E-Paper
Advertisement

పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ఎలా కొంటే లాభం.. ఎక్స్‌పర్ట్స్ ఇస్తున్న సలహలివే?

పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ఎలా కొంటే లాభం.. ఎక్స్‌పర్ట్స్ ఇస్తున్న సలహలివే?
Advertisement

Gold Price: ప్రస్తుతం తులం బంగారం ధర లక్షా 48,000 నుంచి లక్షా 49,000 రూపాయల మధ్య ట్రేడ్ అవుతోంది. ధర కాస్త తగ్గడం, అదే టైమ్‌లో ఫెస్టివల్స్, మ్యారేజెస్ దగ్గరపడటంతో మార్కెట్లో బంగారం కొనుగోళ్లు పెరిగాయి. అయితే అంతర్జాతీయంగా అమెరికా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం లెక్కలు, ముడిచమురు ధరలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పొలిటికల్ పరిస్థితుల ఆధారంగా గోల్డ్ రేట్లు హెచ్చుతగ్గులకు గురవుతుంటాయి.

ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్..

బంగారం కొనేముందు వడ్డీ రేట్లకు, గోల్డ్ రేట్లకు ఉన్న డిఫరెన్స్‌ని కొనుగోలుదారులు అర్థం చేసుకోవాలని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. సాధారణంగా బ్యాంక్ డిపాజిట్లు లేదా బాండ్లపై వడ్డీ వచ్చినట్లు బంగారంపై క్రమం తప్పకుండా వడ్డీ రాదు. అందుకే బ్యాంక్ వడ్డీ రేట్లు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం నుంచి డబ్బులు తీసి వడ్డీ వచ్చే మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. దానివల్ల బంగారం ధరలపై ప్రభావం పడుతుంది.

ఏం చేయాలి?

Advertisement

మరి పెళ్లిళ్లు, పండుగల కోసం బంగారం కొనాలనుకునేవారు ఏం చేయాలి? ధర ఇంకా తగ్గుతుందని వెయిట్ చేయడం కొంత రిస్క్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల వల్ల ధరలు తగ్గవచ్చో లేక ఉన్నట్లుండి పెరగవచ్చో ఖచ్చితంగా చెప్పలేం. అందుకే అవసరం ఉన్నవారు మొత్తం ఒకేసారి కొనకుండా, విడతలవారీగా డిఫరెంట్ డేట్స్‌లో కొనుగోలు చేస్తే రేట్ల హెచ్చుతగ్గుల రిస్క్ తగ్గుతుంది.

అదనపు ఖర్చులు..

ఇక గోల్డ్‌ని కేవలం ఇన్వెస్ట్‌మెంట్‌గా చూసేవారు అమెరికా ఆర్థిక డేటా, కమోడిటీ మార్కెట్ ట్రెండ్స్‌ని గమనించి నిర్ణయం తీసుకోవాలి. వీటితో పాటు సాధారణ కొనుగోలుదారులు బంగారం కొనేటప్పుడు జువెలరీ షాపుల్లో వేసే మేకింగ్ ఛార్జీలు, వేస్టేజ్, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులను కూడా చెక్ చేసుకోవాలి. అలాగే బిఐఎస్ హాల్‌మార్క్, పసిడి స్వచ్ఛతను చూసుకుని ప్రాపర్ బిల్లు తీసుకోవడం చాలా ముఖ్యం.

Advertisement

Also read: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. దసరాకి బోనస్..?

Tags

Related News

యూపీఐలో సరికొత్త ఫీచర్.. మీ ఖాతాతో కుటుంబ సభ్యులూ పేమెంట్స్ చేయెుచ్చు.. ఇదెలాగో తెలుసా?

పీఎఫ్ విత్‌డ్రాపై న్యూ రూల్స్.. 10 సార్లు డబ్బులు తీసుకోవచ్చు, డీటేల్స్ ఇవిగో

చెక్ బౌన్స్ టెన్షనా?అకౌంట్ క్లోజ్ చేసే రైట్స్ బ్యాంకులకు ఉన్నాయా?

మారుతున్న పరిణామాలు.. పండగ వేళ బంగారం ధర పతనం, మార్కెట్లో రేటు ఎలా ఉంది?

ఐటీ షేర్లు లాభాల్లో దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు!

నెలకు రూ.1000 జీతం.. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లకు అధిపతి, అదెలా సాధ్యం?

గాజువాకలో CMR జువెలరీ గ్రాండ్ ఓపెనింగ్.. ముఖ్య అతిథిగా భాగ్యశ్రీ బోర్సే!

Big Stories

Advertisement
×