E-Paper
Advertisement

కేంద్ర ప్రభుత్వానికి బిగ్ షాక్.. సర్ వివాదంపై స్పష్టత కోరిన ఎన్డీయే మిత్రపక్షాలు!

కేంద్ర ప్రభుత్వానికి బిగ్ షాక్.. సర్ వివాదంపై స్పష్టత కోరిన ఎన్డీయే మిత్రపక్షాలు!
Advertisement

SIR Process: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. ఇప్పుడు అధికార ఎన్డీయే కూటమిలోనే చర్చకు దారితీసింది. బీజేపీ మిత్రపక్షాలే ఎన్నికల సంఘం నుంచి స్పష్టత కోరడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ, ఎల్‌జేపీ రామ్ విలాస్, ఆర్‌ఎల్‌ఎం.. ఈ మూడు పార్టీలు స్పష్టమైన వివరణ కావాలని డిమాండ్ చేశాయి. ఎన్నికల విశ్వసనీయత ప్రమాదంలో పడుతోందని ఎల్‌జేపీ చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ హెచ్చరించారు. తాను ఈసీ తరఫున మాట్లాడటం లేదని, విపక్షాల ఆరోపణలను సమర్థించడమూ లేదని ఆయన స్పష్టం చేశారు. కానీ ప్రజల్లో నెలకొన్న సందేహాలకు ఈసీ సమాధానం ఇవ్వాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్‌లో SIR..

ఆర్‌ఎల్‌ఎం చీఫ్ ఉపేంద్ర కుష్వాహా కూడా వెంటనే వివరణ ఇవ్వాలన్నారు. ప్రజల్లో గందరగోళం ఉందని, ఈసీ వెంటనే స్పష్టత ఇవ్వాలని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. టీడీపీ లోక్‌సభ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాత్రం భిన్నమైన వైఖరి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో SIR పారదర్శకంగా జరిగిందని, విజయవంతమైందని ఆయన సమర్థించారు. అయితే ప్రశ్నలు వచ్చినప్పుడు స్పష్టత ఇవ్వడం రాజ్యాంగ సంస్థపై ప్రజల విశ్వాసాన్ని బలపరుస్తుందని అన్నారు. ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాల్సింది ప్రతిపక్షాలను సంతృప్తి పరిచేందుకు కాదని, ప్రజల్లో ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని కొనసాగించేందుకేనన్నారు. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణపై.. వివిధ వర్గాల నుంచి ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. ఈసీ స్పష్టత ఇవ్వడం అవసరమనే అభిప్రాయం వ్యక్తం చేశారు.

భిన్నాభిప్రాయాలు..

Advertisement

ఇప్పటికే ఎన్నికల సంఘం కమిషనర్ల మధ్యలో భిన్నాభిప్రాయాలున్నాయనే విషయం.. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మరోవైపు.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పుడు.. విపక్షాలతో పాటు అధికార కూటమిలోని మిత్రపక్షాలు కూడా స్పష్టత కోరుతున్నాయ్. దాంతో.. ఈసీ ఇప్పుడెలా సమాధానం చెబుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది.

Also read: రాజ్యాంగ వ్యవస్థ పై బాంబు పేల్చిన జర్నలిస్టులు.. వెలుగులోకి సంచలనాలు!

Tags

Related News

మచిలీపట్నంలో హోరెత్తిన వీఆర్ఏ జేఏసీ ధర్నా.. వారి డిమాండ్లు ఇవే!

ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ.. అభ్యర్థి ఎవరంటే?

నాకు వారి నుండి ప్రాణహాని ఉంది.. యరపతినేని శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్!

నాగాలాండ్‌లో తీవ్ర విషాదం.. కల్తీ మద్యం తాగి 19 మంది మృతి!

రాజ్యాంగ వ్యవస్థ పై బాంబు పేల్చిన జర్నలిస్టులు.. వెలుగులోకి సంచలనాలు!

ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. ఆ కీలక సిస్టమ్‌కు గ్రీన్ సిగ్నల్!

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధానికి ఊహించని షాక్.. గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్!

Big Stories

Advertisement
×