E-Paper
Advertisement

ప‌వ‌న్ ఓవ‌రాక్ష‌న్‌- బీజేపీకి రియాక్ష‌న్‌.. పొత్తు వ‌ద్దే వ‌ద్ద‌ని నిర్ణ‌యం..!

ప‌వ‌న్ ఓవ‌రాక్ష‌న్‌- బీజేపీకి రియాక్ష‌న్‌.. పొత్తు వ‌ద్దే వ‌ద్ద‌ని నిర్ణ‌యం..!
Advertisement

ప‌వ‌న్ పార్టీతో పొత్తుండ‌ద‌ని తేల్చేసింది తెలంగాణ బీజేపీ. ఇక్క‌డ పార్టీని అధికారంలోకి తీసుకురావాల‌నే గ‌ట్టి సంక‌ల్పంతో ఉన్న అధిష్టానానికి ప‌వ‌న్ ఓ సువ‌ర్ణ అవ‌కాశంగా క‌నిపించాడు. ఏపీలో కూట‌మి అధికారంలోకి రావ‌డానికి ప‌వ‌న్ కూడా ఓ ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని మోడీ న‌మ్మాడు. అందుకే ఆ మ‌ధ్య హైద‌రాబాద్‌కు వ‌చ్చిన‌ప్పుడు ప‌వ‌న్‌తో ఆయ‌న ప్ర‌త్యేకంగా భేటీ అయ్యాడు. రాజ‌కీయ మంత్రాలు ఉప‌దేశించాడు. దిశా నిర్దేశం చేశాడు.

దీంతో ప‌వ‌న్ కూడా త‌న కార్య‌క్షేత్రాన్ని తెలంగాణ‌ను మార్చాల‌ని భావించాడు. ఎలాగైనా ఇక్క‌డి రాజ‌కీయాల్లో త‌ల‌దూర్చాలంటే సినిమాల్లో ఎంట్రీ సీన్‌లా సూప‌ర్‌గా ఉండాల‌ని భావించాడు. అది చ‌ర్చ‌లోకి రావ‌డం మూలంగా ఓ క‌దలిక‌ను తీసుకురావాల‌ని కూడా భావించాడు. కానీ ఇది తిరగ‌బ‌డ్డ‌ది. సీన్ రివ‌ర్స్ అయ్యింది.

Advertisement

అందుకే జూన్ 2… తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వాన్నిఎంచుకున్నాడు. ఓ మీటింగు ఉంటుంద‌ని ముందే లీకులిచ్చాడు. స‌హ‌జంగానే ఇక్క‌డి తెలంగాణ నేత‌లు విరుచుకుప‌డ్డారు. ఇక్క‌డి రాజ‌కీయాల్లో నీ జోక్య‌మెందుకు? అని ప్ర‌శ్నించాడు. తెలంగాణ ఆవిర్బావ దినోత్స‌వం రోజునే మీటింగు పెట్టుకోవాల‌నుకోవ‌డం.. దానికి తెలంగాణ పున‌ర్నిర్మాణ సంక‌ల్ప స‌భ‌గా నామ‌క‌ర‌ణం చేయ‌డంలోనే ప‌వ‌న్ .. ఇక్క‌డి రాజ‌కీయాల‌తో క‌య్యానికి కాలు దువ్వే మంత్రాన్ని ప్ర‌యోగించాడని తెలిసిపోతూనే ఉంది.

అయితే ఇదే ఊపులో మ‌ళ్లీ తెలంగాణ‌లో ప్రెస్‌మీట్ పెట్టి ఇది మీ అయ్య జాగీరా అంటూ అసంద‌ర్భ ప్రేలాప‌ల‌ను చేయ‌డం కూడా తిర‌గ‌బ‌డింది. వాస్త‌వానికి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇక్క‌డి ఎన్నిక‌ల్లో పోటీ చేశాడు. మొన్న‌టి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో గుట్టు చ‌ప్పుడు కాకుండా పోటీ చేసి.. ఓ ఒక్క సీటు గెల‌వ‌కుండా… క‌నీసం డిపాజిట్లు కూడా రాకుండా కొట్టుకుపోయాడు. ఇది క‌నీసం చ‌ర్చ‌లోకి కూడా రాలేదు. అత‌ని ప్ర‌మేయం, ప్ర‌భావం లేకుండా ఆ ఎన్నిక‌లు పూర్త‌య్యాయి.

Advertisement

ఇప్పుడు కొత్త‌గా ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని తొడ‌లు చ‌రిచి మ‌రీ చెప్ప‌డంలోనే ప‌వ‌న్ డ‌బుల్ స్టాండ‌ర్డ్స్‌ను అర్థం చేసుకున్నారు ఇక్క‌డి జ‌నం. అప్ప‌టికే తగుదున‌మ్మా అని ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్‌తో వివాదాన్ని తెచ్చుకుని నెత్తిన పెట్టుకోవ‌డం కూడా తెలంగాణ నుంచి వ్య‌తిరేక‌త‌ను మూట‌గ‌ట్టుకున్న‌ట్టైంది. అప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ వ‌స్తాడు.. మాకు ఊతంగా నిలుస్తాడు..జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో మా బ‌లానికి తోడ‌వుతాడు.. అని క‌ల‌లు క‌న్న తెలంగాణ బీజేపీ ఆశ‌ల‌కు గండి కొట్టాడు ప‌వ‌న్‌.

ఓ రాజ‌కీయ చాణ‌క్యం, లౌక్యం లేని ప‌వ‌న్ లాంటి నేత‌తో క‌లిసి వెళ్తే.. ఉన్న ప‌ర‌ప‌తి కూడా పోతుంద‌నే భ‌యం బేజేపీని వెంటాడింది. ఇదే అంశంపై ఇవాళ ఢిల్లీలో జ‌రిగిన జాతీయ అధ్య‌క్షుడి భేటీలో చ‌ర్చ జ‌రిగింది. అప్ప‌టికే అమిత్ షా కూడా ప్ర‌క‌టించి ఉన్నాడు. ఒంట‌రిగానే పోటీ చేస్తాం.. పొత్తు ఉండ‌ద‌ని. ఇవాళ మ‌రీ స్ప‌ష్టంగా చెప్పేశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు తీసుకుని మ‌రీ..మేం ఆయ‌న‌తో పొత్తు పెట్టుకోమంటే పెట్టుకోమ‌న్నారు.

పొత్తు ఉంటేనే అంతంత ప్ర‌భావం ఉంటుంది ప‌వ‌న్‌కు. ఏ దిక్కు లేకుండా ఒంట‌రిగా పోటీ చేస్తే ఇక్క‌డ హైద‌రాబాద్‌లో డిపాజిట్ కూడా ద‌క్కే అవ‌కాశాలు లేవు. ఆ విష‌యం తెలియ‌క ప‌వ‌న్ త‌న‌కు తాను పెద్ద‌గా ఊహించుకోవ‌డ‌మే ఇక్క‌డ చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఏపీలో ఏదో ల‌క్కు క‌లిసి వ‌చ్చి.. బాబు చేర‌దీసి.. పొత్తు పెట్టుకుని నెత్తిన ఎత్తుకోవ‌డం మూలంగా.. డిప్యూటీ సీఎం ఇవ్వ‌డం వ‌ల్ల ఆ ప‌ర‌ప‌తి వ‌చ్చిందే గానీ, ప‌వ‌న్‌కు అంత సీన్ లేదనే అభిప్రాయాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Tags

Related News

గెలుపు గ్రాఫ్‌ తగ్గని నేత.. ప్రజాబలంలో మార్పు లేదు. బలమైన నేతగా దానం.. బరిలో ప్రత్యర్థివర్గానికి గట్టిపోటీ..!

కేసీఆర్‌ను కామెడీ పీస్‌ను చేసిండ్రు కదరా!? చావు నోట్లో తలపెట్టి.. డైలాగెందుకు వాడినట్టో…!? ఉద్యమాన్ని అవమానించడం కాదా?

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

Big Stories

Advertisement
×