E-Paper
Advertisement

కాంగ్రెస్‌లో ఆపరేషన్ క్లీన్ ఇమేజ్.. టీపీసీసీ అంతర్గత విచారణలో షాకింగ్ నిజాలు!

కాంగ్రెస్‌లో ఆపరేషన్ క్లీన్ ఇమేజ్.. టీపీసీసీ అంతర్గత విచారణలో షాకింగ్ నిజాలు!
Advertisement

Clean Image: స్వేచ్చ బ్యూరో: కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆపరేషన్ ‘క్లీన్ ఇమేజ్’ దిశగా అడుగులు పడుతున్నాయి. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా కొందరు మంత్రులు, అధికార పక్ష ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఆరోపణలపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్యేలు, మంత్రులపై వస్తున్న ఆరోపణల్లో ఏ మేరకు నిజం ఉన్నదనే అంశంపై టీ పీసీసీ వాకబ్ చేస్తున్నది. గత కొన్ని వారాలుగా వాట్సాప్, ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై వరుస కథనాలు, ఆడియోలు, వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. కేవలం రాజకీయం , ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన విమర్శలే కాకుండా, ప్రజాప్రతినిధుల వ్యక్తిగత జీవితాలు, అక్రమ సంబంధాలు, భూకబ్జాలు, కమిషన్ల వ్యవహారాలపై విచ్చలవిడిగా పోస్టులు దర్శనమిస్తున్నాయి.

ప్రజల్లో తప్పుడు సంకేతాలు..

ఈ ప్రచారాలు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని గ్రహించిన అధిష్టానం, అసలు ఈ ఆరోపణల్లో ఏమేరకు నిజం ఉన్నదో తేల్చాలని టీపీసీసీనిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆరోపణలు వస్తున్న మంత్రులను, ఎమ్మెల్యేలను క్లారిటీ ఇవ్వాల్సిందిగా టీపీసీసీ కోరినట్లు సమాచారం. అంతేగాక వస్తున్న ఆరోపణలపై ఎప్పటికప్పుడు ఖడించాల్సిన అవసరం ఉన్నదని, సైలెంట్ గా ఉంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నట్లు టీ పీసీసీ స్పష్టం చేసినట్లు సమాచారం. బీఆర్ఎస్ సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ ప్రతినిధులపై కావాలనే బురద జల్లే ప్రక్రియను పెట్టుకున్నదని, లీడర్లంతా అలర్ట్ గా ఉండాలని గాంధీభవన్ నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నేతలకు అలర్ట్స్ వెళ్లాయి.

Advertisement

Also Read: ఒకేసారి ఇద్దరిని ప్రేమించడం కరెక్టేనా? కొత్త డేటింగ్ ట్రెండ్.. ఎథికల్ నాన్ మోనోగమీ

పర్సనల్ నుంచి ఆఫీషియల్ వరకు.. సమగ్ర నివేదిక?

​పీసీసీ నాయకత్వం ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు, అంతర్గత విచారణ బృందాల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం.ప్రభుత్వ పనితీరు ,అవినీతి ఆరోపణలపై కూడా ఆరా తీస్తున్నది. కాంట్రాక్టులు, బదిలీలు, స్థానిక పనుల్లో కమిషన్ల వ్యవహారంపై ఎవరెవరిపై ఆరోపణలు వచ్చాయి? అనే అంశాలను కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియో లీకులు, వ్యక్తిగత ప్రవర్తన, అక్రమ సంబంధాల ఆరోపణల వెనుక ఉన్న నిజానిజాలు ఏమిటి? అనే అంశాలపై కూడా పార్టీ ఎంక్వైయిరీ చేస్తున్నది. మరోవైపు ఈ ప్రచారాలు నిజంగా నాయకుల స్వీయ తప్పిదాల వల్ల వస్తున్నాయా? లేక ప్రతిపక్షాలు కావాలని క్రియేట్ చేస్తున్న ఫేక్ ప్రచారాలా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న లీడర్లను పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను అందించాలని టీ పీసీసీ ఆదేశించినట్లు సమాచారం.

పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం..

Advertisement

​పీసీసీ ఈ స్థాయిలో ఫోకస్ పెట్టడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో గుబులు మొదలైంది. ఏ క్షణాన ఎవరి పేరు బయటకు వస్తుందో, అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతున్న పలువురు సీనియర్ నాయకులు, ఉమ్మడి జిల్లాలకు చెందిన కొందరి ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొన్నది.తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేపై వ్యక్తిగత జీవితం అంశం విషయంలో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నది. ఈ అంశంపై ఇప్పటికే పూర్తి స్​థాయి రిపోర్టు సేకరించినట్లు టీపీసీసీ ప్రతినిధుల్లో ఒకరు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలకు ఆయుధంగా మారకముందే ఈ వివాదాలకు చెక్ పెట్టాలని పీసీసీ భావిస్తోంది. తప్పు రుజువైతే హెచ్చరించడం లేదా చర్యలు తీసుకోవడం, ఒకవేళ ఇదంతా ప్రత్యర్థుల కుట్ర అయితే చట్టపరమైన చర్యలకు సిద్ధపడటం కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది.

Also Read: అమ్మకాల్లో దుమ్మురేపిన మారుతి గ్రాండ్ విటారా.. ఏకంగా 4 లక్షల యూనిట్లు సేల్!

Tags

Related News

తెలంగాణ బీజేపీకి నితిన్ నబీన్ వార్నింగ్.. అలా చేస్తే మీ పోస్టు ఉస్టే..!

ఇంటర్ విద్యలో మైండ్ బ్లాక్ అయ్యే స్కామ్.. కలర్ జిరాక్స్‌తో గెజిటెడ్ ఉద్యోగ పోస్టులు!

విజయ డెయిరీ వివాదంలో బిగ్ ట్విస్ట్.. చలసాని రాజీనామా వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!

వరల్డ్ ట్రైబల్ డే వేళ గిరిజనుల సంచలన డిమాండ్.. సీఎం చంద్రబాబు ఓకే చెప్తారా..?

ఈట‌ల కోసం రేష‌న్ కార్డుల ముద్రణ‌ ఆపేసిన కేసీఆర్‌.. ఆ క‌థా క‌మామీషు ఎట్టిద‌నినా..!

ఇద్ద‌రూ దోస్తులే.. మ‌రి బెడిసికొట్టిందెక్క‌డ‌..? ఇక ఆయ‌న‌ను న‌మ్మ‌డ‌మూ క‌ష్ట‌మేనా..?

నామినేటెడ్ పదవుల తుది జాబితా సిద్ధం.. సీఎం వద్దకు చేరిన సీక్రెట్ ఇంటెలిజెన్స్ రిపోర్టు!

Big Stories

Advertisement
×