BigTV English

Death of Nasralla: 80 టన్నుల బాంబులతో.. నస్రల్లాను ఎలా చంపారంటే..!

Death of Nasralla: 80 టన్నుల బాంబులతో.. నస్రల్లాను ఎలా చంపారంటే..!

Israel killed Hezbollah leader Hassan Nasrallah in Beirut strike: దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌తో నస్రల్లా చేసిన పోరాటం ఇక్కడితో ముగిసింది. ఇంత సుదీర్ఘ కాలంలో హిజ్బుల్లాను ఎంత వ్యాప్తి చేయగలిగాడో… అంతే, అనూహ్యమైన వాతావరణంలో నస్రల్లా ప్రాణాలు కోల్పోయాడు. లెబనాన్‌లో హీరోగా ఎదిగి, ఇజ్రాయెల్ చంపిన తీవ్రవాద నేతగా గుర్తింపు పొందాడు. అయితే ఈ పరిణామం, మిడిల్ ఈస్ట్ యుద్ధంలో కీలక మలుపుకు కారణం అవుతుందనడంలో మాత్రం సందేహం లేదు.


దశాబ్ధాలుగా ఇజ్రాయెల్‌తో జరిగిన యుద్ధాలే అరబ్ దేశాల్లో హసన్ నస్రల్లా స్థానాన్ని మరింత పఠిష్టం చేశాయని చెప్పాలి. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ 30 ఏళ్ల ఆక్రమణను ముగించడంలో నస్రల్లా నాయకత్వంలోని హిజ్బుల్లా కీలక పాత్ర పోషించింది. సిరయా ఆక్రమణను అణగదొక్కిన తర్వాత, 2000లో ఇజ్రాయెల్ ఆక్రమణకు హిజ్బుల్లా ఫుల్ స్టాప్ పెట్టింది. అయితే, 2006లో ఇజ్రాయెల్-హిజ్బుల్లా 34 రోజుల యుద్ధం తర్వాత ఇజ్రాయెల్‌పై విజయం ప్రకటించి మధ్యప్రాచ్య దేశాల్లో నస్రల్లా హీరో అయ్యాడు. ఈ యుద్ధం తర్వాత, నస్రల్లా ఇజ్రాయెల్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న బింట్ జెబిల్ అనే చిన్న పట్టణానికి వెళ్లి, తన కెరీర్‌లో అత్యంత ప్రముఖంగా నిలిచిన ప్రసంగం చేశాడు. “అణ్వాయుధాలు ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ ‘స్పైడర్ వెబ్‌లా బలహీనంగా ఉంది’ అని ఆ ప్రసంగంలో నస్రల్లా పేర్కొన్నాడు. అంత శక్తివంతమైన ఇజ్రాయెల్‌ను పూచిక పుల్లాలా తీసిపేరేశాడు. సరిగ్గా, ఇదే వ్యక్తిత్వం నస్రల్లాను అరబ్ ప్రపంచానికి, “పాలస్తీనాలోని పీడిత ప్రజలకు” మరింత దగ్గర చేసింది.

ఇజ్రాయెల్ తమ సైన్యాన్ని ఓడించడాన్ని చూస్తూ పెరిగిన చాలా మంది సాధారణ అరబ్బుల గౌరవాన్ని 2006 విజయంతో నస్రల్లా తిరిగి తెచ్చినట్లయ్యింది. అయితే, సౌదీ అరేబియా వంటి సున్నీ పవర్‌హౌస్‌లకు సవాలుగా ఉన్న హిజ్బుల్లా, దాని లబ్ధిదారు ఇరాన్ మధ్యప్రాచ్యంలో చాలా మంది శత్రువులను కూడా సృష్టించాయి. దశాబ్దాలుగా, నస్రల్లా ఒక ఫాంటమ్‌లా పనిచేసిన తరుణంలో సున్నీ శక్తులను రెచ్చగొట్టాడు, ఇజ్రాయెల్‌ను రక్తపాతంలో ముంచాడు. హిజ్బుల్లా వేసే రాకెట్ల ప్రవాహాన్ని ఎదుర్కునే క్రమంలోనే ఇజ్రాయెల్ తన పౌరులను ఉత్తర ఇజ్రాయెల్ నుండి బలవంతంగా తరలించాల్సి వచ్చింది. గత ఏడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌లోకి హమాస్‌ చొరబాటు జరిగినప్పటి నుంచి హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పైకి 8 వేల రాకెట్లను ప్రయోగించింది. నస్రల్లా నాయకత్వంలో ఇజ్రాయెల్‌ను హిజ్బుల్లా ముప్పు తిప్పలు పెట్టింది.


Also Read: హెజ్బొల్లాకు భారీ షాక్.. చీఫ్ హసన్ నస్రల్లా మృతి

కుంది. ఇటీవల, లెబనాన్‌లో హిజ్బుల్లా సభ్యులే లక్ష్యంగా ఒకే సమయంలో వేలాది పేజర్, వాకీ-టాకీలను పేల్చేసి హిజ్బుల్లాకు వణకుపుట్టించింది. ఈ పేలుళ్లతో హిజ్బుల్లా కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను, దాని వేలాది మంది సైనికుల్ని నిర్వీర్యం చేసింది. ఒక విధంగా ఇది ఆల్-అవుట్ దాడికి ఓపెనింగ్‌గా మారింది. ఆ తర్వాత, ఒక వారం వ్యవధిలోనే నలుగురు సీనియర్ హిజ్బుల్లా నాయకులను ఎలిమినేట్ చేసింది ఇజ్రాయెల్. హిజ్బుల్లా మిస్సైల్ రాకెట్ ఫోర్స్ హెడ్, ఇబ్రహీం ముహమ్మద్ కబీషీ, హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ రద్వాన్ ఫోర్స్ కమాండర్ ఇబ్రహీం అకిల్, అత్యున్నత ర్యాంకింగ్ కమాండర్ ఫౌద్ షుక్ర్… ఇలా దాదాపుగా తొమ్మిది మంది కీలక లీడర్లను హతమార్చింది. వీళ్ల తర్వాత, నస్రల్లాను లక్ష్యంగా చేసుకుని హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై బాంబు దాడికి దిగింది. ఈ దాడి, నస్రల్లా మరణం కోసమే అని కూడా ఇజ్రాయెల్ స్పష్టంగానే చెప్పింది. ఈ దాడిలో ఇజ్రాయెల్ ఉపయోగించిన టన్నుల కొద్దీ మందుగుండు సామాగ్రి… హిజ్బుల్లాతో జరిగిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్‌కు ఎవ్వరూ రెడ్ లైన్ గీయలేరని నిరూపించాయి.

హసన్ నస్రల్లా మృత్యువు కంట పడని నాయకుడే కావచ్చు.. కానీ, ఇజ్రాయెల్ మాత్రం వెంటాడి వేటాడి, ప్రాణాలు తీసింది. ఇప్పుడు హిజ్బుల్లా చేతులు తెగిన మొండెం. ఇటీవల, హమాస్ నేత ఇస్మాయిల్ హనియే తర్వాత, ఇప్పుడు హిజ్బుల్లా అధినేత నస్రల్లా మృతి ఇజ్రాయెల్‌కు పెద్ద విజయాలనే చెప్పాలి. ఇది హిజ్బుల్లా ఉనికికి, అంత కంటే ఎక్కువగా, ఇరాన్ వ్యూహాలకు అతిపెద్ద సవాలనే చెప్పాలి. నస్రల్లా మరణంతో మిడిల్ ఈస్ట్ యుద్ధంలో ఏదైనా జరగొచ్చు. అయితే, ఇదొక కీలక మలుపుగా ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ చర్యలకు ఇరాన్ గానీ, లెబనాన్ గానీ తీవ్రమైన కక్షతో రగిలిపోతూ ఉండొచ్చు గాక, కానీ, ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధపడతారని కచ్ఛితంగా చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే, ఆర్థికంగా నిలిగిపోతున్న లెబనాన్ ఆ ధైర్యం చేయకపోవచ్చు. ఇక, “మాకు యుద్ధం వద్దు, పాలస్తీనాలో శాంతి కావాలి” అని చెబుతున్న ఇరాన్ కూడా తొందరపడకపోవచ్చు. అయితే, యుద్ధం ఎప్పుడూ ఆవేశంతోనే ముడిపడి ఉంటుంది. ఆ ఆవేశం ఎప్పుడు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే, మిడిల్ ఈస్ట్‌లో నస్రల్లాకు కాలం చెల్లిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో, భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×