E-Paper
Advertisement

అన్నింటికీ ఆయనే ప్రెస్ మీట్ పెడితే ఎలా.. సజ్జల తీరుపై వైసీపీ నేతలు ఫైర్!

అన్నింటికీ ఆయనే ప్రెస్ మీట్ పెడితే ఎలా.. సజ్జల తీరుపై వైసీపీ నేతలు ఫైర్!
Advertisement

Sajjala Ramakrishna: వ్యూహకర్తలు యుద్ధంలోకి దిగకూడదు. కలం పట్టిన చేయి కయ్యానికి ముందుకొస్తే తేడా కొడుతుంది. ఇది రాజకీయాలకూ వర్తిస్తుంది. వైసీపీలో నెంబర్-టూ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వంలో ఉన్నప్పుడు సకలశాఖామంత్రిగా చక్రం తిప్పారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. తెర వెనుక నుంచి సర్వం నడిపించాల్సిన సజ్జల తెరముందుకు రావడమే సమస్య అవుతోందా? వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లూ సజ్జల చేసిందే ఇప్పుడూ చేస్తున్నారా? పొలిటీషియన్లు చేయాల్సిన పని… తనే చేస్తూ పార్టీకి ఇబ్బందిగా మారారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

PRC అంశం..

ప్రతి అంశంలోనూ సజ్జలే మీడియా ముందుకు వస్తుంటే పార్టీలో సీనియర్లే లేరా అన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల ముందు PRC అంశం నుంచి మొన్నటి శాప్ అంశం వరకు… కీలక ఇష్యూల మీద సజ్జల పెట్టిన ప్రెస్‌మీట్లు పార్టీకి బూమరాంగ్ అయ్యాయనే వాదన ఉంది. పార్టీ వాయిస్ గట్టిగా వినిపించాల్సిన చోట సజ్జల ఇస్తున్న రాంగ్ ఎంట్రీ నేతలకు నచ్చడం లేదు. ముఖ్యంగా సీనియర్ మోస్ట్ లీడర్లు ఇబ్బందిగా ఉంటున్నారు. సజ్జల వ్యవహారాన్ని ఇప్పటికే జగన్ దృష్టికి తీసుకెళ్లారు గోదావరి జిల్లాలకు చెందిన ఓ మాజీమంత్రి, మాజీ ఎంపీ. సజ్జలను మీడియాకు దూరం పెట్టాల్సిందేనని కరాఖండీగా చెప్పారట.

సజ్జలే ప్రెస్‌మీట్లు..

Advertisement

ఇంకొంత మంది నేతల్లోనూ సజ్జలపై ఇదే ఫీలింగ్ ఉంది. జగన్ దగ్గర సజ్జలకు ఉన్న ప్రాధాన్యతతో కక్కలేక మింగలేకపోతున్నారు ఆ లీడర్లు. సబ్జెక్ట్‌ను బట్టి సీనియర్లతో పార్టీలు ప్రెస్‌మీట్లు పెట్టిస్తుంటాయి. వైసీపీలో ఈ కన్‌స్ట్రక్టివ్ స్ట్రక్చర్ మిస్సవుతోంది. కీలక అంశాలపై సజ్జలే ప్రెస్‌మీట్లు పెట్టడం వల్ల ఎఫెక్ట్ ఉండటం లేదనే ఫీలింగ్ చాలామంది నాయకుల్లో ఉంది. పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శాఫ్ ముట్టడి తర్వాత సజ్జల ఇచ్చిన బ్రీఫింగ్‌పై విమర్శలు వినిపించాయి. వాయిస్ గట్టిగా వెళ్లాల్సిన చోట కూడా చప్పగా వెళ్తోందంటూ అభ్యంతరాలు వస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక సమయాల్లో మీడియా ముందుకు సజ్జలే వచ్చేవారు. శాఖ ఎవరిదైనా, సబ్జెక్ట్ ఏదైనా ప్రెస్ బ్రీఫింగ్ ఆయనే ఇచ్చేవారు.

కేబినెట్ సబ్ కమిటీలో.. 

ముఖ్యంగా PRC, ఉద్యోగ సంఘాల డిమాండ్లపై కేబినెట్ సబ్ కమిటీలో బొత్త లాంటి సీనియర్లు ఉన్నా సజ్జలే లీడ్ చేసిన వైనం చూశాం. సజ్జల మాట తీరుతోనే నాడు ఉద్యోగులకు-వైసీపీకి మధ్య చెడిందని విస్తృత చర్చ నడిచింది. ఈ ఎఫెక్ట్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఓటమి తర్వాత కూడా ఆయన తీరు మారలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకే నష్టం అనేది అంతర్గతంగా నడుస్తున్న చర్చ.

Advertisement

Also read: మూడేళ్ల ప్రేమకు బ్రేకప్… ఎక్స్ పై రివెంజ్‌తో మతిపోగొట్టే పని… యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ

Tags

Related News

నాలుగు దశాబ్దాల బాలాపూర్ లడ్డూ సంచలన చరిత్ర ఇదే?

ఐక్యరాజ్యసమితి వేదికగా నెతన్యాహూ సంచలనం..!

అంబరాన్నంటిన భాగ్యనగర్ నిమజ్జనోత్సవం.. క్యూలో వేలాది విగ్రహాలు!

ప్యారడైజ్‌ మూవీ విమర్శకులను సుతి మెత్తగా అర్సుకున్న నాని..! మీ కోసమే ఇదంతా చేశాం.. మీ విమర్శలను ఎంజాయ్‌ చేశా..!

సర్ పై కాక్రోచుల దండు దాడి..! జంతర్‌ మంతర్‌ వేదికగా ‘అంతకు మించి’ ఆందోళన..! సీఈసీ జ్ఞానేశ్వర్‌ రాజీనామా కోసం అక్టోబర్‌ నుంచి భారీ ఉద్యమానికి శ్రీకారం..

తెలంగాణ బీజేపీలో మళ్లీ సునీల్ బన్సల్.. ఈసారైనా వ్యూహం ఫలించేనా..?

తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్.. త్వరలో కొత్త నియామకాలు!

Big Stories

Advertisement
×