Naresh On Nani : అల్లరి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు అల్లరి నరేష్. అయితే అల్లరి నరేష్ కి ఎక్కువ హిట్ సినిమాలు వారి తండ్రి ఇవీవీ సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చాయి. ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో ఇవివి సత్యనారాయణ ఒకరు. ఆయన సినిమాలంటే కుటుంబ సమేతంగా ప్రేక్షకులు చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్ళు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో సినిమాను చేసే వాళ్ళు ఇవివి. అలానే ఎక్కువ శాతం సినిమాల్లో కామెడీకి కూడా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు.
ఇక అల్లరి నరేష్ చేసిన సినిమాలు ఎక్కువ శాతం కూడా కామెడీ సినిమాలే ఉండేవి. సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ ఒకప్పుడు కామెడీ సినిమాలు చేసినట్టు అల్లరి నరేష్ కూడా వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో నిలబడ్డాడు. అయితే ఇవివి సత్యనారాయణ చనిపోయిన తర్వాత అల్లరి నరేష్ చేసిన కామెడీ సినిమాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. కామెడీ సినిమాలు తో పాటు కొన్ని ప్రత్యేకమైన పాత్రలు కూడా పోషించేవాడు అల్లరి నరేష్.
ఇక అల్లరి నరేష్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చిన పాత్ర అంటే గమ్యంలో గాలి శీను అని చెప్పొచ్చు. క్రిష్ జాగర్లమూడి దర్శకుడుగా పరిచయమైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో అల్లరి నరేష్ లో ఎంత గొప్ప యాక్టర్ ఉన్నాడా అని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కూడా ఒక కీలకపాత్రలో కనిపించాడు.ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ సీరియస్ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నాంది అనే సినిమా వచ్చి మంచి సూపర్ హిట్ గా నిలిచింది. మళ్లీ వీరు కాంబినేషన్ లో వచ్చిన ఉగ్రం సినిమా పరవాలేదు అనిపించింది. ఇక రీసెంట్ గా ఆ ఒక్కటి అడక్కు అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు అల్లరి నరేష్. ఆ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
అల్లరి నరేష్ ప్రస్తుతం సుబ్బు దర్శకత్వంలో బచ్చలమల్లి అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 20వ తారీఖున రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కు నాని గెస్ట్ గా హాజరయ్యారు. ఈవెంట్లో నానిని ఉద్దేశిస్తూ అల్లరి నరేష్ మాట్లాడుతూ మేము 2008లో ఒక ఈవెంట్లో కలిసి అప్పటినుంచి మా ఫ్రెండ్ షిప్ కొనసాగుతూనే ఉంది. దాదాపు 16 ఏళ్ల నుంచి మా జర్నీ ఉంది. ముఖ్యంగా నా కష్టకాలంలో నాకు తోడుగా ఉన్న స్నేహితుడు నాని అంటూ అల్లరి నరేష్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ మాటలతో నాని ఇబ్బంది పడుతున్న కూడా గెస్ట్ కదా బాబాయ్ చెప్పాలి తప్పదు అంటూ స్టేజ్ పై మాట్లాడాడు అల్లరి నరేష్.
Also Read : Nani on Allari Naresh : నేను నరేష్ కలిసి చేస్తే, అలాంటి సినిమాలా ఉండాలి.?