E-Paper
Advertisement

గెలుపు కోసం జరిగే పోటీ కాస్తా ప్రాణాల మీదకు వస్తే ? బ్లడీ స్పోర్ట్స్ హారర్

గెలుపు కోసం జరిగే పోటీ కాస్తా ప్రాణాల మీదకు వస్తే ? బ్లడీ స్పోర్ట్స్ హారర్
Advertisement

Sports Horror Thriller: క్రీడారంగంలో ఉండే తీవ్రమైన పోటీ, గెలవాలనే తపన, శారీరక హింస, వికృతమైన వ్యవస్థల నేపథ్యంలో ఒక స్పోర్ట్స్ హారర్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా హారర్ ఎలిమెంట్స్‌తో సాగుతుంది. ప్రపంచ స్థాయి టెన్నిస్ ప్లేయర్ కావాలనే కల కోసం చేరిన ఓ యువతికి అక్కడ ఎదురయ్యే ప్రత్యర్థుల పోటీ ఒక భయంకరమైన రక్తపాతంగా మారుతుంది. చూసే వాళ్ళు వణికిపోయేలా ఉంటుంది ఈ స్టోరీ . ఈ స్పోర్ట్స్ హారర్ థ్రిల్లర్ పేరు ‘బ్లడీ టెన్నిస్’ (Bloody Tennis). హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ అయితే మిస్ కాకూడాని మూవీ ఇది.

కథలోకి వెళ్తే…

సోఫీ (Sophie)కు ప్రొఫెషనల్ టెన్నిస్‌లో పెద్ద పేరు సంపాదించాలనే కల. ఆ అవకాశం ఆమె కు ఓ యూరోపియన్ ఎలైట్ టెన్నిస్ అకాడమీలో దొరుకుతుంది. ప్రతిభ ఉన్న యువ క్రీడాకారులు మాత్రమే చేరే ఆ అకాడమీలోకి అడుగుపెట్టిన తర్వాత సోఫీ తన కల మరింత దగ్గరైందని అనుకుంటుంది. కానీ అక్కడ పరిస్థితులు ఆమె ఊహించినట్టుగా ఉండవు. గెలవడానికి ప్రతి క్రీడాకారిణి తీవ్రంగా పోటీ పడుతుంది. చిన్న తప్పిదం కూడా కెరీర్‌పై ప్రభావం చూపే స్థాయిలో ఒత్తిడి ఉంటుంది. మొదట్లో ఈ పోటీ సాధారణ స్పోర్ట్స్ రైవల్రీగానే కనిపిస్తుంది.

Advertisement

క్రమంగా అకాడమీలో ఏదో వింత జరుగుతోందని సోఫీకి అనిపిస్తుంది. అక్కడి నియమాలు, శిక్షణ పద్ధతులు, విద్యార్థులపై ఉండే ఒత్తిడి… అన్నీ కలిపి వాతావరణాన్ని భయంకరంగా మారుస్తాయి. తనతో పాటు ఉన్న అమ్మాయిల మధ్య స్నేహాలు, ప్రేమ సంబంధాలు కూడా ఈ పోటీ కారణంగా ప్రభావితమవుతాయి. వింబుల్డన్ వైల్డ్‌కార్డ్ కోసం ఆరుగురు యువ క్రీడాకారిణులు పోటీ పడే పరిస్థితి కథను మరింత తీవ్రంగా మారుస్తుంది. గెలుపు కోసం మొదలైన పోటీ క్రమంగా అక్షరాలా ప్రాణాల పోరాటంగా మారుతుంది. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక సోఫీ తన టెన్నిస్ కలను వదులుకోవాలా? లేక అక్కడ దాగి ఉన్న భయంకరమైన రహస్యాన్ని బయటపెట్టాలా? అనే పరిస్థితిలో చిక్కుకుంటుంది. విజయం కోసం మనుషులు ఎంత దూరం వెళ్లగలరనే ప్రశ్నను కూడా సినిమా హారర్ రూపంలో చూపిస్తుంది.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు? 

సాండ్రా గుల్డ్‌బర్గ్ కాంప్, ఎలినా లోవెన్సోన్, ట్రేసీ గోటోవాస్, హెలెనా జెంగెల్, జ్లాట్కో బురిచ్  తదితరులు నటించిన ‘బ్లడీ టెన్నిస్’కు నికియాస్ క్రిస్సోస్  దర్శకత్వం వహించారు. ఇది హారర్, మిస్టరీ, థ్రిల్లర్, స్పోర్ట్స్ జానర్‌ల ఎలిమెంట్స్ తో రూపొందింది. 2026 సెప్టెంబర్ 25 నుంచి షడర్ (Shudder)లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also: అడవిలో అరుదైన వింత కోసం వెళ్లిన ఫోటోగ్రాఫర్… కట్ చేస్తే మిస్టీరియస్ ఫాంటసీ థ్రిల్లర్

Tags

Related News

మాఫియా సామ్రాజ్యాన్ని మట్టుబెడదాం అనుకుంటే మెంటల్ మాస్ షాక్… క్లాసిక్ క్రైమ్ డ్రామా

కోమా నుంచి లేచిన మహిళ జీవితంలో గత ఆరు నెలలు మిస్సింగ్… భర్త కనిపించకపోవడంతో ట్విస్ట్… షాకింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హార్వర్డ్ మేధావి వరుస బాంబు దాడులు… టెడ్ కాజిన్స్కీ వేట వెనుకున్న అసలు కథ… షాకింగ్ క్రైమ్ డ్రామా

పవర్‌ఫుల్ గురువుపై 17 ఏళ్ల అమ్మాయి షాకింగ్ ఆరోపణ… హై-టెన్షన్ కోర్ట్‌రూమ్ క్రైమ్ థ్రిల్లర్

మూడేళ్ల ప్రేమకు బ్రేకప్… ఎక్స్ పై రివెంజ్‌తో మతిపోగొట్టే పని… యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ

బాబోయ్ ఆ గుహలోకి వెళ్తే మాయమవుతారు… గర్భిణీ ఆత్మహత్య… మైండ్ బ్లోయింగ్ సూపర్‌నేచురల్ థ్రిల్లర్

అడవిలో అరుదైన వింత కోసం వెళ్లిన ఫోటోగ్రాఫర్… కట్ చేస్తే మిస్టీరియస్ ఫాంటసీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×