E-Paper
Advertisement

ప్రజల భూముల విషయంలో ఇదేం పద్ధతి? 22Aపై జగదీశ్ రెడ్డి

ప్రజల భూముల విషయంలో ఇదేం పద్ధతి? 22Aపై జగదీశ్ రెడ్డి
Advertisement

Telangana 22A Lands Issue:బిగ్ టీవీ నిర్వహిస్తున్న ‘స్ట్రైట్ టాక్’ కార్యక్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట BRS ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన 22A నిషేధిత భూముల విషయంపై తన అభిప్రాయాలని తెలుపుతూ ,22Aవిషయంలో ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై పలు ప్రశ్నలు సంధించారు.

అన్నీ పరిశీలించిన తర్వాతే

Advertisement

జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 22A భూముల విషయంలో అసలు సమస్య ఎక్కడ ఉందో ముందుగా గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కొన్ని భూములకు సంబంధించిన పాత రికార్డులను పూర్తిగా చూడకుండా నిర్ణయాలు తీసుకుంటే సమస్య మరింత పెరుగుతుందని స్పష్టం చేశారు. భూమికి సంబంధించిన పాత పత్రాలు, సర్వే నంబర్లు, రికార్డులు అన్నీ పరిశీలించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని అన్నారు.

రికార్డుల ఆధారంగా అనుమానించవద్దు 

Advertisement

ఇక ఫార్మ్ ల్యాండ్ పేరుతో ఉన్న భూముల విషయంలో కూడా ఆయన పలు సంచలన కామెంట్స్ చేశారు. ఫార్మ్ అంటే వ్యవసాయ భూమి అని, అలాంటి భూములను కేవలం కొన్ని రికార్డుల ఆధారంగా అనుమానించడం సరికాదన్నారు. ఎన్నో ఏళ్లుగా భూములు ఉపయోగించుకుంటున్న ప్రజలు ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడే పరిస్థితి రావొద్దని తేల్చి చెప్పారు.

ఇక భూమి విషయంలో ఎవరి హక్కు ఏంటి? ఆ భూమి గతంలో ఎలా ఉంది? ప్రస్తుతం రికార్డుల్లో ఏం ఉంది? అనే విషయాలను క్లియర్‌గా చూడాలని ఆయన అన్నారు. అధికారులు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు.

కమిటీ వేయడం మాత్రమే సరిపోదు 

22A సమస్యపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయడంపైనా జగదీశ్వర్ రెడ్డి స్పందించారు. కమిటీ వేయడం మాత్రమే సరిపోదని, ఆ కమిటీ నిజంగా రికార్డులను పరిశీలించి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని అన్నారు. తమ దగ్గర ఉన్న సర్వే నంబర్లు, పాత రికార్డులు, భూములకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే అసలు విషయం బయటకు వస్తుందని చెప్పారు.

కొన్ని సందర్భాల్లో ప్రజలు తమ భూముల విషయంలో అధికారులను సంప్రదించినా సరైన సమాధానం దొరకడం లేదనే ఆందోళన ఉందని ఆయన అన్నారు. కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు కూడా ఈ అంశంపై స్పష్టంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యను పరిష్కరించాలని సూచించారు.

ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి 

ముఖ్యంగా 22Aలో భూములు ఎలా చేరాయి? ఎప్పుడు చేరాయి? ఏ రికార్డు ఆధారంగా వాటిని నిషేధిత భూములుగా గుర్తించారు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని జగదీశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏళ్లుగా ఉన్న రికార్డులను పక్కన పెట్టి కొత్తగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పారు.

భూమి మనదే.. కానీ అమ్ముకోలేం! 22Aపై జగదీశ్ రెడ్డి కీలక కామెంట్స్

ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ కోణంలో మాత్రమే చూడకుండా ప్రజల భూములు, వారి హక్కులకు సంబంధించిన అంశంగా చూడాలని ఆయన అన్నారు. ఎవరి భూమి విషయంలో అయినా పూర్తిస్థాయిలో విచారణ చేసి, నిజానిజాలు తేల్చిన తర్వాతే చర్యలు తీసుకోవాలని కుండ బద్దలు కొట్టారు.

Tags

Related News

భూమి మనదే.. కానీ అమ్ముకోలేం! 22Aపై జగదీశ్ రెడ్డి కీలక కామెంట్స్

మచిలీపట్నంలో హోరెత్తిన వీఆర్ఏ జేఏసీ ధర్నా.. వారి డిమాండ్లు ఇవే!

ఖైరతాబాద్ ఉప ఎన్నికల బరిలో కవిత పార్టీ.. అభ్యర్థి ఎవరంటే?

నాకు వారి నుండి ప్రాణహాని ఉంది.. యరపతినేని శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్!

కేంద్ర ప్రభుత్వానికి బిగ్ షాక్.. సర్ వివాదంపై స్పష్టత కోరిన ఎన్డీయే మిత్రపక్షాలు!

నాగాలాండ్‌లో తీవ్ర విషాదం.. కల్తీ మద్యం తాగి 19 మంది మృతి!

రాజ్యాంగ వ్యవస్థ పై బాంబు పేల్చిన జర్నలిస్టులు.. వెలుగులోకి సంచలనాలు!

Big Stories

Advertisement
×