E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : నిఖిల్ నాయర్ బిగ్ బాస్ సంపాదన ఎంతో తెలుసా?

Bigg Boss 9 Telugu : నిఖిల్ నాయర్ బిగ్ బాస్ సంపాదన ఎంతో తెలుసా?

Bigg Boss 9 Telugu : వైల్డ్ ఫైర్ అంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ లో నిఖిల్ నాయర్ ఒకరు. మలయాళ అబ్బాయి అయినప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడాడు. చూడడానికి కూడా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా, ఆకర్షణీయంగా కన్పించాడు. కానీ ఊహించని విధంగా 5 వారాల్లోనే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. మరి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఈ 5 వారాల్లో నిఖిల్ నాయర్ సంపాదించింది ఎంత? అనే వివరాల్లోకి వెళ్తే..

5 వారాల్లో లక్షల్లో సంపాదన

వీకెండ్ ఎపిసోడ్ మొదట్లోనే నాగార్జున ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే బిగ్ బాంబ్ వేసిన సంగతి తెలిసిందే. హౌస్ మేట్స్ లో శనివారం ఒకరు, ఆదివారం ఒకరు ఎలిమినేట్ అవుతారని ముందే చెప్పారు. డే 69 ఎపిసోడ్ పూర్తయ్యే సమయానికి గౌరవ్, నిఖిల్, దివ్య డేంజర్ జోన్ లో ఉన్నారు. ఆ ముగ్గురిలో షాకింగ్ గా నిఖిల్ అవుట్ అయ్యాడు. నిజానికి దివ్య ఎలిమినేట్ అవుతుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ నిఖిల్ నాయర్ ను ఎలిమినేట్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు బిగ్ బాస్. ఇక హౌస్ లో ఉన్న 5 వారాల్లో నిఖిల్ బాగానే వెనకేసున్నాడు. ఒక్కో వారానికి నిఖిల్ 2 – 2.5 లక్షలు రెమ్యూనరేషన్ గా అందుకున్నట్టు ఇండస్ట్రి టాక్. దీని ప్రకారం లెక్కేస్తే నిఖిల్ 5 వారాల్లో 10-12.5 లక్షలు సంపాదించినట్టే.

నిఖిల్ కు సంజన వెన్నుపోటు

అక్టోబర్‌ 12న వైల్డ్‌ కార్డ్‌గా హౌస్‌లో కి అడుగు పెట్టాడు నిఖిల్‌ నాయర్‌. అతను తెలుగు బుల్లితెర అడియం కు సుపరిచితుడే. ‘గృహలక్ష్మి’ సీరియల్‌లో ప్రేమ్ పాత్రలో నటించి, తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు నిఖిల్ నాయర్. ఇక బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాక ఆయన అందరినీ ఓ ఆట ఆడుకుంటాడని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఆడియన్స్. కానీ నిఖిల్ కు కనీసం స్క్రీన్ స్పేస్ కూడా దక్కలేదు స్టార్టింగ్ లో. నిఖిల్ నువ్వెక్కడా కంపించట్లేదు అని నాగ్ చెప్పాక గానీ, ఆయన తన ఆటను ఇంప్రూవ్ చేసుకోలేదు. కానీ గత రెండు వారాలుగా బాగా ఆడి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. అయితే కెప్టెన్సీ టాస్క్ లో సంజన హ్యాండ్ ఇవ్వడం నిఖిల్ కు మైనస్ అయ్యింది. ‘బీబీ రాజ్యం’ కెప్టెన్సీ టాస్క్ లో తనూజా వర్సెస్ నిఖిల్ ఫైట్ జరిగింది. ఆ టైమ్ లో సపోర్ట్ చేస్తుందేమో అనుకున్న సంజన క్లోజ్ గా ఉన్న నిఖిల్ ను వదిలేసి తనూజాను సపోర్ట్ చేసింది. దీంతో నిఖిల్ ఏకంగా ఎలిమినేట్ అయ్యాడు. ఒకవేళ సంజన పొరపాటు చేయకపోతే, ఇప్పుడు నిఖిల్ కెప్టెన్ అయ్యేవాడు. దీంతో అతను వెళ్లేటప్పుడు సంజన ‘నావల్లే నువ్వు వెళ్లిపోతున్నావ్’ అంటూ ఏడ్చింది కూడా. ఏదేమైనా నిఖిల్ వెళ్తూ వెళ్తూ ఆడియన్స్ మనసు గెలుచుకోవడం విశేషం.

Read also : మానసిక రోగం ఉన్న అమ్మాయిపై మనసు… పెళ్లి చేసుకుందాం అనుకుంటే మెంటలెక్కించే ట్విస్ట్

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×