E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

మీ ఇంటికి ఎన్యూమరేషన్ ఫామ్‌లు వచ్చాయా?.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఓటు లింక్ చేసుకునే సింపుల్ ప్రాసెస్ ఇదే!

మీ ఇంటికి ఎన్యూమరేషన్ ఫామ్‌లు వచ్చాయా?.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఓటు లింక్ చేసుకునే సింపుల్ ప్రాసెస్ ఇదే!
Advertisement

Voter Enumeration: తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో భాగంగా ఇంటింటికీ వెళ్తున్నారు బూత్ లెవెల్ అధికారులు. జులై 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే జరగనుంది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 35 వేల 985 పోలింగ్ బూత్‌ల పరిధిలోని 3.38 కోట్ల మంది ఓటర్లకు వీరు ఎన్యూమరేషన్ పత్రాలు అందనున్నాయి. ఇప్పటికే చాలా మందికి ఎన్యూమరేషన్ ఫామ్‌ ఇస్తున్నారు. ముసాయిదా జాబితా జులై 31న ప్రచురించనున్నారు. ఓటర్లకు కావాల్సిన అన్ని వివరాలను తెలుపుతున్నామని.. ఫామ్‌ను ఎలా ఫిల్ చేయాలోతాము చెబుతున్నామంటున్నారు అధికారులు. అయితే ఇక్కడ కొన్ని సమస్యలు వస్తున్నాయంటున్నారు ఓటర్లు.

ఎన్యుమరేషన్ ఫామ్‌లు..

ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం ఉంటుందని ఇలాంటి సమస్యలకు BLOలు పరిష్కారం చూపుతారంటున్నారు అధికారులు. అయితే ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్లు తెలుసుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. ఇందులో అతి ముఖ్యమైనది ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో తమ పాత ఓట్లను లింక్ చేసుకునేందుకు ఓటర్లకు అవకాశం ఉంటుంది. గత లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఓటు వేసిన వారి ఓటర్ కార్డుల వివరాల ఆధారంగా బీఎల్వోలు ఇంటింటికీ వచ్చి ఎన్యుమరేషన్ ఫామ్‌లు ఇస్తారు. ఒక్కో ఓటరుకు రెండు కాపీలు ఇస్తారు. ఈ రెండింటినీ నింపిన తర్వాత తిరిగి బీఎల్వోలు వచ్చి అందులో ఒక దాన్ని తీసుకుంటారు. అలాగే రెండో ఫారంపై సంతకం చేసి అది తమకు అందినట్లుగా ధృవీకరిస్తారు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా దీన్ని చూపించవచ్చు.ఇలా ఎన్యుమరేషన్ ఫారాలు తీసుకున్న తర్వాత అందులో వివరాల ఆధారంగా జాబితా తయారు చేస్తారు.

Advertisement

Also read: Water Wastage: ఇదో విచిత్రమైన ఘోరం.. ట్యాంక్ నిండా నీరు ఉన్నా.. ఊరికి మాత్రం కరువు..!

ఈసీఐ ఓటర్స్ వెబ్ సైట్..

మరోవైపు ఆన్ లైన్‌లో ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు వీలుంది. ఎన్నికల సంఘం అధికారిక యాప్ ఈసీఐ నెట్ ను ఫోన్లో డౌన్ లోడ్ చేసుకోవాలి. అలాగే ఈసీఐ ఓటర్స్ వెబ్ సైట్ ఉంటుంది. ఇందులోకి వెళ్లి కూడా ఎన్యుమరేషన్ చేసుకోవచ్చు. అయితే యాప్ లేదా వెబ్ సైట్లో 2002 ఓటర్ల జాబితా సవరణ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అందులోకి వెళ్లిన తర్వాత అప్పట్లో ఓటు వేసిన రాష్ట్రం, అసెంబ్లీ నియోజకవర్గం, పోలింగ్ బూత్, పేరు వంటి వివరాలు ఎంటర్ చేస్తే మీ వివరాలు కనిపిస్తాయి. ఈ వివరాలను ప్రస్తుత ఎన్యుమరేషన్ ఆప్షన్ లోకి వెళ్లి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది 2002లో ఓటర్‌ జాబితాలో పేరు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది.

జులై 3 తర్వాత..

Advertisement

ఆధార్, ఓటర్ ఐడీలో పేర్లు వేరేగా ఉంటే మాత్రం బీఎల్‌వో ద్వారానే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తొలి రోజు కావడంతో కొన్ని ప్రాంతాల్లో కన్‌ఫ్యూజన్ ఏర్పడింది. కానీ వీటన్నింటిని సమర్థవవతంగా పరిష్కరిస్తామని ఓటర్లకు అవగాహన కల్పిస్తామంటున్నారు అధికారులు. ప్రస్తుతం ఓటర్లకు చేరిన ఎన్యూమరేషన్ ఫామ్‌ను జులై 3 తర్వాత తిరిగి కలెక్ట్ చేస్తామంటున్నారు అధికారులు.

Storey By: Appa Rao Big Tv

Also read: ఎండల దెబ్బకు స్కూళ్లకు సెలవులు.. ఎడారిగా మాడిపోతున్న ఫ్రాన్స్, బ్రిటన్.. అసలేం జరుగుతోంది?

Related News

ఎండల దెబ్బకు స్కూళ్లకు సెలవులు.. ఎడారిగా మాడిపోతున్న ఫ్రాన్స్, బ్రిటన్.. అసలేం జరుగుతోంది?

Nalgonda Murders: ఆస్తికోసం మరీ ఇంత దారుణమా.. నల్గొండ జిల్లా హత్యల కేసులో సంచలన నిజాలివే..?

Crude Prices: సామాన్యుడికి గుడ్‌న్యూస్.. 72 డాలర్లకు పడిపోయిన క్రూడాయిల్ ధరలు!

మీ కల ఎప్పటికీ నిజం కాదు.. బీజేపీ లీడర్ల ప్రకటనలపై జోగు రామన్న సంచలన కౌంటర్!

Vijay Udhayanidhi: సీఎం విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు సభలో సినిమా రేంజ్ డ్రామా..!

Lucknow Fire: లక్నో అగ్నిప్రమాదంలో ఘోరం.. కరెంట్ పోగానే బిల్డింగ్‌లో జరిగింది ఇదే..!

ACB Raids: ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి ఇళ్లపై ఏసీబీ రైడ్స్.. ఆస్తులు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

Big Stories

×