BigTV English

Jayam Ravi : ఆమెను మధ్యలో లాగకండి… సింగర్ తో ఎఫైర్ పై ఫస్ట్ టైం స్పందించిన జయం రవి

Jayam Ravi : ఆమెను మధ్యలో లాగకండి… సింగర్ తో ఎఫైర్ పై ఫస్ట్ టైం స్పందించిన జయం రవి

Jayam Ravi : తమిళ హీరో జయం రవి ఇటీవల తన భార్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించాడు. జయం రవి విడాకులు తీసుకుంటున్నాను అంటూ షేర్ చేసిన పోస్ట్ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆ తరువాత జయం రవి భార్య ఆర్తి తనకు తెలియకుండా విడాకులు ఎలా ప్రకటిస్తారు అంటూ ఫైర్ అవ్వడం కొత్త అనుమానాలకు తావిచ్చింది. అయితే రవి విడాకులు తీసుకోవడం వెనుక ఉన్న కారణం ఆయనకు ఓ సింగర్ తో ఎఫైర్ ఉండడమే అని చెన్నై సర్కిల్‌ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఓ పబ్లిక్ ఈవెంట్‌లో దీని గురించి ప్రశ్నించగా హీరో తన విడాకులు, ఎఫైర్ రూమర్లపై స్పష్టంగా స్పందించాడు.


ఫస్ట్ టైమ్ జయం రవి రియాక్షన్ 

తాజాగా ఓ ఈవెంట్ లో జయం రవికి సింగర్ తో ఎఫైర్ అంటూ వస్తున్న వార్తలపై ప్రశ్న ఎదురైంది. దీంతో జయం రవి స్పందిస్తూ “మీరు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నేను క్లియర్ చేస్తాను. నా హార్డ్‌వర్క్, స్క్రిప్ట్‌ల ఎంపిక ద్వారా నేను ఇన్ని సంవత్సరాలుగా సంపాదించిన ఇమేజ్‌ని తగ్గించడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నించినప్పుడు నేను నవ్వగలను అంతే. నా పేరును కించపరచడం అంత సులభం కాదు. అనౌన్స్మెంట్ ఎపిసోడ్‌తో మొత్తం విషయం బయటపడిందని మీరు అనుకుంటే అది ఖచ్చితంగా నిజం కాదు. నేను నా లాయర్ ద్వారా నోటీసు పంపాను. ఆర్తి తండ్రి దానిని అంగీకరించారు. ఈ సమస్య మా ఇంట్లో నా తల్లిదండ్రులతో, ఆర్తి తల్లిదండ్రులతో కూడా చర్చించాము. నేను యాక్సెస్ చేయలేనని ఎలా చెప్పగలరు? జూన్‌లో ఆరవ్ పుట్టినరోజు.. నేను అతనితో కలిసి బర్త్ డేను జరుపుకోవడానికి అప్పుడు చెన్నైలో ఉన్నాను. పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. నా కారు వేర్వేరు నగరాల్లో, వేర్వేరు తేదీలలో కనిపించిందని వారు చెప్పారు. నేను కోరుకున్న చోటికి నా కారును తీసుకెళ్లడానికి నాకు అన్ని హక్కులు ఉన్నాయి. అన్నింటికంటే నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నాను. అలాగే అయాన్ చాలా చిన్నవాడు కాబట్టి అలాంటి విషయాలను అర్థం చేసుకోలేడు. కాబట్టి నేను ఆరవ్‌తో సమస్య గురించి బహిరంగ మాట్లాడాను. మనం కలిసి ఉండాలని ఆరవ్ కోరుకుంటున్నాడు” అంటూ ఇప్పటిదాకా ఈ వివాదంలో ఎవ్వరికీ తెలియని నిజాలను బయట పెట్టాడు.


Who is Kenishaa Francis? Here's everything about singer who is linked up  with Jayam Ravi post-divorce with Aarti Ravi | PINKVILLA

సింగర్ తో ఎఫైర్ నిజం కాదా?

ఇక సింగర్ కనీషా ఫ్రాన్సిస్ తో ఎఫైర్ అంటూ వస్తున్న రూమర్ల గురించి జయం రవి మాట్లాడుతూ “జీవించండి, జీవించనివ్వండి. ఇందులోకి ఎవరి పేరును లాగవద్దు. అనవసరంగా ఇలాంటి పనులు చేయకండి. వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగతంగా ఉండనివ్వండి. కనీషా 600 స్టేజ్ షోలలో పాడిన వ్యక్తి. ఆమె కష్టపడి జీవితంలో పైకి వచ్చింది. ఆమె ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వైద్యురాలు. అంతేకాదు లైసెన్స్ పొందిన సైకాలజిస్ట్. దయచేసి ఇందులో ఆమెను ఇన్వాల్వ్ చేయకండి” అంటూ రిక్వెస్ట్ చేశాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×