E-Paper
Advertisement

‘ది ప్యారడైజ్’ పై కేటీఆర్ ట్వీట్…ప్రియదర్శి రియాక్షన్ ఇదే!

‘ది ప్యారడైజ్’ పై కేటీఆర్ ట్వీట్…ప్రియదర్శి రియాక్షన్ ఇదే!
Advertisement

KTR On The Paradise Movie: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ది ప్యారడైజ్ (The Paradise). ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ విడుదల అయ్యి మంచి ఆదరణ సొంతం చేసుకుంటుంది. ఇక ఈ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమాలో కొంచెం పొలిటికల్ టచ్ కూడా ఉంది ఇందులో పొలిటికల్ లీడర్స్ అయిన ఎన్టీరామారావు అలాగే కెసిఆర్ పాత్రల గురించి కూడా చూపించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో కెసిఆర్ పాత్ర(KCR Role) కూడా చూపించారు.

ది ప్యారడైజ్ పై కేటీఆర్ ట్వీట్..

ఈ సినిమాలో కెసిఆర్ పాత్రలో ప్రముఖ నటుడు ప్రియదర్శి(Priyadarshi) నటించిన సంగతి తెలిసిందే. ఇలా కెసిఆర్ పాత్రలో ప్రియదర్శి చాలా చక్కగా సెట్ అయ్యారు. ఈయన పాత్ర కేవలం నాలుగు నిమిషాలు ఉన్నప్పటికీ సినిమాని మొత్తం మలుపు తిప్పిందని చెప్పాలి. అయితే తాజాగా ఈ సినిమాని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎమ్మెల్యేలతో కలిసి సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో గత రాత్రి ఈ సినిమా వీక్షించారు. అనంతరం ఈయన సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు సంబంధించి చేస్తున్న పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం..

Advertisement

ఈ సినిమా గురించి కేటీఆర్ స్పందిస్తూ..”అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం.సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు.. కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు..తమ్ముడు ప్రియదర్శికి ప్రత్యేక అభినందనలు.. చావు నోట్లో తల పెట్టయినా…మీకు గుర్తింపు తెస్తా!! అది ఎవరో మీకు తెలుసు కదా” అంటూ ఈయన సినిమా గురించి చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Advertisement

ఈ సినిమా గురించి కేటీఆర్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ వేయడంతో ఈ ట్వీట్ పై నటుడు ప్రియదర్శి స్పందిస్తూ.. “పెళ్లిచూపులు సినిమా నుంచి ది ప్యారడైజ్ వరకు మీరు నా సినిమాల పట్ల సుపెట్టిన ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు..కృతజ్ఞుడిని రామన్న” అంటూ ప్రియదర్శి కేటీఆర్ ట్వీట్ పై రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా గురించి ఇటీవల కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సినిమా మూడు గంటలు అయితే కేసీఆర్ గారు ఉన్నది కేవలం నాలుగు నిమిషాలనే ఆ నాలుగు నిమిషాలు సినిమాని కీలక మలుపు తిప్పింది అంటూ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే మొదట్లో కాస్త నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతుంది. నాని సినీ కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా ఈ చిత్రం రికార్డులు సృష్టించిందని చెప్పాలి.

Also Read: నా జూలియట్ ఎక్కడ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ పోస్ట్?

Related News

‘ఎవరో నన్ను ఫాలో అవుతున్నారు’.. కృతి సనన్ షాకింగ్ పోస్ట్

నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే – నివేదా పేతురాజ్!

నా జూలియట్ ఎక్కడ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ పోస్ట్?

‘కల్కి 2’లో దీపికా స్థానంపై నాగ్ అశ్విన్ క్లారిటీ!

సినీ ఇండస్ట్రీలో విషాదం.. టాలీవుడ్ డైరెక్టర్ భార్య మృతి!

మిస్టర్ బీస్ట్‌తో రణ్‌బీర్.. ‘జై శ్రీరామ్’ అనిపించిన హీరో!

హిట్లర్ అనుకున్నా కానీ LKG పిల్లాడు..మోహన్ బాబు పై శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్

Big Stories

Advertisement
×