E-Paper
Advertisement

షూ లేస్ కడుతుంటే ఊపిరి ఆడటం లేదా? మీకు ఈ ఆరోగ్య సమస్య ఉన్నట్లే

షూ లేస్ కడుతుంటే ఊపిరి ఆడటం లేదా? మీకు ఈ ఆరోగ్య సమస్య ఉన్నట్లే
Advertisement

Bendopnea| షూ లేస్ కట్టుకోవడానికి కిందకు వంగినప్పుడు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపిస్తుందా? చిన్న పని చేస్తున్నప్పుడు ఇలా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడాన్ని చాలామంది సాధారణ సమస్యగా భావిస్తారు. అయితే, తరచూ ముందుకు వంగినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

ఈ ఆరోగ్య సమస్యనే వైద్య పరిభాషలో బెండోప్నియా (Bendopnea) అంటారు. ఇది కొన్ని సందర్భాల్లో గుండె వైఫల్యంతో సంబంధం కలిగి ఉండవచ్చు. అయితే బెండోప్నియా ఉన్నంత మాత్రాన గుండె సమస్యలు ఉన్నట్లు నిర్ధారించలేం.

ముందుకు వంగినప్పుడు ఊపిరి ఎందుకు ఆడదు?

Advertisement

బెండోప్నియా అంటే ముందుకు వంగిన కొద్దిసేపటికే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం. షూ లేస్ కట్టుకోవడం లేదా నేలపై ఉన్న వస్తువును తీసుకోవడానికి వంగడం సమయంలో ఇది కనిపిస్తుంది. ముందుకు వంగినప్పుడు శరీరంలో రక్త ప్రసరణ, గుండెలో ఒత్తిడి కాసేపు మారుతుంది. ఇప్పటికే గుండె సమస్యులున్నావారిలో ఈ మార్పు మరింత ఇబ్బంది కలిగిస్తుంది. దీంతో కొంతమందికి ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది.

బెండోప్నియాకు గుండెపోటుతో సంబంధం ఉందా?

గుండె సంబంధిత సమస్యలు ఉంటే గుండె పూర్తిగా పనిచేయడం ఆగిపోతుందని అర్థం కాదు. శరీర అవసరాలకు సరిపడా రక్తాన్ని పంప్ చేయడంలో గుండె సామర్థ్యం తగ్గినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, కాళ్ల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే కొన్ని పరిశోధనల్లో బెండోప్నియా వల్ల గుండెపై అధిక ఒత్తిడి పడుతుందని తేలింది.
అయితే బెండోప్నియాను గుండెపోటు వస్తుందని నిర్ధారించే లక్షణం కాదు. గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.

ఇతర లక్షణాలను కూడా గమనించండి

Advertisement

ముందుకు వంగినప్పుడు శ్వాస ఇబ్బందితో పాటు మరికొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయా గమనించండి. కాళ్లు లేదా మడమల దగ్గర వాపు, అసాధారణ అలసట వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. నిరంతరం దగ్గు రావడం లేదా పడుకున్నప్పుడు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం కూడా గమనించాలి. శరీరంలో అదనపు ద్రవం చేరితే కారణం లేకుండా బరువు పెరగడం కూడా జరుగుతుంది. ఈ లక్షణాలు తరచూ కనిపిస్తే వైద్యుడిని సంప్రదించడం అవసరం.

Also Read: మీ పార్ట్‌నర్ మిమ్మల్ని ముందులాగా ప్రేమించడం లేదా? నిశ్శబ్దంగా ఈ 5 సంకేతాలతో తెలుసుకోండి

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?

ముందుకు వంగిన ప్రతిసారీ లేదా తరచూ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వస్తే వైద్య సలహా తీసుకోండి. సొంతంగా లక్షణాలను చూసుకుని గుండె సమస్యను నిర్ధారించుకోవద్దు. వైద్యుడు మీ లక్షణాలు, ఆరోగ్య చరిత్ర, శారీరక పరిస్థితిని పరిశీలించవచ్చు.
అవసరమైతే తగిన గుండె పరీక్షలను కూడా సూచించవచ్చు. సమస్యకు అసలు కారణాన్ని త్వరగా గుర్తించడం సరైన చికిత్సకు సహాయపడుతుంది.

Also Read:ఎంజాయ్ కోసం లవ్ కోరుకుంటున్న యువత.. ఆ ప్రమాదముందని హెచ్చరిస్తున్న నిపుణులు

Related News

ఈ 5 రకాల వ్యక్తులతో స్నేహం చేస్తే మీ జీవితం నాశనమే.. ప్రశాంతంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు పాటించండి

‘పెద్ద పెద్ద కలలు కనడం సరిపోదు వాటిని..’ ప్రతిరోజూ చదవాల్సిన మోటివేషనల్ కోట్స్

పురుషుల కోసం కొత్త బర్త్ కంట్రోల్ పిల్.. ఎలా పనిచేస్తుందంటే?

‘మమ్మీ స్విగ్గీలో పిజ్జా ఆర్డర్ చేయవా..’ 10 మినిట్ ఫుడ్ డెలివరీతో పిల్లల్లో చెడు అలవాట్లు

తరచూ పనీర్ తింటున్నారా? అయితే ‘అనలాగ్ పనీర్’ గురించి తప్పక తెలుసుకోండి!

క్యాన్సర్ రీలాప్స్ అంటే ఏమిటి? చికిత్స తర్వాత మళ్లీ క్యాన్సర్ రావడానికి అసలు కారణాలివే!

పీరియడ్స్ సమయంలో తలనొప్పి, వాంతులు, వెలుతురు పడకపోవడం? కారణం ఇదే..

Big Stories

Advertisement
×