E-Paper
Advertisement

విశాఖ నావికాదళంపై పాక్ కన్ను.. 13 మంది నేవీ సిబ్బందిపై అనుమానాలు!

విశాఖ నావికాదళంపై పాక్ కన్ను.. 13 మంది నేవీ సిబ్బందిపై అనుమానాలు!
Advertisement

Navy Spy Network: విశాఖ అంటే కేవలం ఓ నేవీ బేస్‌ కాదు. దేశ సముద్ర రక్షణలో చాలా మెయిన్ ప్లేస్‌. ఈస్టర్న్‌ నావల్‌ కమాండ్‌.. యుద్ధనౌకలు జలాంతర్గాములు.. ఇక్కడ ప్రతి కదలికా టాప్ సీక్రెట్. ఇక్కడి నుంచి చిన్న ఇన్ఫర్మేషన్‌ బయటికి వెళ్లినా దాని ఎఫెక్ట్‌ చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే శత్రు నిఘా నెట్‌వర్క్‌ల కళ్ళన్నీ ఈ తీరం మీదే ఉంటాయి.

మళ్లీ అదే డ్రామా..

2019 ఆపరేషన్ డాల్ఫిన్స్ నోస్ గుర్తుందా? ఫేక్‌ ప్రొఫైల్స్‌తో నేవీ సిబ్బందికి గాలం వేశారు. పరిచయం పెంచుకొని రహస్య సమాచారం కోసం ప్రయత్నించారు. ఆ కేసులో 15 మంది అరెస్టైతే 11 మంది నేవీ సిబ్బంది ఉన్నట్టు NIA చెప్పింది. అక్కడితో కథ ఆగిందా? అంటే లేదు. ఇప్పుడు మళ్లీ అదే డ్రామా మొదలుపెట్టారు. యాప్ మారొచ్చు. మాస్క్ మారొచ్చు. కానీ గురి మాత్రం ఒక్కటే దేశ రక్షణ రహస్యం.

మూవ్‌మెంట్‌ ఏంటి..?

Advertisement

నేవీ సిబ్బందిపై మళ్లీ పాక్ వలపుల వల విసిరింది. సోషల్‌మీడియాలో ముద్దు ముద్దు మాటలతో ముగ్గులోకి దింపారు. వాయిస్ కాల్స్ వీడియో కాల్స్‌తో నమ్మకం పెంచుకున్నారు. నౌకలు ఎక్కడున్నాయి..? జలాంతర్గాముల మూవ్‌మెంట్‌ ఏంటి..? ఎలాంటి ఫొటోలు ఉన్నాయి..? ఇలాంటి కీలక డీటెయిల్స్‌ రాబట్టేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

Also read: ఉద్యోగులకు BMW కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన లేడీ బాస్, అలా చూసి.. చలించిపోయి..

సాయి వరప్రసాద్‌ అరెస్ట్‌..

Advertisement

ఆపరేషన్‌ ఫైర్‌వాల్‌ పేరుతో బయటపడిన నెట్‌వర్క్‌లో 18 మంది అనుమానితులు ఉన్నట్టు ఏపీ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ చెబుతోంది. వారిలో 13 మంది నేవీ సిబ్బంది ఉన్నట్టు సమాచారం. ప్రదీప్‌ ముఖర్జీ అన్నం సాయి వరప్రసాద్‌ అరెస్ట్‌ అయ్యారు. ఇక అసలు ట్విస్ట్‌ ఏంటంటే.. ఈ నెట్‌వర్క్‌కు పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెంట్ల నుంచి డబ్బులు వచ్చాయట. క్రిప్టో కరెన్సీ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌ జరిగినట్టు అనుమానిస్తున్నారు.

డబ్బులకు కక్కుర్తిపడి..

సోషల్‌మీడియాలో కనెక్షన్లు పెట్టుకొని ప్రేమ పేరుతో వల విసిరారు. చివరికి డబ్బుల కోసం దేశ రహస్యాల వేట మొదలుపెట్టారు. ఇది చిన్న గేమ్‌ కాదు. డేంజరస్‌ గేమ్‌. డబ్బులకు కక్కుర్తిపడి దేశ రహస్యాలను తాకట్టు పెట్టిన కేటుగాళ్ల మొబైళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆ మొబైల్స్‌లో దాగున్న ఒక్కో చాట్‌.. ఒక్కో కాల్‌.. ఒక్కో ఫైల్‌ బయటకొస్తే.. ఈ పాక్‌ నెట్‌వర్క్‌లో ఇంకా ఎంతమంది ఉన్నారో అసలు బొమ్మ బయటపడడం ఖాయం.

Also read: సర్ వివాదంపై ఆ రెండు పార్టీలు సైలెంట్.. బీజేపీతో లాలూచీ నిజమేనా..?

Tags

Related News

జంతర్ మంతర్ వద్ద ప్రకాష్ రాజ్ నిరసన.. కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు!

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఈ అంశాలపై ప్రత్యేక చర్చ!

ఉత్తరాంధ్రపై బొత్స మాస్టర్ ప్లాన్.. 2029 టార్గెట్‌గా రంగంలోకి రెండో తరం

సర్ వివాదంపై ఆ రెండు పార్టీలు సైలెంట్.. బీజేపీతో లాలూచీ నిజమేనా..?

స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కోలుకోలేని దెబ్బ.. 1100 పాయింట్లు పతనం!

రీల్స్ కోసం రోడ్డుపై బైక్‌తో స్టంట్స్.. కుర్రాళ్లకు దిమ్మతిరిగిపోయే షాకిచ్చిన పోలీసులు!

AI డీప్‌ఫేక్‌లపై కేంద్రం సంచలన నిర్ణయం.. నెల రోజుల్లో రానున్న కొత్త రూల్స్?

Big Stories

Advertisement
×