BigTV English

Telangana Politics: మళ్లీ ఆ ఇద్దరి మంత్రుల మధ్య ఏం జరిగింది? స్థానిక ఎన్నికల్లో కష్టమేనా?

Telangana Politics: మళ్లీ ఆ ఇద్దరి మంత్రుల మధ్య ఏం జరిగింది? స్థానిక ఎన్నికల్లో కష్టమేనా?

Telangana Politics: ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిల మధ్య ముందు నుంచి కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు నడుస్తూ వచ్చింది. అయితే రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లకు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీన్ మారినట్లు కనిపించింది. ఏకంగా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డ ఆ ఇద్దరు నేతలు.. తర్వాత మంత్రులుగా కలిసి నడవడంతో క్యాడర్లో మునుపెన్నడూ లేని ఉత్సాహం కనిపించింది. అయితే ఇటీవల మళ్లీ పాత సీన్లు రిపీట్ అవుతున్నాయా? మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల తిరిగి గ్యాప్ పెరిగినట్లు కనిపించడానికి కారణమేంటి? అసలు వారి మధ్య ఏం జరిగిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


రాష్ట్ర రాజకీయాల్లో తమదైన మార్క్ చూపించే ఉత్తమ్, కోమటిరెడ్డి

ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు, అత్యంత కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు రాష్ట్ర రాజకీయాల్లో తమ మార్క్ చూపిస్తుంటారు. ఇద్దరు కూడా తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్లకు కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు . ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి వారిద్దరి మధ్య జిల్లాలో ఆధిపత్య పోరు కొనసాగేది. అయితే ఉప్పు -నిప్పులా వ్యవహరించ ఉత్తమ్ , కోమటిరెడ్డిలు మారిన పరిస్థితుల్లో ఒకటయ్యారు. ఇరిగేషన్ & సివిల్ సప్లై మంత్రి గా ఉత్తమ్ ,R&B మంత్రి గా కోమటిరెడ్డి ఇద్దరు కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లాను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు.


పరస్పరం టైగర్ అని ప్రశంసించుకున్న మంత్రులు

జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా, కలిసి రివ్యూలు నిర్వహిస్తూ.. ఎప్పుడూ లేనంత సఖ్యతగా ఉంటూ ముందుకు వెళ్తున్నారు. జిల్లా మీటింగ్‌లలో ఉత్తమ్ ఎప్పుడు సంబోధించినా కోమటిరెడ్డిని టైగర్ కోమటిరెడ్డి వెంకటటడ్డి అని సంభోదిస్తున్నారు. అందుకు కోమటిరెడ్డి తాను కాదు టైగర్ శాఖాపరంగా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ సక్సెస్ అవుతున్న కోమటిరేడ్డే నిజమైన టైగర్ అని ప్రశసిస్తుండటం జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహం నింపుతోంది. ఆ ఇద్దరు దిగ్గజాలు అంతలా కలిసి, మెలిసి ఉండటం తో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ మరింత పెంచుతోంది.

కీలక కార్యక్రమాలకు హాజరు కాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి

అయితే తాజాగా నాగార్జున సాగర్ గేట్లు తెరవడంతో పాటు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలో రేషన్ కార్డుల పంపిణీకి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాకపోవడం చర్చనీయంశంగా మారింది. ఆ ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు సంబంధించి రెండు రోజుల క్రితమే ఇద్దరు మాట్లాడుకొని టూర్ షెడ్యూల్ ని ఖరారు చేసుకున్నారంట. ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి బయలు దేరి సాగర్ డ్యామ్ గేట్లు తెరిచి పెద్దవూర , హుజూర్ నగర్ ,నకిరేకల్ ,భువనగిరి ,ఆలేరు నియోజకవర్గాలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హాజరు అవ్వాలని ప్రోగ్రాం ఫిక్స్ చేసుకున్నారంట.

ఎయిర్ పోర్టుకు గంట ఆలస్యంగా వచ్చిన ఉత్తమ్

అందుకనుగుణంగానే మంత్రి కోమటిరెడ్డి టైం ప్రకారం బేగంపేట చేరుకున్నారు. కానీ ఉత్తమ్ ఫివర్ తో బాధపడుతూ గంట ఆలస్యంగా ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఉత్తమ్ ఆలస్యంగా రావడంపై మంత్రి కోమటిరెడ్డి కొంత అసహనానికి గురయ్యారట. ఇంత ఆలస్యమేంటి? 9 గంటలకు షెడ్యూల్ ఇచ్చారు. నేను సీనియర్ మంత్రిని, ఇదేం పద్ధతంటూ పార్టీ నేత, జిల్లా ఇన్చార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముందు తన అసంతృప్తిని వ్యక్తం చేశారంట. గంటపాటు ఎయిర్‌పోర్లులో వేచిచూసిన తర్వాత..పర్యటనకు రావడంలేదని చెప్పి ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోయారట కోమటిరెడ్డి. దీంతో ఉత్తమ్ మరియు లక్ష్మణ్ మాత్రమే నాగార్జునసాగర్‌కు వెళ్లి గేట్లు ఎత్తే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లాకు చెందిన ఈ ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలను మరోసారి బయటపెట్టినట్లైందంటున్నారు.

కోమటిరెడ్డి గైర్హాజరుతో క్యాడర్‌లో గందరగోళం

కోమటరెడ్డి అసహనం వ్యక్తం చేసిన విషయం తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ ఇంటి నుంచి ఎయిర్ పోర్ట్ కి వచ్చేప్పుడు ఫోన్ చేసినా కోమటిరెడ్డి రెస్పాండ్ అవ్వలేదంట. ఇక చేసేదేమి లేక ఇంచార్జ్ మంత్రి లక్షణ్, ఉత్తమ్ కలిసే జిల్లాలో పర్యటించి ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాగర్ ఎడమ కాలువ నీటి విడుదలకు కానీ, సాగర్, నకిరేకల్, భువనగిరి, ఆలేరులో రేషన్ కార్డుల పంపిణీల్లో మంత్రి కోమటిరెడ్డి ఎంతో కీలకం అయినప్పటికీ అలిగి రాకపోవడం చాల మైనస్ గా మారిందంటున్నారు. ఎందుకు ఇలా జరిగిందని పార్టీలో, జిల్లా క్యాడర్‌లో పెద్ద డిబేటే జరుగుతోంది. ఇరిగేషన్ & సివిల్ సప్లై శాఖల కు సంబంధించి నిన్న జరిగిన కార్యక్రమాలు ఉత్తమ్ శాఖకు సంబంధించినవి కావడంతో ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి కార్యక్రమాలను ఉత్తమ్ నడిపించేశారు. అయితే జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంపై కేడర్‌లో గందరగోళం రేపుతోందంట.

Also Read:  వరుస అరెస్టులు.. ఏపీ లిక్కర్ స్కాంలో వెలుగులోకి వస్తున్న సంచలన నిజాలు..

స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అంతా సెట్ అవుతుందా?

ఇప్పటి వరకు కలిసి కట్టుగా ఉండి, నువ్వు టైగర్ నువ్వే టైగర్‌ అంటూ భుజాల మీద చేతులేసుకుని తిరిగిన మంత్రులు ఉత్తమ్ , కోమటిరెడ్డిల మధ్య ఈ ఎపిపోడ్‌తో మళ్లీ గ్యాప్ పెరిగి.. పాత పరిస్థితులు వచ్చి గ్రూప్‌లుగా విడిపోతారా? లేక తాజాగా ఏర్పడిని కమ్యూనికేషన్ గ్యాప్‌ను పూడ్చుకుని ఒకటవుతారా అన్నది చూడాలి. ఏదేమైనా స్థానిక సంస్థలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామం పార్టీకి మైనస్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఇద్దరు మంత్రులపై ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Story By Vamshi Krishna, Bigtv

Related News

AP BJP: ఏపీలో బీజేపీకి అన్యాయం జరుగుతుందా?

AP Liquor Scam Case: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

BIG Shock To Donald Trump: ట్రంప్‌కు మోదీ దెబ్బ.. అమెరికా పని ఖతమేనా

T Congress: కాంగ్రెస్‌లో టెన్షన్..? కార్యవర్గ పోస్టుల భర్తీ ఎప్పుడు..

YCP Vs TDP: పులివెందులలో కాక రేపుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికలు

AP News: జగన్ -పెద్దిరెడ్డి అవినావ బంధం

Big Stories

×