E-Paper
Advertisement

ఇంటర్ విద్యలో మైండ్ బ్లాక్ అయ్యే స్కామ్.. కలర్ జిరాక్స్‌తో గెజిటెడ్ ఉద్యోగ పోస్టులు!

ఇంటర్ విద్యలో మైండ్ బ్లాక్ అయ్యే స్కామ్.. కలర్ జిరాక్స్‌తో గెజిటెడ్ ఉద్యోగ పోస్టులు!
Advertisement

Contract Lecturers: గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద కీలకంగా వ్యవహరించిన ఓ మాజీ మంత్రి గతంలో పాలిటెక్నిక్ కళాశాలలో ఒప్పంద అధ్యాపకుడిగా విధులు నిర్వహించారనే సమాచారం వినిపిస్తోంది. అందుకే ఆ మంత్రి ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ అంశంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని తెలుస్తోంది.

రెగ్యులరైజేషన్ ప్రక్రియ..

ఈనేపథ్యంలోనే ఇంటర్ కాంట్రాక్ట్‌ అధ్యాపకుల రెగ్యులరైజేషన్ ప్రక్రియలో అత్యుత్సాహం ప్రదర్శించారని పలువురు కాంట్రాక్ట్ లెక్చరర్లే స్వయంగా ఆరోపణలు చేస్తుండటం గమనార్హం. తమ సర్టిఫికెట్లు నకిలీవని తెలిసి కూడా అప్పనంగా గెజిటెడ్ ఉద్యోగం దక్కుతుండడంతో నకిలీలు సైలెంట్ గా రెగ్యులర్ అయ్యి మూడు సంవత్సరాల నుంచి గెజిటెడ్ హోదాలో ప్రజాధనాన్ని కొల్లగొట్టారని ఆరోపిస్తున్నారు.

ఇంటర్ విద్యలోనే 750 పైచిలుకు..

Advertisement

ఇంటర్ విద్యలో తమకు అనుకూలంగా ఉన్న వారికి పట్టం కట్టేందుకు గత ప్రభుత్వం లో ఓ మంత్రి చక్రం తిప్పుతూ అనర్హులను అందలమెక్కించారని వారు చెబుతున్నారు. తన అనుచరులకు రెగ్యులరైజేషన్ కట్టబెట్టేందుకు ఉద్యోగ నిబంధనలను, అధికారుల మాటలను పెడ చెవిన పెడుతూ మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని, తాము చూసుకుంటామని భరోసా ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. తాము చెప్పింది చేయాల్సిందే అని అధికారులపై సైతం ఒత్తిడి పెంచి సుమారు ఒక్క ఇంటర్ విద్యలోనే 750 పైచిలుకు ఫేక్ అభ్యర్థులకు గెజిటెడ్ ఉద్యోగాలు కట్టబెట్టారని పలువురు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆరోపిస్తున్నారు. అంటే బీఆర్ఎస్ హయాంలో ఏ స్థాయిలో అవినీతికి బరితెగించారనేది దీన్నిబట్టి అంచనా వేసుకోవచ్చని చెబుతున్నారు.

Also Read: BSNL ధమాకా ప్లాన్.. రూ.999కే ప్రతీ నెలా 5,000GB డేటా, ఉచిత OTT సబ్‌స్క్రిప్షన్లు!

411 మంది వొకేషనల్..

Advertisement

బీఆర్ఎస్ లో ఆ కీలక మంత్రి అధికారులకు కనీసం అభ్యర్థుల సర్టిఫికెట్లను వెరిఫై చేసుకునే సమయం కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చిన రీతిన గెజిటెడ్ ఉద్యోగాలను ఇచ్చారని పలువురు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో అనర్హులు పోస్టులు ఎగరవేసుకుపోగా ఇంటర్ వొకేషనల్ విద్యలో పనిచేస్తూ అర్హులుగా ఉన్న సుమారు 411 మంది వొకేషనల్ ఒప్పంద అధ్యాపకులను శాంక్షన్డ్ పోస్టులు లేవని రెగ్యులరైజేషన్ నిలిపివేశారని చెబుతున్నారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ కేవలం రాజకీయ నాయకుల మెప్పు పొందడం కోసం రెగ్యులరైజేషన్ చేపట్టిన సంబంధిత అధికారులు ఇప్పుడు వాస్తవ విషయాలు దాచిపెట్టి ఇంతకాలం కాలం వెళ్లబుచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంటర్ బోర్డులోని ఓ కిందిస్థాయి అధికారి సుమారు 56 మంది అనర్హులైన వొకేషనల్ అధ్యాపకుల వద్ద నుంచి లబ్ధిపొంది వారికి గెజిటెడ్ ఉద్యోగాలు కట్టబెట్టాడనే విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి.

కాంట్రాక్ట్ లెక్చరర్లు పైర్..

అధికారుల తప్పిదం తో కొందరు డబ్బులకు ఆశపడి అవినీతి చేసి 411 మంది వొకేషనల్ అధ్యాపకులకు రెగ్యులరైజేషన్ చేయకుండా వారి కుటుంబాలను అంధకారంలో నెట్టివేశారని పలువురు కాంట్రాక్ట్ లెక్చరర్లు మండిపడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో పీజీలు చేసిన సుమారు 380 మందిలో 167 మందికి సంబంధించి ఆయా యూనివర్సిటీల వద్ద సమాచారం లభించడం లేదని తెలుస్తోంది.

కలర్ జిరాక్స్ సర్టిఫికెట్స్..

చాలామంది ఇతర రాష్ట్రాల్లో చదివిన ఒప్పంద అధ్యాపకులు జెన్యునిటీ సర్టిఫికెట్లను తమ చేతిగుండా ప్రిన్సిపాళ్లకు అందించారు. అంటే వీరు వివిధ ప్రాంతాల్లో ఉన్న స్టడీ సెంటర్ల సహకారంతో కలర్ జిరాక్స్ సర్టిఫికెట్స్ సృష్టించుకుని కాంట్రాక్ట్, గెజిటెడ్ జాబులు కొట్టేశారనే విమర్శలు వినబడుతున్నాయి. రెండు దశాబ్దాలకు పైగా ప్రజాధనాన్ని యథేచ్ఛగా కొల్లగొట్టిన అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ వీరిని గుర్తించకపోవడం శోచనీయం. ప్రస్తుతం వీరిలో కొందరు ఇన్ చార్జీ ప్రిన్సిపాళ్లుగా కూడా విధులు వెలగబెడుతున్నట్టు వినికిడి.

Also Read: హైటెక్ అవతారంలో మలక్‌పేట్ టీవీ టవర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫ్రీగా టీవీ చూడొచ్చు, అదెలా సాధ్యం?

గెజిటెడ్ ఉద్యోగాలు..

ఒకపక్క సుప్రీంకోర్టులో ఉన్న కేసు స్టేటస్కో ఉన్నప్పటికీ వీరికి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అదనంగా పలు బాధ్యతలు అప్పగించారనే విమర్శలు వినబడుతున్నాయి. కొందరైతే ఏకంగా ప్రిన్సిపాళ్ల ఆశీస్సులతో రెండు, మూడు ఇంక్రిమెంట్లను కూడా తీసుకున్నట్లు సమాచారం. ఇలాంటి ఫేక్ రాజాలకు గెజిటెడ్ ఉద్యోగాలు కట్టబెట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమకు తీరని అన్యాయం చేసిందని ఇంటర్ విద్యలో పనిచేస్తున్న 411 మంది వొకేషనల్ ఒప్పంద అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పలు అక్రమాలు..

ఇదిలా ఉండగా 2023లో జరిగిన డిగ్రీ, పాలిటెక్నిక్, ఇంటర్ విద్య ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణలో పలు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. కాగా జూనియర్ కాలేజీలకు సంబంధించి 35 మందిపై చర్యలు చేపట్టేందుకు ఇంటర్ విద్య అధికారులు కార్యాచరణ ప్రారంభించారు. పాలిటెక్నిక్ కళాశాలలలో పనిచేసే ఇతర రాష్ట్రాలలో పీజీలు చేసిన ఒప్పంద అధ్యాపకులను రెగ్యులర్ చేయకుండా అధికారులు పక్కన పెట్టారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన తప్పును సరిచేసి ప్రస్తుత ప్రజా ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వొకేషనల్ ఒప్పంద అధ్యాపకులు వేడుకుంటున్నారు.

Also Read: అమ్మకాల్లో దుమ్మురేపిన మారుతి గ్రాండ్ విటారా.. ఏకంగా 4 లక్షల యూనిట్లు సేల్!

Tags

Related News

బ్యాంక్‌లో లోన్ తీసుకున్నవారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్.. కొత్త రూల్స్ అమలు!

తెలంగాణ బీజేపీకి నితిన్ నబీన్ వార్నింగ్.. అలా చేస్తే మీ పోస్టు ఉస్టే..!

కాంగ్రెస్‌లో ఆపరేషన్ క్లీన్ ఇమేజ్.. టీపీసీసీ అంతర్గత విచారణలో షాకింగ్ నిజాలు!

విజయ డెయిరీ వివాదంలో బిగ్ ట్విస్ట్.. చలసాని రాజీనామా వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

వరల్డ్ ట్రైబల్ డే వేళ గిరిజనుల సంచలన డిమాండ్.. సీఎం చంద్రబాబు ఓకే చెప్తారా..?

ఈట‌ల కోసం రేష‌న్ కార్డుల ముద్రణ‌ ఆపేసిన కేసీఆర్‌.. ఆ క‌థా క‌మామీషు ఎట్టిద‌నినా..!

ఇద్ద‌రూ దోస్తులే.. మ‌రి బెడిసికొట్టిందెక్క‌డ‌..? ఇక ఆయ‌న‌ను న‌మ్మ‌డ‌మూ క‌ష్ట‌మేనా..?

Big Stories

Advertisement
×