Gen Z Youth: నెల్లూరు రూరల్‌లో పాలిటిక్స్ రూట్ మారుస్తున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. లోకల్ బాడీ ఎలక్షన్స్ హీట్ స్టార్ట్ కాకముందే.. యూత్‌కి పెద్దపీట వేస్తామంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు. ఎలక్షన్స్ టైమ్‌లో యూత్‌ని కేవలం నినాదాలు చేయడానికి, జెండాలు మోయడానికి మాత్రమే వాడే రోజులు పోయాయి అంటున్నార ఆయన. అందులో భాగంగానే Gen-Z యూత్‌తో స్పెషల్ మీటింగ్స్ పెట్టుకుంటూ దూసుకెళ్తున్నారు. ఏకంగా 55 రోజుల్లో 51 ప్రాంతాల్లో 20 వేల మంది యువతతో ఇంటరాక్ట్ అయ్యారు. లీడర్లను క్వశ్చన్ చేసే డేరింగ్ యూత్ ఇప్పుడు పాలిటిక్స్‌లోకి రావాలని, డిసిషన్ మేకింగ్‌లోనూ వాళ్లకే పవర్ ఇవ్వాలనేదే తన అజెండా అని క్లారిటీ ఇచ్చేశారు.
కేవలం మాటలతో సరిపెట్టకుండా ఆ ఐడియాను ఇంప్లిమెంట్ చేసే టైమ్ వచ్చేసిందని చెప్పేశారు కోటంరెడ్డి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రూరల్ పరిధిలోని నాలుగు కార్పొరేటర్ స్థానాలను పక్కాగా Gen-Z యువతకే కేటాయిస్తామని అనౌన్స్ చేశారు. ఫ్యామిలీ పాలిటిక్స్ కాకుండా, జనాల్లో తిరుగుతూ సమస్యలపై గొంతెత్తే స్మార్ట్ యూత్‌కే ప్రయారిటీ ఉంటుందని తేల్చి చెప్పారు. దీంతో రూరల్ పాలిటిక్స్‌లో ఒక్కసారిగా వైబ్రేషన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే ఈ విషయమై గ్రౌండ్‌లో చర్చలు కూడా జోరుగా సాగుతున్నాయి.
ఇక్కడే అసలు సినిమా మొదలైంది. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం చెమటోడ్చిన సీనియర్లు, సిట్టింగ్ కార్పొరేటర్లు, ఈసారి టికెట్ నాదే అని వెయిట్ చేస్తున్న ఆశావహులంతా ఇప్పుడు షాక్‌లో ఉన్నారు. ఒకేసారి నాలుగు సీట్లు యూత్‌కి ఇస్తే.. తమ పొలిటికల్ ఫ్యూచర్ ఏంటని ఇన్నర్ సర్కిల్స్‌లో డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ నాలుగు సీట్ల ఫార్ములా కేవలం శాంపిలా.. లేక భవిష్యత్‌లో మిగతా డివిజన్లకూ ఇది పాకుతుందా? అని రూరల్ టీడీపీలో హాట్ హాట్ చర్చలు ఊపందుకున్నాయి.
ఓవరాల్‌గా కోటంరెడ్డి తెచ్చిన ఈ Gen-Z ఫార్ములా నెల్లూరు రూరల్ పాలిటిక్స్‌లో బిగ్గెస్ట్ ట్రెండ్ సెట్టర్‌గా మారింది. యూత్‌కి ఛాన్స్ ఇస్తూనే, సీనియర్లను ఎలా హ్యాండిల్ చేస్తారు? ఆ నాలుగు లక్కీ సీట్ల కోసం ఎవరెవరు రంగంలోకి దిగుతారు? ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేలోపు ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ టర్న్ తీసుకుంటాయనేది ఇప్పుడు ఇంట్రస్టింగ్ పాయింట్. మొత్తానికి కోటంరెడ్డి యూత్ ఫార్ములా.. నెల్లూరు రూరల్‌లో కొత్త పొలిటికల్ లెక్కలకు తెరతీసింది.
Also read: అన్నింటికీ ఆయనే ప్రెస్ మీట్ పెడితే ఎలా.. సజ్జల తీరుపై వైసీపీ నేతలు ఫైర్!