E-Paper
Advertisement

క్రిమినల్స్ వేటలో శవమై తేలే ఏజెంట్… అనుకున్నంత సింపుల్ కాదు ఈ కేసు… ఇంటెన్స్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్

క్రిమినల్స్ వేటలో శవమై తేలే ఏజెంట్… అనుకున్నంత సింపుల్ కాదు ఈ కేసు… ఇంటెన్స్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Spy Action Thriller OTT : ఓ కార్టెల్ ఫిక్సర్ న్యూయార్క్‌ లోకి ఎంట్రీ ఇస్తాడు. అతడిని వెంబడించిన ఏజెంట్లకు ఓ డీఈఏ అధికారి శవం కనిపిస్తుంది. మొదట సాధారణ క్రైమ్ కేసులా కనిపించిన ఈ వ్యవహారం వెనుక పెద్ద కుట్ర ఉందని తెలిసిన తర్వాత సీఐఏ, ఎఫ్‌బీఐ ఏజెంట్లు కలిసి రంగంలోకి దిగుతారు. నేరస్థుల వేటతో పాటు టీమ్‌లోనే ఎవరో మోసం చేస్తున్నారనే అనుమానంతో పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది. ఇంటర్నేషనల్ క్రైమ్, అండర్‌కవర్ ఆపరేషన్స్, స్పై యాక్షన్‌తో వచ్చిన ‘CIA Season 2’ ఇప్పుడు స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సిరీస్‌ ఏ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

కొలిన్ గ్లాస్ ఓ సీఐఏ కేస్ ఆఫీసర్. అతడి పని సాధారణంగా ఫైళ్ల మధ్య కూర్చుని కేసులు పరిష్కరించడం కాదు. అంతర్జాతీయ నేరాలు, టెర్రరిస్ట్ నెట్‌వర్క్స్, రహస్య ఆపరేషన్స్ వంటి ప్రమాదకరమైన వ్యవహారాల్లో నేరుగా పాల్గొంటుంటాడు. మరోవైపు బిల్ గుడ్‌మ్యాన్ ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్. ఇద్దరి పని తీరు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కొలిన్ రూల్స్‌ను కాస్త పక్కనపెట్టి పరిస్థితికి తగ్గట్టు ముందుకు వెళ్లే వ్యక్తి అయితే, బిల్ మాత్రం ప్రొసీజర్‌ను ఫాలో అవుతూ పని చేయడానికి ఇష్టపడతాడు.

Advertisement

అయితే సీజన్ 2లో ఈ ఇద్దరూ మరోసారి కలిసి పనిచేయాల్సి వస్తుంది. న్యూయార్క్‌లోకి ఓ కార్టెల్ ఫిక్సర్ రావడంతో అతడిని ట్రాక్ చేయడం మొదలుపెడతారు. అతడి కదలికలను గమనిస్తూ వెళ్లిన టీమ్‌కు ఓ డీఈఏ ఏజెంట్ మృతదేహం కనిపిస్తుంది. మొదట ఆ హత్యకు కార్టెల్‌తో సంబంధం ఉందని అనుకుంటారు. కానీ దర్యాప్తు లోతుగా వెళ్లే కొద్దీ అసలు విషయం వేరే ఉందని తెలుస్తుంది. ఒక హత్య వెనుక మరో హత్య, దాని వెనుక మరో రహస్యం బయటపడే పరిస్థితి ఏర్పడుతుంది. కేసును త్వరగా పరిష్కరించకపోతే మరిన్ని ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఏజెంట్లకు అర్థమవుతుంది. దీంతో కొలిన్, బిల్ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేయాల్సి వస్తుంది.

ఇదిలా ఉంటే తమ టీమ్‌లోనే ఎవరో సమాచారాన్ని బయటకు పంపుతున్నారనే అనుమానం మొదలవుతుంది. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితిలో కొలిన్, బిల్ సేకరించే ప్రతి ఆధారాన్ని జాగ్రత్తగా పరిశీలించాల్సి వస్తుంది. ఒక చిన్న పొరపాటు జరిగినా నిందితుడు తప్పించుకోవడంతో పాటు మరో హత్య జరిగే అవకాశం ఉంటుంది. సీజన్ 2లో వ్యక్తిగత గొడవల కంటే కేసుల వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌ను బయటకు తీసుకురావడంపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది.

Advertisement

న్యూయార్క్‌లో మొదలైన కేసు క్రమంగా అంతర్జాతీయ కుట్రల వైపు వెళ్లే కొద్దీ కథ పరిధి కూడా పెరుగుతుంది. కొలిన్, బిల్ కలిసి పనిచేస్తే వాళ్ల మధ్య ఉన్న విభిన్నమైన పని విధానం ఎలా ఉపయోగపడుతుందో కూడా సిరీస్‌లో చూపిస్తారు. కార్టెల్ ఫిక్సర్ వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్ ఏంటి ? డీఈఏ ఏజెంట్ హత్యకు కారణం ఎవరు ? మరిన్ని హత్యలను ఆపేందుకు కొలిన్, బిల్ ఎలాంటి ఆపరేషన్ చేపట్టారు ? అన్నది తెలుసుకోవాలంటే ఈ సిరీస్ ను డోంట్ మిస్.

Also Read : మళ్లీ మొదలైన రచ్చ… నలుగురు ఫ్రెండ్స్ లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్ ట్విస్టులతో సీజన్ 2 స్ట్రీమింగ్ షురూ

తెలుగులో ఉందా ?

ఈ సిరీస్ లో టామ్ ఎల్లిస్ కొలిన్ గ్లాస్‌గా, నిక్ గెల్ఫస్ బిల్ గుడ్‌మ్యాన్‌గా నటించారు. నెకార్ జడెగాన్, నటాలీ లినెజ్ తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారు. దీన్ని ‘FBI’ ఫ్రాంచైజీ టీం డిక్ వోల్ఫ్ రూపొందించింది. రెండో సీజన్ స్ట్రీమింగ్ 2026 అక్టోబర్ 5న ప్రారంభమైంది. ప్రస్తుతం Amazon Prime Videoలో సీజన్ 2 ఉంది. అలాగే Paramount+ ద్వారా కూడా స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం సిరీస్ ఇంగ్షీషు ఆడియోలో మాత్రమే ఉంది.

Related News

మళ్లీ మొదలైన రచ్చ… నలుగురు ఫ్రెండ్స్ లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్ ట్విస్టులతో సీజన్ 2 స్ట్రీమింగ్ షురూ

ప్రేమ పేరుతో మెంటలెక్కించే పనులు… ఎక్స్ రీఎంట్రీతో బుర్రపాడు ట్విస్ట్… ఈ లవ్ ట్రయాంగిల్ చూస్తే బుర్రపాడు

నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టించే స్పెషల్ టీమ్… కంటెంట్ నెక్స్ట్ లెవెల్ భయ్యా… డెడ్లీ క్రైమ్స్ తో సీజన్ 9 స్ట్రీమింగ్ షురూ

పాపులర్ SNL షో వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ కథ… ఇండస్ట్రీ సీక్రెట్స్ బయటపెట్టిన నెట్‌ఫ్లిక్స్ కొత్త డాక్యుమెంటరీ

కులం పిచ్చితో ప్రేమికుల ప్రాణాలు తీసే రాక్షసత్వం… హార్డ్ హిట్టింగ్ మూవీ

తీరప్రాంతాన్ని వణికించే మిస్టరీ క్రియేచర్… ఊరిని కాపాడుకోవడానికి మత్స్యకారుడి పోరాటం… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్

యూనికార్న్ ఐలాండ్‌లో ఊహించని విపత్తులు… ఆ వింత రహస్యం ఏంటి ? నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త మ్యాజికల్ అడ్వెంచర్

Big Stories

Advertisement
×