E-Paper
Advertisement

నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్‌లో లంచాల దందా కలకలం

నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్‌లో లంచాల దందా కలకలం
Advertisement

Nizamabad ACB: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తరచూ అవినీతి దందాతో దొరికిపోతున్న ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా నిజామాబాద్ కార్పొరేషన్‌లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి. సొంత శాఖలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగి నుంచే లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికాడో అవినీతి ఆణిముత్యం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం వచ్చిన మాజీ ఉద్యోగి నుంచి వసూళ్ల పర్వానికి తెరతీశాడు జూనియర్ అసిస్టెంట్ అశోక్. 35 వేలు ఇస్తేనే ఫైలు కదులుతుందని అల్టిమేటం ఇచ్చాడు. ముందుగా 15 వేలు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. ఆ మొత్తాన్ని తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు.

లంచాలమేత..

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంలో అశోక్ చేరి 13 నెలలే అవుతోంది. వచ్చీరాగానే లంచాలమేత మొదలుపెట్టి ఇలా అడ్డంగా బుక్కయ్యాడు. అశోక్‌తో పాటు ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిని కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

14 ఏసీబీ కేసులు..

Advertisement

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల్లో కరప్షన్ కేసులు నిత్యం సంచలనంగా మారుతున్నాయి. 2025 జనవరి నుంచి 14 ఏసీబీ కేసులు నమోదయ్యాయి. పైసలు ఇస్తే కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో పని జరగడం లేదు. ఏసీబీ దాడులు జరుగుతున్నా, ఎంతమంది దొరికిపోతున్నా… లంచావతారులకు సిగ్గు రావడం లేదు. అవినీతిపరులకు సంకెళ్లు పడుతున్నా లంచాల దందాకు బ్రేక్ పడటం లేదన్న వాదన వినిపిస్తోంది.

Also read: గణేష్ నిమజ్జనం వేల తీవ్ర విషాదం.. పోలీసుల లాఠీఛార్జ్ భయానికి యువకుడు మృతి!

Tags

Related News

కృష్ణా జిల్లాలో ఆర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. దంచికొడుతున్న వర్షాలు!

పోక్సో కేసులో కోర్టు కీలక తీర్పు.. ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన అరెస్ట్ చెల్లదు

అక్టోబర్ 2న నో యూపీఐ డే.. దేశవ్యాప్తంగా వ్యాపారుల వినూత్న నిరసన!

నాలుగు దశాబ్దాల బాలాపూర్ లడ్డూ సంచలన చరిత్ర ఇదే?

ఐక్యరాజ్యసమితి వేదికగా నెతన్యాహూ సంచలనం..!

అన్నింటికీ ఆయనే ప్రెస్ మీట్ పెడితే ఎలా.. సజ్జల తీరుపై వైసీపీ నేతలు ఫైర్!

అంబరాన్నంటిన భాగ్యనగర్ నిమజ్జనోత్సవం.. క్యూలో వేలాది విగ్రహాలు!

Big Stories

Advertisement
×