E-Paper
Advertisement

Vijay Udhayanidhi: సీఎం విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు సభలో సినిమా రేంజ్ డ్రామా..!

Vijay Udhayanidhi: సీఎం విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు సభలో సినిమా రేంజ్ డ్రామా..!
Advertisement

Vijay Udhayanidhi: వాళ్లిద్దరూ హీరోలే. అయితే ఇప్పుడు వీరి విన్యాసాలను తెర బయట కూడా చూడొచ్చు. అది కూడా సాక్షాత్ అసెంబ్లీలో స్పీకర్ ముందరే ఈ ఇద్దరు హీరోలలో ఒకరు సీఎం, మరొకరు ప్రతిపక్ష నేతగా- రియల్ కేరెక్టర్స్ ప్లే చేయడం మాత్రమే కాదు. ఇంకా ఎన్నో చిత్రాలు నమోదు చేశారు. ఒకరు పిట్ట కథలు చెబితే, మరొకరు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కథనాలు అసెంబ్లీలో అందరి ముందు బయట పెట్టారు. ఇందుకు రివేంజ్ గా మరొకరు సభలో లేని వారిని అనుకరించారు. దీంతో అది అసెంబ్లీనా? లేక షూటింగ్ స్పాటా? అర్ధం కాలేదు. ఆ తమిళ సినీ పొలిటికల్ మషాళా మెలో డ్రామా ఏంటో ఇప్పుడు చూద్దాం.

విజయ్ స్టాలిన్ గురించి సిగ్నల్..

చూశారుగా విజయ్ సినిమా స్టైల్లో సభలో ఎలా నవ్వులు పూయించారో. ఈ మొత్తం సీనేరియోకి ముందు అసలేం జరిగిందో చూస్తే మనం ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ వర్సెస్ సీఎం స్టాలిన్ మధ్య జరిగిన డైలాగ్ పార్ట్ పరిశీలించాలి. దశాబ్దాల డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకే పవర్ గేమ్ నుంచి బయట పడ్డ తమిళనాడు అసెంబ్లీలో తొలిసారిగా ద్రవిడేతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రి అధికార పీఠం అధిరోహించిన విషయం తెలిసిందే. ఇక మాజీ సీఎం స్టాలిన్ MLAగానూ ఓడిపోగా, ఆయన తనయుడు ఉదయనిథి స్టాలిన్ తండ్రి స్థానంలో ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తున్నారు.

డీఎంకే ప్రభుత్వం పై విమర్షలు..

Advertisement

అయితే అసెంబ్లీలో సీఎం విజయ్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం తెలిపారు. అందులో భాగంగా డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీ నిధుల వసూళ్ల పేరిట డీఎంకే ప్రజాధనం దోచుకుందని ఆరోపించారు సీఎం విజయ్. తమ ప్రభుత్వం ఆ నిధులన్నిటినీ తిరిగి రాబడుతుందని హెచ్చరించారు విజయ్. కేవలం ఒక కుటుంబానికే ప్రాధాన్యమివ్వకుండా, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ సేవ చేయడమే తమ ప్రభుత్వ పాలసీగా చెప్పారాయన.

Also read: Harish Rao: రేవంత్ రెడ్డి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అంటూ.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు!

స్టాలిన్ గతంలో..

Advertisement

సీఎం విజయ్ ప్రసంగించే టైంలో.. స్పీకర్ అనుమతితో మాజీ సీఎం స్టాలిన్ గతంలో కాంగ్రెస్ పొత్తు సమయంలో చేసిన ఒక మేనరిజంని అనుసరించి చూపారు. ఇది సభలో దుమారానికి దారి తీసింది. ఇందుకు రియాక్టయిన ఉదయనిధి అసెంబ్లీ కెమెరాను సినిమా కెమెరా అనుకుని సీఎం విజయ్ తాను ముందే రాసుకున్న స్క్రిప్ట్ తో సింగిల్ టేక్ పెర్ఫామెన్స్ చేస్తున్నారనీ.. ఎద్దేవా చేశారు. ఇక రైతుల నిరసనలపై విజయ్ చెప్పిన పిట్టకథలకు నిరసనగా కౌంటర్ అటాక్ చేశారు ఉదయనిధి. చెంగల్పట్టు కోర్టులో భర్త కోసం వెతుకుతున్న భార్య కథ మాత్రమే తమిళ ప్రజలకు తెలుసనీ.. వ్యక్తిగత విమర్శలకు దిగారు. ఉదయనిధి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

యాక్షన్ సన్నివేశాలు..

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలోనే అసెంబ్లీలో ఇలాంటి సిట్యువేషన్ కనిపిస్తుంటే, ఇక పోను పోను ఇంకెన్ని ఫ్యామిలీ, యాక్షన్ సన్నివేశాలు చూడాల్సి వస్తుందో అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రెజంట్ సీఎం విజయ్ స్టాలిన్ని అనుసరిస్తూ చేసిన యాక్షన్ వీడియో వైరల్ గా మారింది.

Also read: Lucknow Fire: లక్నో అగ్నిప్రమాదంలో ఘోరం.. కరెంట్ పోగానే బిల్డింగ్‌లో జరిగింది ఇదే..!

Related News

DSC ఉద్యోగాల అమ్మకాలపై వైసీపీ సంచలన ఆధారాలు.. షాక్‌లో కూటమి సర్కార్!

పసికందుల విక్రయ దందా పై హైకోర్టు ఫైర్.. ఆ శాఖకు నోటీసులు జారీ?

దేశ రాజధానిలో ఘోరాతి ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిని కూడా వదలని కిరాతకులు?

తెల్గు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం ఫామ్‌హౌజ్‌…! ఆ పదం రాసినందుకు ఇలేకరికి ఇచ్చిపడేసిన పెద్దసారు..!

క్రికెట్ చరిత్రలోనే హెచ్‌సీఏ చెత్త రికార్డు.. సోషల్ మీడియాలో పిచ్చ ట్రోల్స్!

పవర్‌ స్టేషన్స్‌ పరిశీలనకు 6 బృందాలు! థర్మల్‌ పవర్‌ స్టేషన్లలో ఏం జరుగుతోంది..? పరిశీలనకు రేపు ఆరు చోట్ల పర్యటనలు…

తెలంగాణలో మేఘాలయ మోడల్ వ్యవసాయ విధానం.. మోదట వేసే పంట ఇదే?

ఆస్తులు పెంచుకోలే.. ప్రజల మనసుల్లో అంతస్తులు కట్టుకున్నారు! ఆ ముగ్గురి కామ్రేడ్‌ల నిస్వార్థ ప్రజాసేవ ప్రస్థానం..!

Big Stories

Advertisement
×