E-Paper
Advertisement

మూడున్నర కోట్ల మందికి అమ్మను అవుతా.. సెంటిమెంట్‌తో కవిత పొలిటికల్ మాస్టర్ ప్లాన్..?

మూడున్నర కోట్ల మందికి అమ్మను అవుతా.. సెంటిమెంట్‌తో కవిత పొలిటికల్ మాస్టర్ ప్లాన్..?
Advertisement

Kavitha Party: చరిత్ర ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఆ చరిత్రను తిరగరాయాలనుకోవడానికి దమ్మూ ధైర్యం ఉండాలి. అవన్నీ గుండెల నిండుగా తనకున్నాయంటూ తెలంగాణలో సరికొత్త రాజకీయ పార్టీకి శ్రీకారం చుట్టారు కల్వకుంట్ల కవిత అన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో జాగృతి జెండా పట్టారు. గల్లీగల్లీల్లో బతుకమ్మతో ఉద్యమాన్ని ఉత్తేజం చేశారు. ఇప్పుడు అదే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర సేనగా ముందుకొచ్చారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఆత్మ తన పార్టీలో ఉంటుందన్నారు. తెలంగాణలో ఏ సమస్యలున్నాయ్.. జనం ఎక్కడ నిదారణకు గురవుతున్నారు. ఇవన్నీ లైనప్ చేసి పెట్టుకున్నారు. వాటిపైనే తన పోరాటమ ని కవిత అన్నారు.

ఒకరు వేసిన బాటలో నడవడం కాదు

మహిళల శక్తికి, యువత ఉత్సాహానికి, రైతుల కష్టాలకు, పేదల ఆకాంక్షలకు ఒక కొత్త గొంతుకగా మారుతానంటూ ముందుకొచ్చారు. తెలంగాణ సామాజిక న్యాయం, అభివృద్ధి, మహిళా సాధికారత కోసం పని చేస్తానన్నారు. నాయకత్వం అంటే కేవలం అధికారం కాదు.. నిలబడే ధైర్యం ఉండాలంటారు. ఆ ధైర్యం తానే అవుతానన్నారు కవిత. ఉక్కు సంకల్పంతో దూసుకెళ్తామన్నారు. ఒకరు వేసిన బాటలో నడవడం కాదు… తనకంటూ ఒక కొత్త బాటలో నడుస్తానని క్లారిటీ ఇచ్చారు. తన తొలి ప్రసంగంలోనే పాంచజన్యం పూరించారు. కనీస వసతులు కూడా అందట్లేదన్నారు. 5 అంశాలను అజెండాగా తీసుకున్నారు. విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యవసాయం, సామాజిక న్యాయం తన ప్రాధాన్య అంశాన్నారు. తెలంగాణలో ఉన్న మూడున్నర కోట్ల మందికి అమ్మగా మారాలనుకుంటున్నానని, బిడ్డల కష్టం అమ్మకే తెలుస్తుందని, అప్పుడే రాష్ట్ర ప్రజల కష్టాలు తీరతాయన్న మాట చెప్పడం ద్వారా కవిత అందరినీ సెంటిమెంట్ తో ఆకట్టుకున్నారు. సో కవిత పూరించిన కొత్త పార్టీ సమర శంఖారావంతో తెలంగాణలో పొలిటికల్ ఆట మారడం ఖాయమే అంటున్నారు.

ఎవరెవరికో పదవులు..

Advertisement

బీఆర్ఎస్ లో ఏ కార్యకర్తకూ గౌరవం దక్కలేదన్నారు. ఎవరెవరికో పదవులు ఇచ్చి అసలైన వారిని విస్మరించారని చెప్పడం ద్వారా ఘాటు కౌంటర్ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ తెలంగాణ ఆత్మను కోల్పోయిందని చెప్పడం ద్వారా గులాబీదళంపై అసంతృప్తిగా ఉన్న వారిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం తొలి సందర్భంలోనే చేశారు కవిత.
ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. రాత్రికి రాత్రి వచ్చిన నాయకురాలు కాదు కవిత. ఈ విషయాలన్నిటినీ తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉంటారు.
ఉద్యమంలోనే జాగృతి కమిటీలను నియమించుకున్నారు. చెప్పాలంటే జాగృతి పేరుతో ఒక దశలో సమాంతరంగా ఉద్యమం నడిపించారు.

Also Read: గుడ్ న్యూస్.. నర్సాపూర్ మున్సిపాలిటీ నగర అభివృద్ధికి రూ.15 కోట్లు..!

కవిత స్పీచ్ లో ఆమె ఆత్మవిశ్వాసం

Advertisement

నిజానికి తెలంగాణ జాగృతికి ఎవరి వెన్నుదన్నూ లేకపోయినా సమర్థంగా నడిపించారు కవిత. తన సత్తా ఏంటో పొలిటికల్ గా ఇప్పటికే నిరూపించుకున్నారు. ఇప్పుడు కొత్త పార్టీ పెట్టడం ద్వారా మరింత దూకుడు పెంచడం ఖాయంగానే కనిపిస్తోంది. ప్రారంభించి వెనుదిరిగే తత్వమైతే కవితది కాదంటున్నారు ఆమె సన్నిహితులు. అందుకే ఎందాకైనా కొట్లాడేందుకే కొత్త పార్టీతో ముందుకొచ్చారని గుర్తు చేస్తున్నారు. ఈ రోజుల్లో పార్టీ పెట్టడం, నడిపించడం అంత ఈజీ కాదు. అందులోనూ మహిళా నేత. అయితేనేం.. తాను ఎక్కడా తగ్గేది లేదంటున్నారు. కవిత స్పీచ్ లో ఆమె ఆత్మవిశ్వాసం కనిపించింది. తెలంగాణ రాజకీయాలను శాసిస్తానన్న నమ్మకం కనిపించింది. దశాబ్దాలుగా జనం పడుతున్న కష్టాల నుంచి గట్టెక్కిస్తానన్న దమ్ము కనిపించింది.

వ్యతిరేకమని డైరెక్ట్ మెసేజ్..?

తన అన్నకు ఏమీ తెలియదని, కేసీఆర్ మన మనిషి కాదు మర మనిషి అంటూ కవిత చెప్పడం ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలెట్. చివరికి సొంత కుటుంబ సభ్యులను కూడా సభా వేదికపై నుంచే టార్గెట్ చేయడం కీలకమైన విషయం. ఇక మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్ అన్న సిగ్నల్స్ ను పంపించారు. గుంటనక్కలు, తోడేళ్ల చేతుల్లో కేసీఆర్‌ బందీలయ్యారని చెప్పడం, పార్టీ నుంచి తనను పంపించేశారని చెప్పడం ద్వారా తన సానుభూతి పెంచుకునే ప్రయత్నమైతే చేశారు కవిత. ప్రజలకు ఏ కష్టం వచ్చినా కేసీఆర్ బయటకు రారు అని చెప్పడం ద్వారా ఇకపై తానే జనంలో ఉంటానని చెప్పుకొచ్చారు. తాను మునుపటి టీఆర్ఎస్ కు, మునుపటి కేసీఆర్ కు మాత్రమే ఫ్యాన్ అని, ఇప్పుడు మారిన బీఆర్ఎస్, మారిన కేసీఆర్ కు వ్యతిరేకమని డైరెక్ట్ మెసేజ్ ఇచ్చారు. అదే సమయంలో ప్రభుత్వంపై సూటి విమర్శలు చేయడం ద్వారా తమ పార్టీ ప్రజలవైపు ధైర్యంగా నిలబడే ప్రతిపక్షంగా ఉంటుందని చెప్పడం ద్వారా తమ స్టాండ్ ఎవరికీ ఏ టీమ్, బీ టీమ్ కాదని చెప్పేశారు. కేసీఆర్ దగ్గర్నుంచి రేవంత్, బీజేపీ దాకా అందరినీ అటాక్ చేశారు కవిత.

సీఎం రేవంత్ హిట్లర్..

తెలంగాణ రాష్ట్ర సేన చీఫ్ కల్వకుంట్ల కవిత పార్టీ ఆవిర్బావ సభలో రాష్ట్ర బీజేపీ నేతలకూ సవాల్ విసిరారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తీసుకువచ్చే దమ్ముందా అని క్వశ్చన్ చేశారు. బీజేపీకి మొదటి నుంచి తెలంగాణరాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదు.. తల్లిని చంపి బిడ్డను తీశారన్న పాయింట్ ను ప్రస్తావించారు. తెలంగాణను భారత్, పాక్ విభజనతో పోల్చిన ఎంపీపై ఎవరూ ఎందుకు మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. అటు ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా తన తొలి స్పీచ్ లోనే కడిగి పారేశారు. సీఎం రేవంత్ ను హిట్లర్ అని, కర్కోటకుడు అంటూ ఘాటుగా విమర్శించారు. చాలా ఉదాహరణలు చెప్పి ఎక్కడెక్కడ ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకోలేదో వివరించారు. ప్రశ్నించారు కూడా సో పార్టీ ప్రకటించిన రోజు కవిత అన్ని పార్టీలను టార్గెట్ చేయడం ద్వారా తన జెండా, అజెండా ఏంటో జనానికి చెప్పే ప్రయత్నం చేశారు.

Also Read: కుంభ మేళా తరహాలో గోదావరి పుష్కరాలు.. సర్కార్ ప్లాన్ ఇదే..?

మమతా బెనర్జీ..

ఇన్నాళ్లూ ఒక పార్టీలో ఉండడం వేరు. ఇప్పుడు ఏకంగా కొత్త పార్టీ పెట్టి నడిపించడం వేరు. చాలా మంది పార్టీలు పెట్టి.. చివరకు పొలిటికల్ గా అడ్రస్ గల్లంతైన వారూ ఉన్నారు. కొందరు లీడర్లే సక్సెస్ చూశారు. పార్టీ పెట్టి నడపడం అంత ఈజీ విషయం కాదన్న సంగతి తెలుసు. పొలిటికల్ గా వచ్చే విమర్శలను, ఆఖరికి వ్యక్తిగత విమర్శలను కూడా తట్టుకుని నిలబడేందుకే వచ్చారు. అన్నిటికి మించి ప్రజల్లో ఒక మూమెంట్ తీసుకొచ్చి తమవైపు తిప్పుకునే కెపాసిటీ కూడా ఉంది. పార్టీలు పెట్టిన వారిలో జయలలిత, ఆ తర్వాత మమతా బెనర్జీ లాంటి వాళ్లు సక్సెస్ చూశారు. ఇప్పుడు తెలంగాణలో కవిత పెట్టిన పార్టీ రాజకీయాల్లో ఒక పరీక్షగా మారింది. ప్రజలను కన్విన్స్ చేయడం, ప్రత్యర్థులు ఫెయిల్ అయిన విషయాలను జనంలోకి తీసుకెళ్లడం ఇవన్నీ ఇప్పుడు కవిత పార్టీ ముందు కీలకంగా మారబోతున్నాయ్.

మహిళా రిజర్వేషన్ల కోసం

మహిళా నేతగా ఎవరికీ లేని బలాలు కవితకు ఉన్నాయ్. కవితకు వాక్చాతుర్యం ధాటిగా ఉంది. నాయకత్వ పటిమ ఉంది. ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తం చేయడంలో గతంలో కీ రోల్ పోషించారు. మహిళా రిజర్వేషన్ల కోసం ఆమె చేసిన పోరాటం మహిళా ఓటర్లను ఆకర్షించే ఛాన్సెస్ ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ జాగృతిని ఒక వ్యవస్థీకృత సంస్థగా నడిపిన అనుభవం కవితకు ఉంది. జిల్లాల వారీగా ఆమెకు ఇప్పటికే ఒక కేడర్ ను రెడీ చేశారు. ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం పాలనపై పట్టు పెంచుకునేలా చేసింది. కవితక్క దూసుకెళ్లడం ఖాయమని ఆమె పార్టీ కార్యకర్తలు నమ్మకంగా కనిపిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి..

కవిత ప్రభావం ఇప్పటికే నిజామాబాద్, సహా కొన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉంది. దక్షిణ తెలంగాణలో పార్టీని విస్తరించడం కీలకం. పార్టీ సంస్థాగతంగా నిర్మాణం, జిల్లా, మండలస్థాయి బలం, ఫండింగ్ ఇలాంటివి ముఖ్యం కాబోతున్నాయ్. BRS ఓటు బ్యాంక్ బేస్‌ను ఎక్కువగా ఆకర్షించడం ముఖ్యమే. అసలైన తెలంగాణ ఆత్మ తమతోనే ఉందని చెప్పడం, ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని చెప్పడం ద్వారా వారందరినీ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ కలిసి వచ్చేలా పార్టీ పేరును డిసైడ్ చేశారు. అయితే ఈ పార్టీ పేరు చుట్టూ అడ్డంకులు క్రియేట్ అవుతాయా అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి వేరు, తెలంగాణ రాష్ట్ర సేన పేరు వేరు, షార్ట్ కట్స్ ను ఈసీ చూడదంటున్నారు అనలిస్టులు.

Also Read: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తప్పదా.. ప్రీతిరెడ్డి అడుగులు కమళం గూటికేనా..!

కొత్త ఫార్ములాతో కవిత..

ఇతర పార్టీలు పట్టించుకోని అంశాలు తీసుకోవడం, దగా పడ్డ వారిని దగ్గర తీయడం కీలకంగా మారుతోంది. అదే సమయంలో స్కిల్ మరో రకంగా చూపించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్. అధికారంలో ఉన్న పార్టీలు, బలం ఉన్న పార్టీలతో పోలిస్తే.. కొత్త ఫార్ములాతో కవిత దూసుకెళ్లాలంటున్నారు. ప్రజల్లో తిరిగి ఓటు అడిగితే ఎవరూ వేయరని.. కొత్త ఫార్ములాతో వారిని ఆకర్షిస్తేనే సాధ్యమన్న వాదన వినిపిస్తోంది. ఆ కొత్త ఫార్ములా కవిత దగ్గర ఉందా అన్నది తేలాలి.

కవిత పార్టీ ఫ్యూచర్..

టీఆర్ఎస్ పెట్టారు బాగుంది. అయితే పేరొక్కటే ఫైనల్ కాదు. రాజకీయాల్లో సక్సెస్ కు చాలా అంశాలుంటాయ్. పొలిటికల్ స్పేస్ ను క్రియేట్ చేసుకోవడం, ఇష్యూస్ టేకప్ చేయడం, ఆ ఇష్యూస్ ను జనం నమ్మడం ఇవన్నీ కవిత పార్టీకి కీలకం కాబోతున్నాయ్. పేరు కంటే కంటెంట్ మ్యాటర్ అంటున్నారు. ఆ కంటెంట్ నే ఐడెంటిఫై చేయాలంటున్నారు ఎనలిస్టులు. సమర్థతా ఉంది.. కవిత పార్టీ ఫ్యూచర్ ఏంటన్నది సమర్థత, పార్టీ తీసుకునే కంటెంట్ పైనే ఆధారపడుతుంది. ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేస్తారో చూడాలి.

Storey By Appa Rao Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×