Priyadarshi New Movie: టాలీవుడ్‌లో వైవిధ్యమైన చిత్రాలకు, సక్సెస్‌ఫుల్ కాంబినేషన్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే రెండు అగ్ర నిర్మాణ సంస్థలు సరికొత్త ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకూమార్ గైడెన్స్‌లో నడిచే ‘సుకుమార్ రైటింగ్స్’, వరుస హిట్ చిత్రాల నిర్మాత బన్నీ వాసు నేతృత్వంలోని ‘బన్నీ వాసు వర్క్స్’ సంయుక్తంగా ఒక క్రేజీ ఎంటర్‌టైనింగ్ ఫ్యామిలీ డ్రామాను అధికారికంగా ప్రకటించాయి. వరుస విజయాలతో టాలీవుడ్‌లో ప్రామిసింగ్ హీరోగా ఎదిగిన వర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ‘మేవరిక్ డైరెక్టర్’ సుకుమార్ ఆశీస్సులతో, ఆర్య సుకుమార్, తబితా సుకుమార్, బన్నీ వాసుల పర్యవేక్షణలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పక్కా ప్లానింగ్‌తో పట్టాలెక్కుతోంది. ఈ సినిమాతో యువ దర్శకుడు వంశీ రెడ్డి దొండపాటి తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Read also-అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్.. కనిపించే దేవుడు అంటూ..
ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ తెలంగాణ ఫోక్ సింగర్ ‘నాగదుర్గ’ ఈ చిత్రం ద్వారా కథానాయికగా టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ప్రియదర్శి పక్కింటి అబ్బాయి ఇమేజ్‌కు, నాగదుర్గ క్రేజ్ తోడవడంతో ఈ ప్రాజెక్ట్‌పై అనౌన్స్‌మెంట్ రోజే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం పక్కా తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. చిత్ర బృందం తాజాగా దర్శకుడు సుకుమార్‌ను కలిసి ప్రత్యేకంగా బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంది.
Read also-పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘ఓజీ2’ చర్చలు షురూ చేసిన సుజిత్!
ఇక ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. ‘విరాటపర్వం’ చిత్రంతో తన మార్క్ మ్యూజిక్‌ను అందించిన సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు హృదయానికి హత్తుకునే స్వరాలు, అద్భుతమైన ఫోక్ ట్యూన్స్ అందించనున్నారు. అలాగే ‘హుషారు’, ‘సినిమా బండి’ చిత్రాలతో విజువల్స్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బాల్ రెడ్డి పి ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసుల కలయికలో వచ్చిన ‘100% లవ్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధించిన నేపథ్యంలో, ఈ కొత్త సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి బిజినెస్ క్రేజ్ కనిపిస్తోంది. ఈ నెల 25వ తేదీన పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కానున్న ఈ చిత్రం, వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.
Begins with the Blessings & Best wishes of Maverick ❤️🔥
Team @SukumarWritings & @BunnyVasWorks' next entertaining family drama meets producer @aryasukku garu ❤️🔥🤩@TheBunnyVas @Preyadarshe @Thabithasukumar #VamsiReddyDondapati #NagaDurga @sureshbobbili9 #BalReddyP pic.twitter.com/R0UOkB7mP1
— Sukumar Writings (@SukumarWritings) June 21, 2026