E-Paper
Advertisement

20 ఏళ్ల ఐఫోన్ జర్నీకి గ్రాండ్ ట్రీట్.. iPhone 20లో ఈ మార్పులు చూస్తే పిచ్చెక్కిపోతారండి బాబూ!

20 ఏళ్ల ఐఫోన్ జర్నీకి గ్రాండ్ ట్రీట్.. iPhone 20లో ఈ మార్పులు చూస్తే పిచ్చెక్కిపోతారండి బాబూ!
Advertisement

Apple iPhone 20: అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ తమ మొదటి ఐఫోన్‌ను పరిచయం చేసి 20 ఏళ్లు పూర్తికాబోతున్న సందర్భంగా.. ఒక ప్రత్యేకమైన ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. లీకైన వివరాల ప్రకారం.. ఈ 20వ వార్షికోత్సవ స్పెషల్ మోడల్ డిజైన్ పరంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉండబోతోంది. సాధారణంగా వచ్చే మార్పుల కంటే ఈసారి ఫోన్ లుక్ పూర్తిగా మారిపోనుంది. ఈ విషయంలో టెక్ ప్రియుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది.

నాలుగు వైపులా కర్వ్‌డ్ డిస్‌ప్లే..

ఈ కొత్త ఐఫోన్‌లో అత్యంత ప్రధానమైన ఆకర్షణ దాని స్క్రీన్. డిస్‌ప్లే గ్లాస్ నాలుగు వైపులా అంచుల వరకు వంగి ఉండే ‘క్వాడ్ కర్వ్‌డ్’ డిజైన్‌ను యాపిల్ పరిశీలిస్తోంది. దీనివల్ల ఫోన్ పట్టుకున్నప్పుడు స్క్రీన్ చుట్టూ ఉన్న బార్డర్లు (బెజెల్స్) దాదాపు కనిపించవు. ముందు భాగం అంతా సరికొత్త సీమ్‌లెస్ లుక్‌తో వినియోగదారులకు మంచి విజువల్ అనుభూతిని అందిస్తుంది.

ఫిజికల్ బటన్లకు గుడ్ బై..

Advertisement

ఇన్నాళ్లూ చూసిన నార్మల్ బటన్లకు ఈ ఫోన్‌లో స్వస్తి చెప్పే అవకాశం ఉంది. వాటి స్థానంలో వైబ్రేషన్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చే ప్రెజర్ సెన్సిటివ్ సోలిడ్ స్టేట్ బటన్లు రానున్నాయి. మరో విశేషమేమిటంటే.. ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉన్నప్పుడు కూడా ఇవి పనిచేసేలా ఒక ప్రత్యేకమైన లో-పవర్ చిప్‌ను ఇందులో అమర్చనున్నారని సమాచారం. దీనివల్ల ఫోన్ బాడీ మరింత నీట్‌గా కనిపిస్తుంది.

Also Read: పాత స్నేక్ గేమ్‌తో కొత్త Nokia 3210 4G ఫోన్.. ఆఫర్ ధర చూస్తే అస్సలు వదలరు!

స్క్రీన్ కిందనే కెమెరా..

Advertisement

డిస్‌ప్లే మీద కనిపించే పంచ్ హోల్ లేదా నాచ్‌లకు చెక్ పెడుతూ.. సెల్ఫీ కెమెరాను నేరుగా డిస్‌ప్లే కిందనే అమర్చేందుకు ప్రయోగాలు చేస్తున్నారు. దీనివల్ల స్క్రీన్ మధ్యలో కెమెరా చుక్కలు ఏమీ లేకుండా గేమింగ్, వీడియోలు చూసేటప్పుడు పూర్తి స్క్రీన్ అనుభవం లభిస్తుంది. కాకపోతే ఈ టెక్నాలజీ నాణ్యత విషయంలో యాపిల్ కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది.

భారీ బ్యాటరీ, రివర్స్ ఛార్జింగ్..

ఐఫోన్ అనగానే బ్యాటరీ లైఫ్ గురించి అందరూ ఆలోచిస్తారు. ఈసారి ఏకంగా 6000mAh సామర్థ్యం ఉన్న భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇతర గ్యాడ్జెట్లను ఫోన్ వెనుక ఉంచి ఛార్జ్ చేసుకునే వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.

పెద్ద స్క్రీన్, ప్రో మోడల్స్..

ఈ ప్రత్యేక మోడల్‌ను iPhone 20 పేరుతో పిలిచే అవకాశం ఉంది. ఇందులో దాదాపు 6.96 అంగుళాల పెద్ద స్క్రీన్‌తో ప్రో మాక్స్ వెర్షన్ కూడా రావచ్చని సమాచారం. అయితే ఇవన్నీ ప్రస్తుతం లీకైన సమాచారం మాత్రమే. యాపిల్ అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. కానీ ఈ మార్పులు నిజమైతే మాత్రం స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో ఇదొక పెద్ద సంచలనమవుతుంది.

Also Read: సేల్ మొదలవకముందే అమెజాన్ బంపర్ ఆఫర్లు.. ఇంత తక్కువ ధరకు ఇలాంటి ఫోన్లు, టీవీలా?

Tags

Related News

రిలయన్స్ డిజిటల్ సంచలనం.. iPhone 17 Proపై ఏకంగా రూ.77,000 తగ్గింపు!

బ్యాటరీ కింగ్ Vivo Y21 5Gపై ఏకంగా 25,500 తగ్గింపు.. కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి!

సేవింగ్స్ పెంచుకోవడంలో..ఫిక్స్‌డ్ డిపాజిట్,మ్యూచువల్ ఫండ్స్‌లో ఏది బెస్ట్?

సిలిండర్ మోయాల్సిన పనే లేదు..తడి క్లాత్‌తోనే ఎంత ఖాళీ ఉందో కనిపెట్టేయెచ్చు

మిక్సీ కాలిపోయిన వాసన వస్తుందా? మీరు వెంటనే చేయాల్సిన పని ఇదే!

ఫోన్ ఛార్జర్లు వేడెక్కడం సాధారణమేనా? ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

YouTubeలో ఇలాంటి ఫీచర్లు వస్తాయని కలలో కూడా ఊహించలేరు.. యూజర్లు, క్రియేటర్లు జాక్‌పాట్ కొట్టినట్టే!

Big Stories

Advertisement
×