BigTV English

BB Telugu 8: వరంగల్ కా షేర్.. నబీల్ 15 వారాలు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

BB Telugu 8: వరంగల్ కా షేర్.. నబీల్ 15 వారాలు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

BB Telugu 8: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss).. తెలుగులో ఎనిమిదవ సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. ఈరోజు (డిసెంబర్ 15) చాలా ఘనంగా గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నారు. అంతే కాదు ఈ ఫినాలేకి పలువురు స్టార్ సెలబ్రిటీలు కూడా వచ్చి సందడి చేయనున్నారు. ఇక మాజీ హౌస్ మేట్స్ కూడా హౌస్ లోకి వచ్చి తమ పర్ఫామెన్స్ తో ఆకట్టుకోబోతున్నారు. ఇకపోతే 22 మందితో కొనసాగిన ఈ షో కి అందరూ ఎలిమినేట్ అయ్యి, కేవలం 5 మంది మాత్రమే ఫినాలేకి చేరుకున్నారు. అందులో నిఖిల్, గౌతమ్, టైటిల్ ఫేవరెట్ గా దూసుకుపోతూ ఉండగా.. టాప్ -3 లో ప్రేరణ, టాప్ -4 లో నబీల్, టాప్ -5లో అవినాష్ నిలిచారు.


ఇక గ్రాండ్ ఫినాలే లో భాగంగా అవినాష్, నబీల్, ప్రేరణ ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలిన నిఖిల్, గౌతమ్ లలో ఎవరు టైటిల్ విన్నర్ గా నిలవబోతున్నారు అంటే చెప్పలేని పరిస్థితి. 50-50 ఛాన్సెస్ ఇద్దరూ కూడా ఎవరికి వారు టైటిల్ విన్నర్ అవుతామనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. వాస్తవానికి నిఖిల్ పేరు ఎక్కువగా వినిపిస్తున్నా.. అటు గౌతమ్ పేరు కూడా గట్టిగానే వినపడుతోంది. మరి ఇద్దరిలో ఎవరికి టైటిల్ ఇవ్వబోతున్నారు అనే విషయం మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. ఇకపోతే టాప్ ఫైవ్ లో నిలిచిన నబీల్ ఈరోజు ఎపిసోడ్ లో ఎలిమినేట్ కానున్నారు. ఈరోజుకు సంబంధించిన ఎపిసోడ్ కాస్త నిన్నే పూర్తయింది.

అందులో భాగంగానే నబీల్ ఎలిమినేట్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన నబీల్, తన ఆట తీరుతో వరంగల్ కా షేర్ అని అనిపించుకున్నారు. కచ్చితత్వమైన మాట తీరుతో పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్న నబీల్, దాదాపు 15 వారాలపాటు హౌస్ లో కొనసాగారు. అయితే చివరి వరకు ఉంటారనుకోగా.. ఫైనల్ వరకు నిలిచాడు. కానీ టైటిల్ విజేత అవ్వలేకపోయారు. అలా టాప్ ఫోర్ లో నిలిచిన ఈయన ఎలిమినేట్ అవ్వడంతో ఈ 15 వారాలకు గానూ ఎంత రెమ్యూనరేషన్ లభించింది అంటూ ఆరా తీస్తున్నారు నెటిజెన్స్.


ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 లోకి 14వ కంటెస్టెంట్ గా యూట్యూబర్ గా అడుగుపెట్టిన నబీల్ వారానికి రూ.2 లక్షల చొప్పున ఒప్పందంతో హౌస్ లోకి అడుగుపెట్టారు. తన పెర్ఫార్మెన్స్ తో, తన యూట్యూబ్ ఖాతాలోకి ఆరు లక్షల మంది సబ్స్క్రైబర్లు కూడా వచ్చి చేరారు. బిగ్ బాస్ పరంగా అటు యూట్యూబ్ పరంగా భారీగా పేరు దక్కించుకున్నారు నబీల్. ఇకపోతే 15 వారాలు హౌస్ లో కొనసాగినందుకు గానూ ఏకంగా రూ.30 లక్షలు ఆయనకు రెమ్యునరేషన్ గా ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా యూట్యూబర్ గా వచ్చిన ఈయన ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ అంటే నిజంగా గ్రేట్ అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×