E-Paper
Advertisement

రేవంత్‌ పొలిటికల్‌ గేమ్‌లో సెల్ఫ్‌గోల్‌! అధికార పార్టీపై కౌంటర్‌ స్ట్రాటజీ అట్టర్‌ ఫ్లాప్.. తామే సీఎంకు అస్త్రాలను అంధించి..!

రేవంత్‌ పొలిటికల్‌ గేమ్‌లో సెల్ఫ్‌గోల్‌! అధికార పార్టీపై కౌంటర్‌ స్ట్రాటజీ అట్టర్‌ ఫ్లాప్.. తామే సీఎంకు అస్త్రాలను అంధించి..!
Advertisement

సీఎం రేవంత్‌రెడ్డి ఆడుతున్న పొలిటికల్ గేమ్‌లో కేటీఆర్‌ సెల్ఫ్‌గోల్‌ అయ్యాడా? అధికార పార్టీ తెలివిగా లేవనెత్తిన ఆస్తుల చిట్టా వ్యవహారంలో కౌంటర్‌ ఎటాక్‌ చేయబోయి.. తనే వారికి పావుగా మారాడా? తనకు తానే అస్త్రాలను అందించి.. క్షతగాత్రుడవుతున్నాడా? అంటే అవుననే అంటున్నారంతా.

మూడేండ్ల తరువాత ఇప్పుడు కొత్తగా ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌ భూముల అక్రమాల ఊసెందుకొచ్చింది? 22ఏపై బీఆర్‌ఎస్‌ రాజకీయంగా అధికార పార్టీని ఇరుకున పెట్టిన మాట వాస్తవం. సామాన్య జనాన్ని కూడా ఇబ్బందులు పెట్టేలా జరిగిన తప్పిదాన్ని కనిపెట్టి.. దాన్ని హైలెట్ చేసి మరీ జనామోదం పొందే క్రమంలో.. రేవంత్‌ తన రాజకీయ వ్యూహంలో భాగంగా ఎర్రవెల్లి భూముల వ్యవహారాన్ని బయటకు తీసినట్టుగా భావిస్తున్నారు.

Advertisement

దీనిపై విచారణ పూర్తయ్యింది. ఆ రిపోర్టు ఇప్పుడు సీఎం వద్ద ఉంది. దళితులకు సంబంధించిన అసైన్డ్ భూములపైనే ఈ వివాదం. దీనిపై సర్కార్‌ నుంచి ఎలాంటి కామెంట్‌ వస్తుందోనని అంతా ఎదురు చూస్తున్నారు. కానీ కేసీఆర్‌ .. అక్రమంగా భూములు లాక్కుని మరీ అక్కడ ఫామ్‌హౌజ్‌ కట్టుకున్నాడనే ఆరోపణలపై జనం నుంచి మిశ్రమ స్పందనే వచ్చింది.

ఇక కేటీఆర్‌, హరీశ్‌ల ఫామ్‌హౌజ్‌లపైనా ఇప్పుడు రచ్చ చేయడం కూడా డైవర్షన్‌ పాలిటిక్స్‌ గానే చూస్తున్నారు జనం. ఇక ఇది చాలదంటూ తమంతట తామే పావులుగా మారుతున్నారు కేటీఆర్, హరీశ్‌రావులు. కేసీఆర్ పుట్టింది వందల ఎకరాల భూస్వామి కుటుంబంలో అని ఒకసారి, అసలు మేమంతా కలిసి ఉండేందుకు పెద్ద ఇళ్లే లేదు..అందుకే కేసీఆర్‌ అక్కడ, నీనిక్కడ అని కేటీఆర్‌ అన్న మాటలు అధికార పార్టీకి మరిన్ని అస్త్రాలనే ఇచ్చాయి.

Advertisement

వందల ఎకరాలున్న కుటుంబమైతే ఆయన అప్పుడు పేదరికంలో ఎందుకున్నాడనే ఒక అంశాన్ని లేవనెత్తగా, మరి సొంత ఇళ్లే లేదన్నారు.. నీకు ఇప్పుడు ఫైవ్‌ స్టార్ హోటళ్లు ఎలా వచ్చాయని నిలదీస్తున్నారు సీఎం. కేటీఆర్‌ దుందుడుకు డైరెక్షన్‌ వల్ల కూడా అధికార పార్టీకి దొరికిపోతున్నాడు. సెల్ఫ్‌గోల్‌ అవుతున్నాడు.

అసెంబ్లీ వద్ద హంగామాలో తాతామధు .. స్పీకర్‌ను తిట్టిన ఇష్యూ కూడా కేటీఆర్‌ తనంతట తానుగా రేవంత్‌కు ఇచ్చిన ఓ బ్రహ్మాస్త్రం లాంటింది. కేసీఆర్‌ ఫామ్‌హౌజ్‌ వద్ద చావుడప్పు రాజకీయాన్ని ప్లే చేసిన రేవంత్‌కు.. పసుపు నీళ్లు చల్లి మరో అస్త్రాన్ని అందించి.. పార్టీని మరింత ఇబ్బందిలో పడేయడమే కాదు.. అటు కేసీఆర్‌కు కూడా మనశ్శాంతి లేకుండా చేశాడు.

పక్కా ఇది రేవంత్ ఆడుతున్న పొలిటికల్‌ డైవర్షన్‌ అని కేటీఆర్‌కు తెలుసు. కానీ దీన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక చతికిలబడుతున్నాడు. ఏదో చేయబోతున్నాడు. మరేదో అనబోతున్నాడు. దొరికిపోయి సెల్ఫ్‌గోల్‌ అవుతున్నాడు. ఇదంతా కేటీఆర్‌ నాయకత్వ లోపంగానే చూడాలి. కేసీఆర్‌.. కేటీఆర్‌కు ఇచ్చిన ఈ నాయకత్వ పరీక్షలో అతను పూర్తిగా ఫెయిల్ కాగా.. కేసీఆర్‌, కేటీఆర్‌.. ఆ పార్టీని ఆస్తుల రాజకీయ వ్యూహంలో చిక్కుకునేలా చేసి… ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి నుంచి జనాన్ని ఇటువైపు లాగడంలో రేవంత్పా పాస్‌ మార్కులు సాధించాడని చెప్పొచ్చు.

Tags

Related News

ముంబైలో షాకింగ్ ఘటన.. మళ్లీ జీవం వస్తుందని క్లినిక్‌లో 80 ఏళ్ల వృద్ధుడి బాడీ భద్రం!

సినిమా రేంజ్‌లో స్కెచ్చేసిన దొంగలు.. ఆర్టీసీ బస్సులో రూ.3 కోట్ల గోల్డ్ మాయం.. కానీ చివరకి..?

సకుటుంబ సపరివారానికీ.. తిట్ల తలంటు..! మీరిక వర్తమానం.. భవిష్యత్తు శూన్యం.. కొడుకు గడీనీ కూల్చుతాం!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. రాంరెడ్డికి సీటిచ్చింది అందుకేనా..?

బరి గీసి నిలిచిన బీఆర్‌ఎస్‌.. ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌తో పోల్చిన హరీశ్‌.. ! రసవత్తరంగా మారనున్న పోరు.. !

జీహెచ్ఎంసీ సంచలన నిర్ణయం.. 2027 ఏప్రిల్ 1 నుంచి ఆ పనిలో మార్పులు!

టీజీఎస్పీడీసీఎల్ చరిత్రలో ఊహించని రికార్డు.. భారీగా పెరిగిన విద్యుత్ వాడకం?

Big Stories

Advertisement
×