E-Paper
Advertisement

అక్టోబర్ 2న నో యూపీఐ డే.. దేశవ్యాప్తంగా వ్యాపారుల వినూత్న నిరసన!

అక్టోబర్ 2న నో యూపీఐ డే.. దేశవ్యాప్తంగా వ్యాపారుల వినూత్న నిరసన!
Advertisement

No UPI Day: దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది దుకాణాదారులు, వ్యాపారులు.. అక్టోబర్ 2న వినూత్న రీతిలో నిరసన తెలపనున్నారు. ఆరోజు.. నో యూపీఐ డే పాటించాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ పిలుపునిచ్చింది. ఆ రోజంతా.. దుకాణాదారులు తమ యూపీఐ క్యూఆర్ కోడ్‌లు, స్కానర్లు, సౌండ్ బాక్స్‌లను నల్లటి బట్టలతో కప్పి ఉంచుతారు. డిజిటల్ పేమెంట్స్ ఏవీ స్వీకరించకుండా.. నగదు మాత్రమే స్వీకరిస్తారని.. సీటీఐ ప్రతినిధులు ప్రకటించారు. ఈ నిరసనకు కొత్త ఎండీఆర్ నిబంధనలే కారణం. అక్టోబర్ 15 నుంచి 2 వేల రూపాయలు పైబడిన పర్సన్ టు మర్చంట్ యూపీఐ చెల్లింపులపై.. 0.4 శాతం మేర మర్చంట్ డిస్కౌంట్ రేట్ అమల్లోకి రానుంది.

సుమారు 6 కోట్ల మంది..

దీని ప్రకారం.. 3 వేల రూపాయల లావాదేవీకి.. వ్యాపారులు 12 రూపాయలు, 50 వేల చెల్లింపులకు 200 వరకు ఛార్జీ రూపంలో కోల్పోవాల్సి వస్తుంది. ఈ గరిష్ఠ పరిమిథిని.. 300గా నిర్ణయించారు. ఎండీఆర్ ఛార్జీలు.. తక్కువ లాభాలతో పనిచేసే చిల్లర వ్యాపారులపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుందని వ్యాపార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 6 కోట్ల మంది వ్యాపారులు, పారిశ్రామికవేత్తలపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అక్టోబర్ 2న చేపట్టబోయే నిరసన కారణంగా.. భవిష్యత్తులో యూపీఐ లావాదేవీలు 50 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని సీటీఐ అంచనా వేస్తోంది.

పేమెంట్ గేట్‌వే సంస్థలు..

Advertisement

మరోవైపు, ఈ వివాదంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు. ఎండీఆర్ ఛార్జీలను కేంద్రం వసూలు చేయడం లేదని, దీనికి, ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం.. NPCI, బ్యాంకులు, పేమెంట్ గేట్‌వే సంస్థలు మాత్రమే.. ఈ ఛార్జీలను అందుకుంటాయన్నారు. కేంద్రం క్లారిటీ ఇచ్చినా.. చిరు వ్యాపారులు, దుకాణాదారుల్లో నెలకొన్న భయాలు మాత్రం తొలగడం లేదు. ఎండీఆర్ ఛార్జీల ఎఫెక్ట్‌తో.. ఇప్పటికే యూపీఐ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బేగంబజార్‌లోనూ.. ఓన్లీ క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయ్. ఈ గాంధీ జయంతి రోజున వ్యాపారులు తలపెట్టిన.. ఈ నో యూపీఐ డే నిరసన.. దేశవ్యాప్తంగా ఎలాంటి ఇంపాక్ట్ చూపబోతోందనే చర్చ మొదలైంది.

Also read: సినిమా చేయాలంటే హీరోల భార్యలకు నచ్చాలి.. తాప్సీ సెన్సేషనల్ కామెంట్స్!

Tags

Related News

Gen-Z యూత్‌ కోసం.. నెల్లూరు రూరల్ పాలిటిక్స్‌లో కొత్త ట్రెండ్!

కృష్ణా జిల్లాలో ఆర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. దంచికొడుతున్న వర్షాలు!

పోక్సో కేసులో కోర్టు కీలక తీర్పు.. ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన అరెస్ట్ చెల్లదు

నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్‌లో లంచాల దందా కలకలం

నాలుగు దశాబ్దాల బాలాపూర్ లడ్డూ సంచలన చరిత్ర ఇదే?

ఐక్యరాజ్యసమితి వేదికగా నెతన్యాహూ సంచలనం..!

అన్నింటికీ ఆయనే ప్రెస్ మీట్ పెడితే ఎలా.. సజ్జల తీరుపై వైసీపీ నేతలు ఫైర్!

Big Stories

Advertisement
×