Ukraine Drones: మాములుగా ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకపడుతోంది అనే న్యూస్‌నే మనం చూస్తుంటాం. ఇప్పుడు ఫర్ ఏ చేంజ్ అంటోంది ఉక్రెయిన్. ఇప్పుడు రష్యా జీవనాడి అయిన చమురు కేంద్రాలను టార్గెట్ చేసుకొని దాడులు చేస్తోంది. అయితే డ్రోన్‌లు లేదంటే లాంగ్ రేంజ్ మిసైల్స్‌తో విరుచుకపడుతోంది. ఇప్పుడు ఉక్రెయిన్ సరిహద్దులకు 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్యూమెన్‌లోని కీలక చమురు శుద్ధి కేంద్రంపై దాడి చేసింది ఉక్రెయిన్. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు జెలెనె స్కీ అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు.
రష్యాలోని అతిపెద్ద ప్రైవేట్ రిఫైనరీల్లో ట్యూమెన్ ఒకటి. ఇక్కడ రోజుకు లక్షన్నర బ్యారెళ్ల చమురును ఇక్కడ శుద్ధి చేస్తారు. ఇక్కడి నుంచి రష్యా మొత్తం చమురు సరఫరా చేస్తారు. ఉక్రెయిన్ నుంచి చొచ్చుకొచ్చే డ్రోన్‌ల సంఖ్య పెరిగిందని రష్యా ప్రకటించింది. ఒక్క రోజులోనే 239 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేశామంది. ముఖ్యంగా క్రిమియాను టార్గెట్ చేసుకొని ఉక్రెయిన్ దాడులను పెంచుతోంది. క్రిమియా అనేది రష్యా బ్లాక్ సీ ఫ్లీట్‌కి హెడ్‌క్వార్టర్స్‌గా ఉంది. ఇక్కడ ఉన్న సప్లై రూట్లను టార్గెట్ చేయడంతో చమురు కొరతను సృష్టించాలనే వ్యూహం కనిపిస్తోంది. అంతేకాదు ఇక్కడ ఉన్న పవర్ గ్రిడ్‌లను కూడా టార్గెట్ చేసుకొని దాడులు చేస్తోంది ఉక్రెయిన్.
Also read: Ammonia Leak: తమిళనాడులో ఘోరం.. రొయ్యల ఫ్యాక్టరీలో గ్యాస్ లీకై ఏడుగురు మృతి!
సరిగ్గా రెండు రోజుల క్రితం కూడా రష్యాలోని ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేసుకొని దాడులు చేసింది ఉక్రెయిన్. ఏకంగా రాజధాని మాస్కోలో ఉన్న రిఫైనరీలనే టార్గెట్ చేసింది ఉక్రెయిన్. ఈ దాడుల వల్ల మాస్కోలోని ఆకాశంలో పొగ కమ్మేసి, నల్లటి వర్షం కురిసింది. ప్రస్తుతం దాడులను చూస్తుంటే ఉక్రెయిన్ తమ డ్రోన్ శక్తిని పెంచుకున్నట్టు కనిపిస్తోంది. రష్యా భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడులు చేస్తోంది ఉక్రెయిన్. వేల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి ఉక్రెయిన్ డ్రోన్‌లు. తాము కొత్త జనరేషన్ డ్రోన్‌లను తయారు చేశామని ప్రకటించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. మాములుగా డ్రోన్‌ల పరిధి వందల కిలోమీటర్లలోనే ఉంటుంది. కానీ తాము 3 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించే సామర్థ్యం ఉన్న డ్రోన్లను డెవలప్ చేసినట్టు జెలెన్ స్కీ అనౌన్స్ చేశారు.
నిజానికి శత్రు దేశాల ఆయుధాలు, విద్యుత్ కేంద్రాలపై దాడులు చేయడం అనేది రష్యా స్టైల్. ఇప్పుడిదే వ్యూహాన్ని రష్యాపై ప్రయోగిస్తోంది ఉక్రెయిన్. మరీ రష్యా రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు కాస్త ఆందోళనగా ఉంది. గతంలో చేసిన దాడులకు ఇది ప్రతీకారమని ఉక్రెయిన్ చెబుతుండగా.. ఇప్పటి దాడులకు ప్రతీకారం తప్పదని రష్యా చెబుతోంది. ఇరు దేశాల పరిస్థితులు చూస్తుంటే.. ఈ దాడులు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
Storey By: Anup Big Tv
Also read: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘ఓజీ2’ చర్చలు షురూ చేసిన సుజిత్!