ్వాసపై ధ్యాసతో విశ్వాన్ని గెలుస్తున్న భారతీయ వారసత్వపు విజయ గాథే యోగా..
ఉరుకుల పరుగుల జీవితం అంతా ఒత్తిడి, ఆందోళన. ఆంటీస్, అంకుల్స్‌కి ఏదైనా జబ్బు చేస్తే భారీ మెడికల్ బిల్స్. ఇర బిజినెస్ పీపుల్‌కి నిత్యం టెన్షన్ టెన్షన్. కానీ, వీరంతా కలసి యోగా చేస్తే నో బిల్స్- ఓన్లీ బెనిఫిట్స్. బీపీ, సుగర్, పీసీఓడీ వంటి జబ్బులకి యోగా ఒక సహజ సిద్ధమైన మందు. ఇక చదివింది మర్చిపోయే స్టూడెంట్స్‌కి ఏకాగ్రత పెరగాలన్నా, జ్ఞాపకశక్తి అద్భుతంగా మారాలన్నా యోగాసనాలు, ప్రాణాయామమే ఏకైక మార్గం. జిమ్‌లకు వెళ్లి బాడీని అలిసిపోయేలా చేయడం కాదు… యోగాతో అంతర్గత శక్తిని మేల్కొల్పడమే అసలైన ఫిట్‌నెస్.
Also read: South Telangana: ఆ నాలుగు జిల్లాలపై గులాబీ దళం నయా స్కెచ్.. పట్టు కోసం కేటీఆర్ వేసిన స్కెచ్ ఇదే..?
యోగా చేయడం పెద్ద కష్టమేమీ కాదు. వయసుతో నిమిత్తం లేకుండా, ఇంట్లోనే రోజుకు కేవలం పావుగంట కేటాయిస్తే చాలు. సూర్య నమస్కారాలతో రోజంతా ఎనర్జీ.. ప్రాణాయామంతో ఊపిరితిత్తులకు సరికొత్త బలం. మన పెరటి వైద్యంలో ఇన్నేసి గుణగణాలు ఉండగా, మందుల వైపు ఎందుకు వెళ్లడం? అందుకే యోగ చేసెయ్- ఆరోగ్యంగా జీవించేయ్ అంటూ.. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీరూ ఒక సంకల్పం తీసుకోండి యోగాను మీ జీవితంలో భాగం చేసుకోండి అంటారు మన పెద్దలు.
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు… చేతిలో స్మార్ట్‌ఫోన్, కళ్ల ముందు స్క్రీన్. ఫలితం? నిద్రలేమి, డిప్రెషన్, మెడనొప్పి. వీటికంటూ ఏ మందులు లేవు… కావాల్సింది డిజిటల్ డిటాక్స్. రోజుకు 10 నిమిషాలు కళ్లు మూసుకుని చేసే భ్రామరి ప్రాణాయామం.. మెదడును శాంతపరుస్తుంది. శవాసనం రోజంతా పడ్డ అలసటను చిటికెలో మాయం చేస్తుంది. స్క్రీన్ టైమ్‌ని తగ్గించండి… యోగా టైమ్‌ని పెంచండి. మీ మెంటల్ హెల్త్‌ని మీరే కాపాడుకోండి.. అంటారు మన యోగా గురూస్.
పిల్లలు చదువుపై శ్రద్ధ పెట్టట్లేదా? ఎప్పుడూ ఫోన్లే లోకమా? అయితే వారికి మీరివ్వాల్సింది తిట్లు, శాపనార్ధాలు కాదు… యోగాసనాలు నేర్పించండని సూచిస్తారు మన గురువులు. మరీ ముఖ్యంగా పిల్లల చేత వృక్షాసనం వేయించడం వల్ల.. వారిలో కాన్ సన్ ట్రేషన్ తో పాటు మెంటల్, బాడీ బ్యాలెన్స్ అద్భుతంగా పెరుగుతాయి. పద్మాసనం వారి మైండ్‌ని షార్ప్‌గా మారుస్తుంది. చిన్నప్పటి నుంచే యోగా అలవాటు చేస్తే… ఆస్పత్రుల చుట్టూ తిరిగే పనే ఉండదు. పిల్లల భవిష్యత్తుకు యోగా ఒక బూస్టర్ డోస్ గా పని చేస్తుందంటే అతిశయోక్తి కాదేమో.
Also read: ఇష్టపడి చదవండి.. దేశానికే ఆదర్శం కాండి.. విద్యార్థులకు సీఎం రేవంత్ పిలుపు!
ఇల్లు, ఆఫీస్… రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితం… ముప్పై ఏళ్లకే థైరాయిడ్, పిసిఒడి, మోకాళ్ల నొప్పులు. మహిళలకు యోగా ఒక వరం. బటర్ ఫ్లై ఆసనం హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది. భుజంగాసనం నడుము నొప్పులకి గుడ్ బై చెబుతుంది. మీ కుటుంబానికి మీరే కదా వెన్నుముక… మరి మీ ఆరోగ్యం కోసం ఒక పావుగంట కేటాయించలేరా? అని అంటారు మన యోగా నిపుణులు.
వయసు పైబడింది కదా అని మూలన కూర్చోవద్దు. మోకాళ్ల నొప్పులు, డయాబెటిస్ ఉన్నా సరే యోగా మీ కోసమే ఉంది. కష్టమైన ఆసనాలు వేయక్కర్లేదు కుర్చీలో కూర్చుని చేసే ఛైర్ యోగా, కేవలం ఊపిరి పీల్చి వదిలే ప్రాణాయామం, కపాలభాతి చేస్తే చాలు. రక్త ప్రసరణ మెరుగవుతుంది, గుండె పదిలంగా ఉంటుంది. మెడికల్ బిల్స్ తగ్గించుకుని, ప్రశాంతంగా వృద్ధాప్యాన్ని ఎంజాయ్ చేయాలంటే యోగా ఒక్కటే మార్గం.
భారత్‌లో పుట్టిన యోగా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రూపాలు సంతరించుకుంది. హాలీవుడ్ స్టార్స్ నుంచి ఇంటర్నేషనల్ అథ్లెట్ల వరకు అంతా యోగా మాయలో పడిపోయారు. నీటిలో చేసే ఆక్వా యోగా, గాల్లో తేలుతూ చేసే ఏరియల్ యోగా ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్స్. రూపాలు మారినా… ఇచ్చే ఫలితం మాత్రం ఒక్కటే… అది ఆరోగ్యం. వెస్ట్రన్ కంట్రీస్ ఏ రేంజ్‌లో యోగాని ఓన్ చేసుకుంటున్నాయో చూస్తే మనకు ఆశ్చర్యం కలగక మానదు!