E-Paper
Advertisement

ఖైరతాబాద్‌పై కాంగ్రెస్‌లో మొదలైన పరేషాన్.. జంకుతున్న ఆ కీలక నేతలు?

ఖైరతాబాద్‌పై కాంగ్రెస్‌లో మొదలైన పరేషాన్.. జంకుతున్న ఆ కీలక నేతలు?
Advertisement

Khairatabad Bypoll: స్వేచ్చ బ్యూరో: ఖైరతాబాద్ బై ఎలక్షన్ కొరకు ఎవరిని ఇన్ చార్జ్ గా నియమించాలనే అంశంపై టీపీసీసీ స్టడీ చేస్తున్నది. అసాధారణ పరిస్థితుల్లో ఉప ఎన్నికలు నెలకొన్న నేపథ్యంలో మంత్రులు కూడా ఇన్ చార్జ్ లుగా వ్యవహరించేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం. రాష్ట్రంలో పవర్ లో ఉన్నప్పటికీ, ఖైరతాబాద్ పరిస్థితులపై పార్టీ తర్జన భర్జన పడుతున్నది. పార్టీ నాయకత్వంలో ఒకరకమైన అభద్రతాభావం స్పష్టంగా కనిపిస్తోంది.

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్..

కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పరిస్థితులు ఖైరతాబాద్ లో ఉంటాయా? నాయకులంతా సమన్వయంగా పనిచేసే పరిస్థితి ఉన్నదా? నియోజకవర్గం ప్రజల మూడ్ ఎలా ఉన్నది? అనే అంశాలపై పార్టీ అధ్యయనం చేస్తుంది. అంతేగాక నియోజకవర్గంలో ఉన్న స్థానిక, గ్రేటర్ ఓటర్లు, విద్యావంతులు, వ్యాపార వర్గాల మూడ్ ఎలా ఉందనే దానిపై కూడా రహస్య సర్వేలు నిర్వహిస్తోంది.క్షేత్రస్థాయిలో దిగువ శ్రేణి నాయకులు, కార్యకర్తల సమన్వయం ఎలా ఉందనే దానిపై పార్టీ నివేదికలు తెప్పించుకుంటోంది. ఒక వైపు సర్వేలు చేపిస్తున్నప్పటికీ..ముందుండి నడిపించేందుకు ముఖ్యనేతలెవ్వరూ ఆసక్తి చూపకపోవడం గమనార్హం. ఇదే అంశంపై త్వరలో మంత్రులందరితో టీపీసీసీ కీలక రివ్యూ నిర్వహించే అవకాశం ఉన్నది.

Advertisement

Also read: వైర్డ్ ఇయర్‌ఫోన్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఎందుకు ఇవ్వరో తెలుసా?

కారణాలు ఇవేనా…?

బాధ్యతలు తీసుకోవడానికి మంత్రులు వెనుకంజ వేయడానికి బలమైన రాజకీయ సమీకరణాలే కారణమని తెలుస్తోంది. ఇటీవల గ్రేటర్ పరిధిలోని కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ పరిణామాలను, అక్కడ ఎదురైన సవాళ్లను నేతలు నిశితంగా పరిశీలిస్తున్నారు.ఈ రెండు సెగ్మెంట్లలో పార్టీ గెలిచినప్పటికీ, పార్టీ పడిన శ్రమ, ఖర్చైన ఆర్ధిక వనరులను అంచనా వేసి ఇన్ చార్జ్ హోదాపై చాలా మంది నేతలు ఇంట్రస్ట్ గా లేనట్లు తెలుస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ నగరం , ఐటీ కారిడార్‌ను ఆనుకుని ఉన్న ఖైరతాబాద్ లాంటి సెంట్రల్ సెగ్మెంట్లలో ఓటర్ల ట్రెండ్ సంపూర్ణంగా భిన్నంగా ఉంటోంది.ఒకవేళ ఉపఎన్నిక ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించి, ఫలితం తేడా వస్తే.. అధిష్టానం దృష్టిలో ఇమేజ్ తగ్గడంతో పాటు సొంత మంత్రిపదవికి, రాజకీయ భవిష్యత్తుకు ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన మంత్రుల్లో వ్యక్తమవుతోంది.పైగా ప్రతిష్టాత్మకమైన పోరులో నెగ్గకపోతే పొలిటికల్ గానూ తమ క్యారీర్ డ్యామేజ్ అవుతుందనే భ్రమల్లో ముఖ్య నేతలు ఉన్నారు. దీంతోనే ఏదో ఒక నెపంతో ఈ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

అధికారంలో ఉన్నా.. పార్టీలో తీరని ‘పరేషాన్’!

Advertisement

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. యంత్రాంగం అంతా చేతిలో ఉంది. కానీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ సెగ్మెంట్ లో గెలుపు గుర్రాన్ని నిలబెట్టడం, ఎన్నికల్లో విజయం సాధించడం పార్టీకి అంతా సులువుగా లేదనేది సమాచారం. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఈ ఉపఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని శక్తులన్నీ ఒడ్డటానికి సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతల్లోనూ కాస్త అలజడి నెలకొన్నది. పైగా సంక్షేమ పథకాల అమల్లో ఉన్న లోటుపాట్లు, పట్టణ ప్రాంత సమస్యలపై గ్రేటర్ ఓటర్లలో ఉన్న అసంతృప్తి తమకు ప్రతికూలంగా మారుతుందేమోనన్న భయం పార్టీని వెంటాడుతోంది.

Also read: తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై వేటు?

Tags

Related News

ఖైరతాబాద్ ఎఫెక్ట్.. తెలంగాణ బీజేపీపై అమిత్ షా ఫుల్ ఫోకస్!

తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రూ. 2.50 కోట్లతో కొత్త ప్రాజెక్ట్!

నిమజ్జనం పాటలను కూడా వదలని కేటీఆర్‌..! కేసీఆర్‌ను జనం మరవలేదని చెప్పేందుకు మరీ ఇంత అల్పత్వమా? ఆ సినిమా చూసి… కేసీఆర్‌ను తక్కువ చేసి…

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై వేటు?

రహస్య స్నేహితుడిని కాదని అడుగు బయటపెట్టగలడా…? సొంతంగా బలం నిరూపించుకోవాలనే తండ్లాటే..!

“G9 బొగ్గు అక్కడ.. చెత్త బొగ్గు ఇక్కడ!”.. సింగరేణి దందాను బయటపెట్టిన జగదీశ్వర్ రెడ్డి!

కాంట్రాక్టులు.. కమిషన్లు.. అభివృద్ధి అంటే ఇదేనా? BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్

Big Stories

Advertisement
×