E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

SpaceX Crash: ఎలాన్ మస్క్‌కు ఇన్వెస్టర్లు గట్టి షాక్.. స్పేస్‌ఎక్స్ షేర్లు పడిపోవడానికి అసలు కారణం ఇదే!

SpaceX Crash: ఎలాన్ మస్క్‌కు ఇన్వెస్టర్లు గట్టి షాక్.. స్పేస్‌ఎక్స్ షేర్లు పడిపోవడానికి అసలు కారణం ఇదే!
Advertisement

SpaceX Crash: ఒక్క రోజులోనే ఎలాన్ మస్క్ సంపద 152 బిలియన్ డాలర్లు తగ్గింది. అయినా సరే మస్క్ నికర సంపద ఇప్పటికీ 1 ట్రిలియన్ డాలర్లను మించి ఉంది. కొంత రిలీఫ్ ఇచ్చే మ్యాటరే ఇది. బట్ స్పేస్ ఎక్స్ షేర్లు మాత్రం షేక్ అయ్యాయి. మస్క్ ను షేక్ చేశాయి కూడా. IPO ఆరంభం నాటి పరిస్థితి స్పేస్ ఎక్స్ కు ఇప్పుడు కనిపించట్లేదు. అంతా డౌన్ ట్రెండే నడుస్తోంది. ఇందుకు చాలా కారణాలున్నాయంటున్నారు మార్కెట్ ఎక్స్ పర్ట్స్.

రికార్డు స్థాయి ఐపీఓతో..

స్పేస్ ఎక్స్ షేర్లు భారీగా పతనమవడానికి ప్రధాన కారణం బాండ్ల అమ్మకం ద్వారా కంపెనీ సుమారు 20 బిలియన్ డాలర్ల భారీ రుణ సమీకరణ ప్రకటన చేయడం. అలాగే ఐపీఓ తర్వాత ఉత్సాహం ముగిసి ఇన్వెస్టర్లు అలర్ట్ అవడమే. రికార్డు స్థాయి ఐపీఓతో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ షేరు, కేవలం 3 రోజుల్లోనే 225 డాలర్ల గరిష్ట స్థాయికి చేరి అమెజాన్, మైక్రోసాఫ్ట్‌లను కూడా వెనక్కి నెట్టింది. అయితే గత మూడు రోజులుగా జరిగిన భారీ అమ్మకాలతో తాజాగా ఒక్కరోజే షేరు విలువ 16 శాతానికి పైగా పతనమై 154 డాలర్ల వద్ద ముగిసింది. దీనివల్ల కంపెనీ మార్కెట్ విలువలో దాదాపు 600 బిలియన్ డాలర్ల 900 బిలియన్ డాలర్ల వరకు కోత పడింది.

ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన..

Advertisement

దాదాపు 20 బిలియన్ డాలర్ల విలువైన అన్‌సెక్యూర్డ్ బాండ్లను అమ్మి నిధులు సేకరించనున్నట్లు స్పేస్‌ఎక్స్ ప్రకటించింది. ఈ బాండ్ల ద్వారా వచ్చే సొమ్మును స్పేస్‌ఎక్స్ స్పేస్ ప్రాజెక్టుల కంటే, ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ xAI అప్పులను తీర్చడానికి వాడుతున్నారన్న ప్రచారం ఇన్వెస్టర్లలో తీవ్ర ఆందోళన కలిగించింది. స్పేస్ ఎక్స్ లాభాలను మస్క్ తన ఇతర ఐటీ, ఏఐ అవసరాలకు షిఫ్ట్ చేస్తున్నారన్న భయం పతనానికి ప్రధాన కారణమైందంటున్నారు. నిజానికి ఐపీఓ ఊపులో స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువ ఏకంగా 3 ట్రిలియన్లకు చేరువయింది. అయితే మార్నింగ్‌స్టార్ వంటి ప్రముఖ గ్లోబల్ అనలిస్టులు ఈ షేరు వాస్తవ విలువ కేవలం 62 డాలర్లు మాత్రమేనని, ఇది ఓవర్ వాల్యుయేషన్ తో ట్రేడ్ అవుతోందని హెచ్చరించారు.

Also read: BSNL ఆల్ రౌండర్ ప్లాన్.. ఇదొక్కటి చాలు మామ.. 70 రోజులు తిరుగుండదు!

స్పేస్ ఎక్స్‌లో విలీనం..

Advertisement

కొన్ని రిపోర్టుల ప్రకారం, రాకెట్ లాంచ్‌లు, స్టార్‌లింక్ ద్వారా ఆదాయం పెరుగుతున్నప్పటికీ స్పేస్ సెర్చ్, ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం భారీగా ఖర్చు చేస్తుండటంతో కంపెనీ గత ఏడాది 5 బిలియన్ డాలర్ల నికర నష్టాన్ని చూసింది. గత వారం ఎలాన్ మస్క్ ఏఐ కోడింగ్ స్టార్టప్ కర్సర్ ను 60 బిలియన్ డాలర్ల ఆల్-స్టాక్ డీల్ ద్వారా స్పేస్ ఎక్స్‌లో విలీనం చేశారు. ఈ మెర్జింగ్ కోసం కొత్త షేర్లను జారీ చేయడం వల్ల పాత ఇన్వెస్టర్ల వాటా విలువ 3.4% తగ్గింది. ఇది కూడా షేర్లు పడిపోవడానికి ఒక కారణమైంది.

50% పైగా లాభాలు..

వీటికి తోడు ప్రపంచంలోనే అతిపెద్ద ఇండెక్స్ ప్రొవైడర్ అయిన MSCI, స్పేస్‌ఎక్స్‌కు అత్యంత తక్కువ CCC సస్టైనబిలిటీ రేటింగ్‌ను ఇచ్చింది. ఎందుకంటే ఎలాన్ మస్క్ చేతిలోనే 82% పైగా ఓటింగ్ హక్కులు ఉండటం వల్ల సాధారణ ఇన్వెస్టర్లకు ఎలాంటి నిర్ణయాధికారం లేకపోవడం, ఎన్విరాన్ మెంట్ రిస్కులను సరిగ్గా నిర్వహించకపోవడమే దీనికి కారణం. ఈ రేటింగ్ తర్వాత పెద్ద పెద్ద గ్లోబల్ ఫండ్స్ తమ షేర్లను అమ్మడం ప్రారంభించాయి. ఐపీఓ రోజున షేర్లను తక్కువ ధరకు కొన్న రిటైల్ ఇన్వెస్టర్లు కేవలం 3 రోజుల్లోనే 50% పైగా లాభాలు రావడంతో భారీగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని షేర్లను అమ్మేశారు. రాబోయే ఆగస్ట్ లో కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్ తర్వాత లాక్-ఇన్ పీరియడ్ ముగిసి, వారు కూడా షేర్లను మార్కెట్లోకి తెస్తారనే భయంతో ముందే అమ్ముకుంటున్నారు.

Also read: లాంచ్‌కు ముందే లీకైన Samsung Galaxy Watch 9.. ఈసారి క్లాసిక్ వేరియంట్ లేనట్లేనా?

Related News

Land Controversy: మధ్యప్రదేశ్‌ సీఎంకు బిగుసుకున్న ఉచ్చు.. రాజీనామా చేయాలంటూ ప్రజలు డిమాండ్!

TMC Revolt: 28 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఘోర పరాభవం.. మమతకు ఊహించని దెబ్బ..!

Iran Sanctions: వాహనదారులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. కానీ..!

NDA Strategy: ఢిల్లీ పాలిటిక్స్‌లో జెట్ స్పీడ్ ట్విస్టులు.. ఈ సారీ విపక్షాలకు మైండ్ బ్లాక్ అయ్యేలా బిల్లు..?

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సెల్లార్‌లో లభించిన ఆ రహస్యాలు అవేనా..?

Monsoon Deficit: 146 ఏళ్లలో ఎన్నడూ లేని మహా ఘోరం.. లోటు వర్షపాతంతో వణికిపోతున్న భారతదేశం..!

BrahMos Deal: పాక్-సౌదీ కూటమికి భారత్ మైండ్ బ్లాకింగ్ కౌంటర్.. గల్ఫ్ దేశంతో హిస్టారికల్ ఒప్పందం!

Big Stories

×