E-Paper
Advertisement

ఇదేం విచిత్రం వరికే అగ్రతాంబూలమా.. ఆ పంటలపై వ్యవసాయ పరిశోధకులు శీతకన్ను..?

ఇదేం విచిత్రం వరికే అగ్రతాంబూలమా.. ఆ పంటలపై వ్యవసాయ పరిశోధకులు శీతకన్ను..?
Advertisement

Seed Research: స్వేచ్చ బ్యూరో: రైతుకు నాణ్యమైన విత్తనం అందించడం వ్యవసాయంలో తొలి మెట్టు. అధిక దిగుబడి, తక్కువ సాగు ఖర్చు, చీడపీడలు–తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఉండే కొత్త వంగడాలు అందుబాటులోకి వస్తే రైతుకు ఎంతో మేలు. ఇందుకోసం ప్రభుత్వం ఏటా వ్యవసాయ పరిశోధన, విత్తనాభివృద్ధికి కోట్లాది రూపాయలు కేటాయిస్తోంది. వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిశోధన కేంద్రాలు పలు పంటలపై ప్రయోగాలు చేస్తున్నాయి.అయితే పరిశోధనల ఫలాలు రైతు పొలానికి ఎంతమేర చేరుతున్నాయి? కొత్త వంగడాల అభివృద్ధిలో ఆశించిన వేగం ఉందా? వరికి ఇస్తున్న ప్రాధాన్యం ఇతర ప్రధాన పంటలకు ఎందుకు కనిపించడం లేదు? పత్తి, మిరప, కంది, మినుము, వేరుశనగ వంటి పంటల్లో రైతులు ఇప్పటికీ ప్రైవేటు కంపెనీల విత్తనాలపై ఎందుకు ఆధారపడుతున్నారు? అన్నది అధికారులకే తెలియాలి.

వరికే ఎందుకింత ప్రాధాన్యం?

తెలంగాణలో వరి ప్రధాన పంట కావడంతో వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనల్లో దీనికి సహజంగానే అధిక ప్రాధాన్యం ఉంది. అధిక దిగుబడినిచ్చే రకాలు, తక్కువ కాలంలో కోతకు వచ్చే వంగడాలు, వివిధ ప్రాంతాల వాతావరణానికి అనువైన రకాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. విత్తనోత్పత్తి, మినీకిట్లు, క్షేత్ర ప్రదర్శనల ద్వారా రైతులకు వాటిని చేరువ చేసే కార్యక్రమాలూ కొనసాగుతున్నాయి. RNR 15048 – తెలంగాణ సోనా, KNM 1638 – కునారం వరిం-2,WGL 1487,JGL 28545,JGL 27356,RNR 29325, రాజేంద్రనగర్‌ వరిం-4, తాజాగా WGL-1488 వరి రకంపై పరిశోధన చేస్తున్నారు. కానీ తెలంగాణ వ్యవసాయం వరిఒక్కటే కాదు. పత్తి, మిరప, కంది, మినుము, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలూ రైతుల ఆదాయంలో కీలకంగా ఉన్నాయి. ఆయా పంటల్లో స్థానిక వాతావరణానికి తగ్గ, అధిక దిగుబడినిచ్చే, తెగుళ్లను తట్టుకునే కొత్త రకాలు ఎన్ని అందుబాటులోకి వచ్చాయి? వాటి విత్తనం ఎంతమేర ఉత్పత్తి అవుతోంది? ఎంతమంది రైతులకు చేరుతోంది? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

పత్తిలో ప్రైవేటుదే పెత్తనం

Advertisement

తెలంగాణలో పత్తి రైతులు ప్రధానంగా ప్రైవేటు కంపెనీల బీటీ విత్తనాలపైనే ఆధారపడుతున్నారు. వివిధ కంపెనీలు తమ హైబ్రిడ్‌ రకాలను మార్కెట్‌లోకి తీసుకువచ్చి విస్తృతంగా విక్రయిస్తున్నాయి. రైతుకు ఎంపికలు కనిపిస్తున్నప్పటికీ, ప్రభుత్వ రంగంలో పెద్దఎత్తున ప్రత్యామ్నాయ విత్తన వ్యవస్థ బలపడలేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క బీటీ విత్తనంను సైతం యూనివర్సిటీ తీసుకురాలేదని రైతులు పేర్కొంటున్నారు. వ్యవసాయం తర్వాత ఎక్కువగా సాగుచేసేది పత్తి. కానీ ఆదిశగా ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం దృష్టిసారించిన దాఖలాలు లేవనే విమర్శలున్నాయి.

Also read: 120 ఇంచుల బిగ్ స్క్రీన్ మ్యాజిక్..కొత్త లుమియో ఆర్క్ 7 ప్రొజెక్టర్‌తో ఇల్లే థియేటర్!

WGCV బీటీ-28 పత్తి రకం..

Advertisement

ప్రైవేటు విత్తనంతో నష్టపోయిన రైతులు అప్పులపాలై రోడ్డునపడుతున్న ఘటనలు ఉన్నాయి. పరిహారం కోసం పోరాటం చేస్తున్న సందర్భాలు.. ఇటీవల బాధితరైతులు రైతు కమిషన్ ను, ప్రభుత్వాన్ని ఆశ్రయించిన ఘటనలు ఉన్నాయి. ఇటీవల ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం WGCV బీటీ-28 పత్తి రకాన్ని విడుదల చేసింది. అయితే అసలు పరీక్ష ఇక మొదలైంది. ఈ వంగడం ఎంత విస్తీర్ణానికి చేరుతుంది? రైతులకు అవసరమైన స్థాయిలో విత్తనం ఉత్పత్తి అవుతుందా? ప్రైవేటు కంపెనీల విత్తనాలకు ఇది ఎంతవరకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది? అనేది చర్చకుదారితీసింది. అసలు ఎందుకు పత్తి వంగడాన్ని తీసుకురాలేదన్నది ప్రశ్నగా మారింది.

మిరప రైతుకు కొత్త వంగడాలు ఎక్కడ?

మిరప తెలంగాణలో ప్రధాన వాణిజ్య పంట. దిగుబడితో పాటు రంగు, కారం, నాణ్యత, ఎగుమతులకు అనుకూలత, తెగుళ్ల నిరోధకతకు ప్రాధాన్యం ఉంటుంది.మార్కెట్‌లో రైతుకు అనేక ప్రైవేటు హైబ్రిడ్‌ రకాలు అందుబాటులో ఉన్నా.. తెలంగాణ నేలలు, వాతావరణ పరిస్థితులకు ప్రత్యేకంగా సరిపోయే ప్రభుత్వ ఆధారిత కొత్త వంగడాల విస్తరణపై మరింత దృష్టి అవసరమన్న అభిప్రాయం ఉంది.ప్రత్యేకించి వైరస్‌ తెగుళ్లు, వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులను తట్టుకునే రకాల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. కానీ ఆదిశగా యూనివర్సిటీ అధికారులు చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలున్నాయి.

కంది.. మినుము.. వేరుశనగ

పప్పుధాన్యాల సాగులోనూ ఇదే పరిస్థితి. కందిలో అధిక దిగుబడితో పాటు తక్కువ కాలంలో పంట పూర్తయ్యే రకాలు, ఎండను తట్టుకునే సామర్థ్యం, కాయ తొలిచే పురుగులను తట్టుకునే లక్షణాలు రైతులకు అవసరం.మినుములో వైరస్‌ తెగుళ్లను తట్టుకునే రకాలు, వేరుశనగలో అధిక దిగుబడి, నూనె శాతం, కరువు పరిస్థితులను తట్టుకునే వంగడాలకు డిమాండ్‌ ఉంది.రైతుల అవసరాలకు అనుగుణంగా పరిశోధన సాగుతున్నా.. ఆ ఫలితాలు రైతు పొలంలో కనిపించే స్థాయిలో ఉన్నాయా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశం.

Also read: ఇంట్లో పనిమనిషిగా చేయడానికైనా రెడీ అంటున్న ఐఐటీ గ్రాడ్యుయేట్.. చేతిలో పెద్ద డిగ్రీ ఉన్నా ఇదీ దుస్థితి

పరిశోధనకు కోట్లు కేటాయింపులు

వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ప్రతి ఏటా భారీగా నిధులు కేటాయిస్తోంది. విశ్వవిద్యాలయం, పరిశోధనా కేంద్రాల్లో సిబ్బంది, ప్రయోగశాలలు, క్షేత్ర పరిశోధనలు, విత్తనోత్పత్తి, విస్తరణ కార్యక్రమాల కోసం 2026-27 బడ్జెట్ లో సుమారు 16 కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో నూతన వంగడాల సృష్టి జరగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే నిధుల కేటాయింపే పరిశోధన విజయానికి కొలమానం కాదు.. ఆ నిధులతో అభివృద్ధి చేసిన వంగడాలు రైతులకు ఎంతమేర చేరాయి? వాటి సాగు విస్తీర్ణం ఎంత పెరిగింది? రైతుకు ఎకరాకు దిగుబడి ఎంత పెరిగింది? సాగు ఖర్చు తగ్గిందా? ప్రైవేటు విత్తనాలపై ఆధారపడటం తగ్గిందా? అన్నదే అసలు కొలమానం.

పూర్తి ప్రక్రియ..

ఒక కొత్త వంగడం అభివృద్ధికి సంవత్సరాల సమయం పడుతుంది. ప్రయోగాలు, వివిధ ప్రాంతాల్లో పరీక్షలు, దిగుబడి అంచనా, తెగుళ్ల నిరోధకత, నాణ్యత పరిశీలన తర్వాతే విడుదల చేస్తారు. కానీ అక్కడితో ప్రక్రియ పూర్తికాదు. పరిశోధన → పరీక్షలు → వంగడం విడుదల → విత్తనోత్పత్తి → ధ్రువీకరణ → భారీ స్థాయి సరఫరా → రైతు పొలంలో సాగు వరకు మొత్తం వ్యవస్థ పనిచేయాలి.కొత్త రకం విడుదలైనా తగినంత విత్తనం ఉత్పత్తి కాకపోతే రైతుకు ప్రయోజనం ఉండదు. ఇదే సమస్య పలు పంటల్లో ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రైవేటు కంపెనీల వైపు రైతు చూపు?

ప్రైవేటు విత్తన కంపెనీలు తమ ఉత్పత్తులను రైతులకు చేరవేయడంలో వేగంగా పనిచేస్తున్నాయి. డీలర్ల నెట్‌వర్క్‌, క్షేత్రస్థాయి ప్రదర్శనలు, రైతు సమావేశాలు, విస్తృత ప్రచారం ద్వారా కొత్త రకాలను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి.ప్రభుత్వ పరిశోధనా సంస్థల్లో అభివృద్ధి చేసిన వంగడాలు మాత్రం రైతుకు అందుబాటులోకి రావడానికి ఎక్కువ సమయం పడుతున్నాయన్న విమర్శ ఉంది.దీంతో సీజన్‌ ప్రారంభంలోనే రైతు విత్తనం కోసం ప్రైవేటు డీలర్‌ను ఆశ్రయిస్తున్నారు. కంపెనీ చెబుతున్న దిగుబడి వస్తుందన్న హామీపై పెట్టుబడి పెడుతున్నాడు. ఆశించిన ఫలితం రాకపోతే నష్టాన్ని రైతే భరించాల్సి వస్తోంది.

Also read: కేటీఆర్ ఆస్తుల చిట్టాలో రేవంత్ హిట్టు .. కేసీఆర్ అక్రమాస్తుల అంశంలో దొరకని పట్టు!

ఆర్భాటం కాదు.. ఫలితం కావాలి

వంగడాల విడుదల కార్యక్రమాలు, పరిశోధన సదస్సులు, క్షేత్ర ప్రదర్శనలు.. ఇవన్నీ పరిశోధన వ్యవస్థలో భాగమే. కానీ రైతు పొలంలో కొత్త రకం ఎంత విస్తీర్ణంలో సాగవుతోంది? అన్నదే తుది ఫలితాన్ని నిర్ణయిస్తుంది.రైతుకు అత్యవసరంగా అవసరమైన పంట ఏది?ఏ పంటలో ప్రైవేటు విత్తనాలపై ఆధారం ఎక్కువగా ఉంది?ఏ తెగులు దిగుబడిని ఎక్కువగా దెబ్బతీస్తోంది?వాతావరణ మార్పులతో ఏ పంటకు ముప్పు పెరుగుతోంది?ఏ కొత్త వంగడాన్ని ఎంతకాలంలో రైతుకు అందుబాటులోకి తేవాలి?విడుదలైన రకానికి అవసరమైనంత విత్తనాన్ని ఎలా ఉత్పత్తి చేయాలి?ఈ ప్రశ్నలకు సమాధానాలతో పరిశోధనకు ప్రాధాన్యాలు నిర్ణయిస్తే రైతుకు మరింత ఉపయోగం ఉంది.

వంగడాల విడుదల..

వ్యవసాయ విశ్వవిద్యాలయాల లక్ష్యం కేవలం పరిశోధన చేయడం కాదు. రాష్ట్ర వ్యవసాయ అవసరాలకు తగ్గ పరిష్కారాలను అభివృద్ధి చేసి వాటిని రైతుకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. విశ్వవిద్యాలయ పనితీరును పరిశోధనా పత్రాలు, వంగడాల విడుదల సంఖ్యతో మాత్రమే కాకుండా రైతు పొలంలో వాటి వినియోగం, దిగుబడి, సాగు ఖర్చు, రైతు ఆదాయంపై ప్రభావం ఆధారంగా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. పత్తిలో ప్రభుత్వ రంగం నుంచి కొత్త బీటీవంగడం, అదే విధంగా వాణిజ్య పంటల్లోనూ తక్కువ వ్యవధిలోఎక్కువ దిగుబడి వచ్చే వంగడాలు, ఇతర ప్రధాన పంటల్లోనూ పరిశోధన వేగం పెరగాలని, అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు. ఇకనైనా ఆదిశగా యూనివర్సిటీ పరిశోధనలు కొనసాగిస్తుందా? లేదా? అనేది చూడాలి.

Also read: దుర్గాపూజలో మీ లైఫ్ పార్ట్‌నర్‌తో మ్యాచింగ్ డ్రెస్ ఇలా ట్విన్నింగ్ చేయండి.. ఇద్దరి ఫొటోలు అదిరిపోతాయి

Tags

Related News

సర్‌పై ఢిల్లీ దద్దరిల్లుతున్న వేళ.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రతిపక్షాల్లో నిస్తేజం..! బీఆరెస్‌ సైలెంట్‌ మోడ్‌.. వైసీపీ గప్‌చుప్‌..!

కేటీఆర్ ఆస్తుల చిట్టాలో రేవంత్ హిట్టు .. కేసీఆర్ అక్రమాస్తుల అంశంలో దొరకని పట్టు!

సీఈసీ వైఖరిపై దుమారం..! సర్‌ విధానంతో కేంద్రం బద్నాం..! ఓ వైపు ఢిల్లీ దద్దరిల్లుతుంటే కీర్తిబావుటాలేలా..?

గులాబీ ముల్లు.. కొణతం దిలీప్‌..! ఆయన చేతిలో బడానేత కీలుబొమ్మ.. దుందుడుకు మనస్తత్వానికి, పక్కదారి పట్టించే సలహాలు..!

యువనేత మరో కోణం.. నకిలీ బతుకుల ఫేక్ అకౌంట్లకు కేరాఫ్ అడ్రస్.. సోషల్ మీడియా చీకటి రాజ్యానికి తనో రారాజు…!

2022 ఆగస్టులో కొత్త పింఛన్లు పెంచిన కేసీఆర్.. సుధీర్ఘ కాలం తరువాత ఈ దసరాకు రేవంత్‌ సర్కార్‌..! 2.50లక్షల కొత్త ఫించన్లు..

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల రచ్చ.. 15 నుండి 18 మందికి మళ్లీ ఛాన్స్?

Big Stories

Advertisement
×