BigTV English

Iran Hijab Singer: హిజాబ్ లేకుండా మ్యూజిక్ షో చేసిన ఇరాన్ సింగర్.. యూట్యూబ్ చూసి అరెస్ట్ చేసిన పోలీసులు

Iran Hijab Singer: హిజాబ్ లేకుండా మ్యూజిక్ షో చేసిన ఇరాన్ సింగర్.. యూట్యూబ్ చూసి అరెస్ట్ చేసిన పోలీసులు

Iran Hijab Singer| ఇరాన్ దేశంలో బహిరంగ ప్రదేశాల్లో మహిళల వేషాధారణపై కఠిన నియమాలున్నాయి. అయితే ఒక మ్యూజిక్ షో లో ఇరాన్ దేశానికి చెందిన ఒక గాయని హిజాబ్ లేకుండానే పాల్గొంది. పైగా వెస్ట్రన్ డ్రెస్ స్టైల్లో స్లీవ్ లేకుండా జుట్టు విరబూసుకొని స్టేజీపై నలుగురు పురుషులతో కలిసి పాట పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.


వివరాల్లోకి వెళితే.. ఇరాన్ దేశానికి చెందిన పరస్తూ అహ్మదీ (27) ఒక ప్రముఖ గాయకురాలు. అయితే ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న మజంద్రాన్ రాష్ట్రం నుంచి శనివారం డిసెంబర్ 14, 2024న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆమె లాయర్ మిలాద్ పనాహపూర్ తెలిపిన వివరాల ప్రకారం.. గత గురువారం సింగర్ పరస్తూ అహ్మదీకి చెందిన ఒక వీడియో యూట్యూబ్ లో కనిపించింది. ఆ వీడియోలో పరస్తూ అహ్మదీ ఒక స్లీవ్‌లెస్ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి స్టేజీపై పాడపడుతూ కనిపిస్తోంది. అది ఒక మ్యూజిక్ షో.. సింగర్ పరస్తూ అహ్మదీతో పాటు నలుగురు పురుషులు (కళాకారులు) కూడా స్టేజీపై ఉన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని ఉన్న చట్టాన్ని గాయని పరస్తూ అహ్మదీ ఉల్లంఘించినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకోసం పరస్తూ అహ్మదీకి వ్యతిరేకంగా గురువారం రోజునే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

Also Read:  ప్రభుత్వ ఉద్యోగి కిడ్నాప్.. గన్‌తో బెదిరించి యువతితో వివాహం


తన మ్యూజిక్ షోని సింగర్ పరస్తూ అహ్మదీ ప్రమోట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. “నేను పరస్తూ.. నన్ను ప్రేమించే వారికోసం పాట పాడే ఒక అమ్మాయిని. నా జన్మభూమిని ఎంతగానో ప్రేమించే నాకు పాటపాడే హక్కు ఉంది. దాన్ని నేను నిర్లక్ష్యం చేయలేను. ఇరాన్ దేశానికి గొప్ప చరిత్ర ఉంది. దాని గురించి చాలా పెద్ద మిథ్య కూడా ఉంది. ఈ రెండెంటినీ కలిసి నేను ఒక అందమైన పాట పాడుతున్నాను.” అని సింగర్ పరస్తూ పోస్ట్ చేసింది. యూట్యూబ్ లో పరస్తూ పాట పాడిన వీడియోకు 1.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ లో ప్రచరితమైన రిపోర్ట్ ప్రకారం.. ఒక మహిళ హిజాబ్ లేకుండా ఉండే ఆమెతో కలిసి పాటపాడిన ఇద్దరు యువకులు సోహెల్ ఫాగిహ్, ఎహ్సాన్ బెయిరాఘ్దార్ లను కూడా రాజధాని టెహ్రాన్ పోలీసులు అదే రోజు అరెస్టు చేశారు.

1979 ఇస్లామిక్ తిరుగుబాటు తరువాత ఇరాన్ లో హిజాబ్ తప్పని సరి చేస్తూ చట్టాలు చేశారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా నటీమణులు, పాశ్చాత్య సంప్రదాయాలను ఇష్టపడే మహిళలు హిజాబ్ ధరించడానికి ఇష్టపడడం లేదు. 2019లో అయితే ఇరాన్ దేశానికి చెందిన సినీ నటి అఫ్సనే బయెగన్ బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించలేదని ఆమెకు రెండేళ్లు జైలు శిక్ష విధించారు.

ఆ తరువాత 2022లో మహ్సా అమినీ అనే సామాజిక కార్యకర్త హిజాబ్‌కు వ్యతిరేంగా నిరసన చేయగా.. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. మహ్మా అమినీ పోలీసులు కస్టడీలో అనుమాస్పద స్థితిలో మరణించారు. తాజాగా ఇరాన్ ప్రభుత్వం హిజాబ్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే మహిళలను అరెస్టు చేసి కౌన్సెలింగ్ చేయించాలని ఆదేశాలు జారీ చేసింది.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×