E-Paper
Advertisement

తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రూ. 2.50 కోట్లతో కొత్త ప్రాజెక్ట్!

తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. రూ. 2.50 కోట్లతో కొత్త ప్రాజెక్ట్!
Advertisement

Korra Meenu: కొర్రమీను పెంపకం, సీడ్‌ ఉత్పత్తి, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రభుత్వం ప్రోత్సాహం ఇవ్వడంతో ఈ రంగానికి కొత్త ఊపు రానుంది. కొర్రమీను ఉత్పత్తిని పెంచడంతోపాటు నాణ్యమైన సీడ్‌ను అందుబాటులోకి తీసుకురావడం, పచ్చళ్ల తయారీ ద్వారా మహిళలకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న పనులకు ఇప్పటికే ఈటెండర్‌ ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వం రూ.2.50 కోట్లు కేటాయించగా.. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.

సీడ్‌ కొరతకు చెక్‌..

కొర్రమీను పెంపకంలో నాణ్యమైన సీడ్‌ అందుబాటులో ఉండటం కీలకం. ప్రస్తుతం రైతులు, చేపల పెంపకందారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో సీడ్‌ లభ్యత కూడా ఒకటి. ఈ సమస్యను అధిగమించేందుకు కరీంనగర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌‌లో కొర్రమీను సీడ్‌ ఉత్పత్తికి చర్యలు చేపడుతున్నారు. నాణ్యమైన సీడ్‌ను శాస్త్రీయ పద్ధతుల్లో ఉత్పత్తి చేసి అవసరానికి అనుగుణంగా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా కొర్రమీను పెంపకానికి మరింత ప్రోత్సాహం లభించనుంది.ఇప్పటివరకు సీడ్‌ కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సి వచ్చిన పరిస్థితి క్రమంగా తగ్గే అవకాశం ఉంది. స్థానికంగానే సీడ్‌ లభిస్తే రవాణా వ్యయం తగ్గడంతో పాటు సీడ్‌ నాణ్యత, లభ్యతపై పర్యవేక్షణకు అవకాశం ఉంటుంది.

డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి..

Advertisement

కొర్రమీనుకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఉత్పత్తిని పెంచే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సీడ్‌ లభ్యత పెరిగితే చెరువులు, ఇతర నీటి వనరుల్లో కొర్రమీను పెంపకాన్ని విస్తరించేందుకు అవకాశం ఉంటుంది.ఉత్పత్తి పెరిగిన తరువాత మార్కెటింగ్‌, ప్రాసెసింగ్‌, విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి సారించడం ద్వారా పెంపకందారులకు మెరుగైన ఆదాయం లభించేలా చర్యలు తీసుకోవచ్చు. ఉత్పత్తి నుంచి మార్కెట్‌ వరకు సమగ్ర వ్యవస్థ ఏర్పాటైతే కొర్రమీను రంగం మరింత విస్తరించే అవకాశం ఉంది.

పచ్చళ్లకు విదేశాల్లోనూ గిరాకీ..

కొర్రమీను మాంసంతోపాటు దాని ఆధారంగా తయారు చేసే పచ్చళ్లకు విదేశాల్లోనూ డిమాండ్‌ పెరుగుతున్నట్లు అధికారులు, సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సంప్రదాయ రుచితో తయారయ్యే కొర్రమీను పచ్చడిని విలువ ఆధారిత ఆహార ఉత్పత్తిగా అభివృద్ధి చేస్తే పెద్ద మార్కెట్‌ను అందుకునే అవకాశం ఉంది. ప్రత్యేక రుచితో ఉండే కొర్రమేను పచ్చడి సంప్రదాయ ఆహార ఉత్పత్తిగా ఇప్పటికే పలువురిని ఆకట్టుకుంటోంది. దీనిని చిన్న తరహా పరిశ్రమగా అభివృద్ధి చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.ఇందుకోసం పరిశుభ్రత, నాణ్యత, నిల్వ పద్ధతులు, ప్యాకేజింగ్‌, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది. స్థానికంగా తయారయ్యే పచ్చళ్లను ప్రమాణాలతో ప్యాక్‌ చేసి మార్కెట్‌ చేస్తే దేశీయంగానే కాకుండా విదేశీ మార్కెట్లలోనూ అవకాశాలు పెరగనున్నాయి.

Advertisement

Also read: మీ బంగారంపై ఉన్న హాల్‌మార్క్ అసలైనదా? లేదా ?ఇలా గుర్తించండి!

మహిళలకు శిక్షణ ఇస్తే ఉపాధి..

కొర్రమీను పచ్చళ్ల తయారీని మహిళలకు ఉపాధి, ఆదాయ వనరుగా మార్చే దిశగా శిక్షణ కార్యక్రమాలు చేపడితే ఆర్థికంగా బలోపేతం కానున్నారు. కుటుంబానికి సైతం తోడ్పాటు, స్థానికంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. పచ్చడి తయారీ విధానంతో పాటు ముడిసరుకు ఎంపిక, పరిశుభ్రత, నిల్వ, ప్యాకేజింగ్‌, మార్కెటింగ్‌ తదితర అంశాల్లో మహిళలకు అవగాహన కల్పించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుంటే చిన్నస్థాయి యూనిట్లను ఏర్పాటు చేసి పచ్చళ్ల తయారీ, విక్రయాల ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. డిమాండ్‌ పెరిగే కొద్దీ ఉత్పత్తిని కూడా పెంచుకునే వీలుంటుంది. ఆదిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అక్టోబర్‌లో మంచిర్యాలలో..

ఈఏడాది అక్టోబర్‌లో మంచిర్యాలలో కొర్రమీనుపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. కొర్రమీను పెంపకంతోపాటు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ఆసక్తి ఉన్నవారికి ఈ శిక్షణ ఉపయోగపడనుంది.మహిళా సంఘాలు, మత్స్యకారులు, కొర్రమీను పెంపకంపై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ అందించడం ద్వారా ఈ రంగాన్ని గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం చేయాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే కొర్రమీను ఆధారిత ఉత్పత్తులపై కరీంనగర్‌లో ఇప్పటికే శిక్షణ కార్యక్రమం పూర్తయింది. ఇందులో కొర్రమీను పెంపకం, పచ్చళ్ల తయారీ, వాటి నాణ్యత, పరిశుభ్రత, నిల్వ, ప్యాకేజింగ్‌ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో జగిత్యాల, పెద్దపల్లిలో కూడా శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఉపాధికి.. ఆదాయానికి కొత్త బాట

కొర్రమీమేను అభివృద్ధి కార్యక్రమాన్ని కేవలం చేపల ఉత్పత్తికే పరిమితం చేయకుండా సీడ్‌ ఉత్పత్తి–పెంపకం–ప్రాసెసింగ్‌–పచ్చళ్ల తయారీ–ప్యాకేజింగ్‌–మార్కెటింగ్‌ వరకు విస్తరించగలిగితే అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. చేపల పెంపకందారులతో పాటు మహిళా సంఘాలు, చిన్న వ్యాపారులు, రవాణా, ప్యాకేజింగ్‌ రంగాలకు కూడా ప్రయోజనం కలగనుంది. ప్రభుత్వం కేటాయించిన రూ.2.50 కోట్లతో చేపట్టే పనులు, కరీంనగర్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో సీడ్‌ ఉత్పత్తి, శిక్షణ కార్యక్రమాలు సమన్వయంగా సాగితే కొర్రమీను రంగానికి మరింత ఊతం లభించే అవకాశం ఉంది.

Also read: Samsung Galaxy వాచ్‌ను స్మార్ట్‌గా వాడాలంటే ఈ 5 సెట్టింగ్స్ మార్చాల్సిందే!

Tags

Related News

ఖైరతాబాద్‌పై కాంగ్రెస్‌లో మొదలైన పరేషాన్.. జంకుతున్న ఆ కీలక నేతలు?

నిమజ్జనం పాటలను కూడా వదలని కేటీఆర్‌..! కేసీఆర్‌ను జనం మరవలేదని చెప్పేందుకు మరీ ఇంత అల్పత్వమా? ఆ సినిమా చూసి… కేసీఆర్‌ను తక్కువ చేసి…

తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక.. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై వేటు?

రహస్య స్నేహితుడిని కాదని అడుగు బయటపెట్టగలడా…? సొంతంగా బలం నిరూపించుకోవాలనే తండ్లాటే..!

“G9 బొగ్గు అక్కడ.. చెత్త బొగ్గు ఇక్కడ!”.. సింగరేణి దందాను బయటపెట్టిన జగదీశ్వర్ రెడ్డి!

కాంట్రాక్టులు.. కమిషన్లు.. అభివృద్ధి అంటే ఇదేనా? BRS ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఫైర్

ప్రజల భూముల విషయంలో ఇదేం పద్ధతి? 22Aపై జగదీశ్ రెడ్డి

Big Stories

Advertisement
×