KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Ipl 2025) కంటే ముందు… గత టోర్నమెంటులో ఛాంపియన్గా నిలిచిన కేకేఆర్ జట్టుకు… ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తోంది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( Ipl 2025) ప్రారంభాని కంటే ముందు కేకేఆర్ జట్టులో ముగ్గురికి గాయాలు అయ్యాయి. రాబోయే ఐపీఎల్ సీజన్ కి ముందు ఆటగాళ్ల గాయాలు ఫ్రాంచైజీ ఓనర్లను కంగారు పెడుతున్నాయి. కొంతమంది ఆటగాళ్లు తమ ప్రదర్శనను మెరుగుపరచుకొని ఆశలు పెంచుతున్నారు.
ALSO READ: Team India: సూర్యకు బిగ్ షాక్… టీమిండియా కొత్త కెప్టెన్ గా తెలుగు కుర్రాడు ?
మరికొంతమంది గాయాల కారణంగా టోర్నీ ( Ipl 2025) నుంచి నిష్క్రమించే అవకాశాలు ఉన్నాయి. గత సీజన్ ఛాంపియన్ కోల్కత్తా నైట్ రైడర్స్ కష్టాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. జట్టులోని ముగ్గురు స్టార్ ఆటగాళ్లు గాయాల పాలయ్యారు. ఆటగాళ్లకు అయిన గాయాలు జట్టును కంగారు పెడుతున్నాయి. ఐపీఎల్ కి ముందు ఈ ఆటగాళ్లు పూర్తి ఫిట్నెస్ తో లేకపోయినట్లయితే కేకేఆర్ భారీ నష్టాన్ని చూడాల్సి వస్తుంది. వెంకటేష్ అయ్యర్ 2021 నుంచి కేకేఆర్ ( KKR ) తో జతకట్టాడు. గత వేలంలో కేకేఆర్ యాజమాన్యం అతనికి 23.75 కోట్ల భారీ ధరను వెచ్చించి కొనుగోలు చేసింది.
లీగ్ చరిత్రలో అతను నాలుగవ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. వెంకటేష్ అయ్యర్ ( Venkatesh Iyer) కేకేఆర్ జట్టుకు కెప్టెన్ గా కూడా ఎందుకయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ రంజీ ట్రోఫీ మ్యాచ్ లో వెంకటేష్ అయ్యర్ గాయపడడం జట్టుకు మరింత కష్టాలను తీసుకువచ్చింది. వెంకటేష్ అయ్యర్ ( Venkatesh Iyer) గాయం తర్వాత బ్యాటింగ్ చేయాలని ప్రయత్నాలు చేసినప్పటికీ అతని ఫిట్నెస్ సరిగ్గా లేదని స్పష్టంగా తెలుస్తోంది. దీంతో కేకేఆర్ యాజమాన్యం తీవ్ర ఆందోళనకు గురవుతుంది. ఇక కేకేఆర్ రింకు సింగ్ ను ( Rinku Singh ) మ్యాచ్ విన్నర్ గా భావిస్తూ ఉంటుంది. కానీ రింకు సింగ్ ( Rinku Singh ) ఇంగ్లాండ్ తో జరిగిన రెండవ టీ20 కి ముందు గాయపడ్డాడు.
ALSO READ: Travis Head: ఓపెనర్ గా వచ్చి రెచ్చిపోయిన హెడ్….టెస్టులు కూడా ఇక చూడాల్సిందే !
దీంతో సిరీస్ లో రెండు మ్యాచ్లకు దూరంగా ఉండాల్సి వచ్చింది. అతని గాయంపై తుది నివేదిక వచ్చేవరకు కేకేఆర్ జట్టుకు ఈ టెన్షన్ తప్పేలా లేదు. వచ్చే సీజన్ కోసం కేకేఆర్ రిటైన్ చేసిన తొలి ఆటగాడు రింకు సింగ్ కావడం విశేషం. దక్షిణాఫ్రికా రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఎన్రిచ్ సౌత్ ఆఫ్రికా టి20 లీగ్ లో గాయపడ్డాడు. ఈ టోర్నీతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. దీంతో కేకేఆర్ కష్టాలు మరింత పెరిగాయి. ఛాంపియన్ ట్రోఫీ ( Champion Trophy ) ముగిసిన వెంటనే ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఎందుకంటే ఎన్రిచ్ ఎప్పుడు ఫిట్ గా ఉంటారు అనేదానిపై క్లారిటీ లేదు. లీగ్ ప్రారంభం నాటికి అతను ఫిట్ గా లేకపోతే అది కేకేఆర్ బౌలింగ్ విభాగానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టే అవుతుంది.