BigTV English

Bigg Boss 8 Telugu: బయట నీకొక మనిషి ఉంది.. నిఖిల్ పర్సనల్ లైఫ్‌ను టార్గెట్ చేసిన గౌతమ్

Bigg Boss 8 Telugu: బయట నీకొక మనిషి ఉంది.. నిఖిల్ పర్సనల్ లైఫ్‌ను టార్గెట్ చేసిన గౌతమ్

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్‌కు ఇంకా ఒక్క వారమే ఉంది. ఇప్పటికే బిగ్ బాస్ 8 మొదటి ఫైనలిస్ట్‌గా అవినాష్ నిలిచాడు. గతవారం జరిగిన టాస్కులు అన్నీ గెలిచి అవినాష్.. ఫైనల్స్‌లో తన స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇక ఈవారం రెండో ఫైనలిస్ట్ కోసం యుద్ధం మొదలయ్యింది. మామూలుగా మండే అంటేనే నామినేషన్స్ డే. ఇక బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్స్ అంతా ఫైనల్స్‌కు చేరువవుతుండడంతో తాజాగా ప్రసారమయిన మండే ఎపిసోడ్‌లో నామినేషన్స్ కాస్త డిఫరెంట్‌గా జరిగాయి. ఆ ప్రక్రియలో నిఖిల్, గౌతమ్ మధ్య జరిగిన ఫైట్ హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా నిఖిల్ పర్సనల్ లైఫ్‌ను టార్గెట్ చేస్తూ గౌతమ్ మాట్లాడిన మాటలు కంటెస్టెంట్స్ అందరికీ తప్పుగా అనిపించాయి.


నామినేషన్స్ ప్రక్రియ

ముందుగా అవినాష్ బిగ్ బాస్ 8 ఫైనలిస్ట్ కావడంతో మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్ నుండి ఒకరిని ఫైనలిస్ట్ రేసు నుండి తొలగించమని బిగ్ బాస్ తనకు ఆదేశించారు. దీంతో తను విష్ణుప్రియా పేరు చెప్పాడు. తను ఆటను అంత సీరియస్‌గా తీసుకోవడం లేదని కారణం చెప్పాడు. దానికి విష్ణుప్రియా ఒప్పుకోలేదు. తనను కరెక్ట్‌గానే ఆడానని వాదించింది. అయినా కూడా అవినాష్ నిర్ణయం ఫైనల్ అవ్వడంతో విష్ణుప్రియా ఫైనలిస్ట్ రేసు నుండి తొలగిపోయి.. నామినేషన్స్‌లోకి వచ్చేసింది. ఆ తర్వాత విష్ణుప్రియా.. గౌతమ్ పేరు చెప్పింది. ఇతర కంటెస్టెంట్స్‌తో తన ఇంటరాక్షన్ అంతగా లేదు అనడంతో పాటు ఇతర కారణాలు కూడా చెప్పింది. దీంతో గౌతమ్ కూడా నామినేషన్స్‌లోకి వచ్చేశాడు.


Also Read: కంటెస్టెంట్స్ కి బంపర్ ఆఫర్… ప్రైజ్ మనీ తోపాటు కారు కూడా..

పెద్ద గొడవే

గౌతమ్ తన తర్వాత నిఖిల్‌ను ఫైనలిస్ట్ రేసు నుండి తొలగిస్తున్నట్టు తెలిపారు. తను ఇతర కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న ఆరోపణలు చాలా పెద్దవి అన్నాడు. ఇంత చిన్న కారణంతో తనను నామినేట్ చేయడం నిఖిల్‌కు కూడా నచ్చలేదు. దీంతో గౌతమ్‌తో వాగ్వాదానికి దిగాడు. బిగ్ బాస్ 8లో తను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టినప్పటి నుండి గౌతమ్ రియాలిటీ ఏంటో తాను చూస్తూనే ఉన్నానని అన్నాడు నిఖిల్. అదేంటో చెప్పమని అడగగా.. ముందుగా ప్రేరణను నామినేట్ చేసి, తర్వాత తనతో ఫ్రెండ్లీగా ఉంటున్నాడంటూ ప్రేరణ పేరును మధ్యలోకి లాగాడు. దీంతో ఈ విషయంలో వారిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత యష్మీ పేరు మధ్యలోకి వచ్చింది.

యష్మీతో ఎందుకలా?

యష్మీని వాడుకున్నావు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు నిఖిల్. మాటలు సరిగ్గా రానివ్వమని, తానే యష్మీని వాడుకున్నావని అన్నాడు నిఖిల్. అది ఒప్పుకోని గౌతమ్.. బయట నీకు వేరే మనిషి ఉన్నప్పుడు హౌస్‌లో యష్మీతో అలా ఉండడం కరెక్ట్ కాదన్నాడు. ఒకప్పుడు యష్మీకి గాజులు సెలక్ట్ చేసి ఇవ్వడం వల్ల నిఖిల్‌పై ఆశలు పెంచుకుందని బయటపెట్టాడు. దీంతో అయిపోయిన విషయాల గురించి గౌతమ్ అలా మాట్లాడడం కంటెస్టెంట్స్‌కు కరెక్ట్ కాదనిపించి తనను అడ్డుకున్నారు. గౌతమ్ మాత్రం తాను మాట్లాడింది కరెక్టే అన్న ఫీలింగ్‌లో ఉన్నాడు. ఇక చివరిగా నిఖిల్.. రోహిణిని ఫైనలిస్ట్ రేసు నుండి తప్పించాడు. ఇతర కంటెస్టెంట్స్‌తో పోలిస్తే రోహిణి ఆట తక్కువగా ఉందని కారణం చెప్పాడు.

Related News

Bigg Boss 9 : బిగ్ బాస్ 9 అగ్నిపరీక్షలో అభిజీత్ రచ్చ రచ్చ.. వామ్మో, ఇంత జరుగుతోందా?

Big Boss: బిగ్ బాస్ హౌస్‌లోకి పహల్గాం ఉగ్రదాడి బాధితులు!

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Big Stories

×