E-Paper
Advertisement

రైతులకు విద్యుత్ కష్టాలు రాకూడదు.. డీటీఆర్ వైఫల్యాలపై సీఎండీ కీలక ఆదేశాలు

రైతులకు విద్యుత్ కష్టాలు రాకూడదు.. డీటీఆర్ వైఫల్యాలపై సీఎండీ కీలక ఆదేశాలు
Advertisement

DTR Failure: స్వేచ్ఛ బ్యూరో: ఎస్పీడీసీఎల్ పరిధిలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలను తగ్గించి, రైతులు, వినియోగదారులకు విద్యుత్ సరఫరా పరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంస్థ సీఎండీ జితేష్ పాటిల్ అధికారులను ఆదేశించారు. డీటీఆర్ వైఫల్యాలపై తక్షణమే స్పందిస్తూ, ట్రాన్స్‌ఫార్మర్లను సకాలంలో మార్చడంతో పాటు, పునరావృత వైఫల్యాలకు దారితీసే కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఆపరేషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ నరసింహులు సమక్షంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎండీ కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.

జితేశ్ పాటిల్ మాట్లాడుతూ..

Advertisement

ఈసందర్భంగా జితేశ్ పాటిల్ మాట్లాడుతూ.. డీటీఆర్ విఫలమైన వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, వైఫల్యం జరిగిన 24 గంటల్లోపు ఎస్ఏపీలో నోటిఫికేషన్ నమోదు చేయాలని సీఎండీ ఆదేశించారు. నోటిఫికేషన్ నమోదు చేసిన అనంతరం ఆలస్యం చేయకుండా విఫలమైన ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో ఆరోగ్యకరమైన డీటీఆర్‌ను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు స్థానికంగా అందుబాటులో లేకపోతే జోన్ స్థాయి నుంచి సమకూర్చుకోవాలని, వాటిని తరలించేందుకు అవసరమైన ట్రాక్టర్లు, ట్రాలీలు, మినీ ట్రాలీలు వంటి రవాణా సదుపాయాలను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.

రైతులకు కష్టాలు వస్తే ఉపేక్షించబోం..

Advertisement

రైతులు తమ భుజాలపై ట్రాన్స్‌ఫార్మర్లను మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదని, రైతులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం జరగకుండా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. డీటీఆర్ వైఫల్యం జరిగినప్పుడు వెంటనే ప్రత్యామ్నాయ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతి సర్కిల్‌లో సామర్థ్యం వారీగా తగిన సంఖ్యలో హెల్తీ డీటీఆర్‌లను అందుబాటులో ఉంచాలని సీఎండీ ఆదేశించారు. ముందస్తు ప్రణాళికతో నిల్వలను నిర్వహించాలని, ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో లేకపోవడం వల్ల విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ట్రాన్స్‌ఫార్మర్లు పదే పదే విఫలమవుతున్న సందర్భాల్లో వాటిని మరమ్మతు చేసి తిరిగి ఏర్పాటు చేయడానికే పరిమితం కాకుండా, వైఫల్యానికి అసలు కారణాన్ని గుర్తించి శాశ్వత పరిష్కారాలు చేపట్టాలని సీఎండీ సూచించారు.

ఎక్కువసార్లు విఫలమైతే క్షేత్రస్థాయిలో తనిఖీ..

ముఖ్యంగా ఒకే డీటీఆర్ రెండోసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు విఫలమైతే క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా తనిఖీ నిర్వహించి, పునరావృత వైఫల్యాలకు దారితీస్తున్న పరిస్థితులను సరిచేయాలని పేర్కొన్నారు. మరమ్మతుల అనంతరం కొద్దికాలంలోనే ట్రాన్స్‌ఫార్మర్లు తిరిగి విఫలమైతే, సంబంధిత మరమ్మతుల నాణ్యతను పరిశీలించి బాధ్యతను నిర్ధారించాలని ఆదేశించారు. ఎస్ఏపీలో డీటీఆర్ వైఫల్యానికి సంబంధించిన స్థలం, స్ట్రక్చర్ నంబర్, ట్రాన్స్‌ఫార్మర్ మార్పిడి వివరాలు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నమోదు చేయాలని సీఎండీ స్పష్టం చేశారు. తప్పు వివరాలు నమోదు చేయడం, వైఫల్యాల సమాచారాన్ని దాచిపెట్టడం వంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇదిలాఉండగా తొలుత సైఫాబాద్, కవాడిగూడ సెక్షన్‌లో నిర్వహించిన ప్రజా బాట కార్యక్రమంలో సీఎండీ జితేష్ పాటిల్ పాల్గొని విద్యుత్ లైన్ల నిర్వహణ పనులను పరిశీలించారు. ఆపై మింట్ కాంపౌండ్ లోని ప్రధనా కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.

Also Read: సింగరేణి కార్మికులకు దసరా కానుక.. ఒక్కొక్కరికి రూ.1.53 లక్షల లాభాల వాటా

Tags

Related News

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

సింగరేణి కార్మికులకు దసరా కానుక.. ఒక్కొక్కరికి రూ.1.53 లక్షల లాభాల వాటా

అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

విద్యార్థులకు రేవంత్‌ సర్కార్ గుడ్‌న్యూస్‌.. రూ.204 కోట్లు విడుదల!

ఎల్‌నినో ఎఫెక్ట్‌పై తెలంగాణ సర్కార్ అలర్ట్.. విద్యుత్ శాఖకు భట్టి కీలక ఆదేశాలు

Big Stories

Advertisement
×