Kaaka Movie: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం “కాకా”(Kaaka). డైరెక్టర్ బాబి కొల్లి (Bobby Kolli)దర్శకత్వంలో ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 13వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇలా ఒకవైపు షూటింగ్ పనులను జరుపుతూనే మరోవైపు డబ్బింగ్ పనులను కూడా ప్రారంభించారు. తాజాగా ఈ సినిమాకి డబ్బింగ్ పనులను మొదలు పెడుతున్నట్లు చిత్ర బృందం అధికారకంగా తెలియజేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుందని ఇప్పటికే షూటింగ్ పూర్తి అయిన భాగానికి డబ్బింగ్ పనులను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఇలా ఏకకాలంలో షూటింగ్ తో పాటు డబ్బింగ్ పనులు(Dubbing Work) కూడా పూర్తి అవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 13వ తేదీ విడుదల కాదు అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బాబి సినిమా పనులను వేగవంతం చేశారు. అనుకున్న సమయానికి ఈ సినిమాని విడుదల చేయాలన్న ఉద్దేశంతో నేడు పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులను ప్రారంభించారు.హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డును సృష్టించే లక్ష్యంతో ‘ది బ్లడీ బెంచ్‌మార్క్’ అనే క్యాప్షన్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో చిరంజీవి(Chiranjeevi) కదిరి కాళిదాసు (Kadiri Kalidas) అనే పాత్రలో కనిపించబోతున్నారు. అనస్వర రాజన్, నివేతా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను, కన్నడ నటి రచిత రామ్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ మంచి అంచనాలను పెంచేసాయి. ఇకపోతే బాబీ చిరంజీవి కాంబినేషన్ లో ఇదివరకు వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
Can’t wait to bring this MASSIVE dose of entertainment and action to the audience this Sankranthi! ❤️🔥🔥#KAAKAOnJan13 https://t.co/cYO9wSoVnC
— Bobby (@dirbobby) September 25, 2026
ఈ నేపథ్యంలోనే కాకా సినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కదిరి కాళిదాస్ ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుంటారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు 300 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి మెగాస్టార్ సిద్ధమయ్యారు.
Also Read: తప్పుగా తీసుకోవద్దు.. జర్నలిస్టు నాగేంద్ర వివాదంపై సంపూర్ణేష్ బాబు వివరణ!