BigTV English
Advertisement

Naga Manikanta: ‘బిగ్ బాస్’ నాగ మణికంఠ పెళ్లి వీడియో వైరల్.. అతడి భార్యపై దారుణమైన ట్రోలింగ్

Naga Manikanta: ‘బిగ్ బాస్’ నాగ మణికంఠ పెళ్లి వీడియో వైరల్.. అతడి భార్యపై దారుణమైన ట్రోలింగ్

Naga Manikanta Wedding Video: బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్స్‌గా వచ్చిన చాలామంది ప్రేక్షకులకు అసలు పరిచయం లేదు. ఈసారి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కేటగిరిలో బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన నాగ మణికంఠ ఒకడు. అసలు నాగ మణికంఠ ఎవరో ప్రేక్షకులకు మాత్రమే కాదు.. తన తోటి కంటెస్టెంట్స్‌కు కూడా తెలియదు. అందుకే ముందుగా హౌజ్‌లో నుండి వెళ్లిపోవడానికి అనర్హులు ఎవరు అని అడగగా చాలామంది నాగ మణికంఠ పేరు చెప్పారు. కానీ నాగ మణికంఠ మాత్రం తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తూ కంటెస్టెంట్స్‌కు మాత్రమే కాకుండా ప్రేక్షకులకు కూడా దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. తాజాగా తన పెళ్లి వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


పర్సనల్ లైఫ్ కష్టాలు

బిగ్ బాస్ సీజన్ 8 లాంచ్ రోజే నాగ మణికంఠ స్టేజ్‌పైకి రాగానే తన లైఫ్‌లో తను పడిన కష్టాల గురించి ఓపెన్‌గా మాట్లాడాడు. దీంతో మణి వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నాయని ప్రేక్షకులకు అప్పుడే క్లారిటీ వచ్చేసింది. ఇక హౌజ్‌లోకి వచ్చిన తర్వాత పలువురు కంటెస్టెంట్స్‌తో కూడా ఈ విషయాన్ని ఓపెన్‌గానే చర్చించాడు. తనకు పెళ్లయ్యిందని, పాప ఉందని, కానీ పలు కారణాల వల్ల తన భార్య, పాపను అమెరికాలో వదిలేసి ఇండియాకు వచ్చానని చెప్పుకొచ్చాడు మణికంఠ. నామినేషన్స్‌లో తన పర్సనల్ లైఫ్ గురించి పూర్తిగా ఓపెన్ అయిపోయి అందరినీ ఎమోషనల్ కూడా చేశాడు. అప్పుడే నాగ మణికంఠ పెళ్లి వీడియో బయటికొచ్చింది. కానీ దానిపై విపరీతమైన ట్రోల్స్ జరుగుతున్నాయి.


Also Read: బిగ్ బాస్ హౌజ్‌లో సేఫ్ గేమ్.. ఆ ముగ్గురిని బయటికి పంపడం చాలా కష్టం!

నెగిటివ్ కామెంట్స్

నాగ మణికంఠ భార్య ఆంటీలాగా ఉందని, అసలు తనను ఎలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడని పలువురు నెటిజన్లు విచక్షణ లేకుండా కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి వీడియో బయటికి రాకముందు అసలు తనకు పెళ్లయిన విషయాన్ని కూడా చాలామంది నమ్మలేదు. సింపథీ కోసం మణి అబద్ధాలు చెప్తున్నాడని అన్నారు. ఇక వీడియో బయటికి వచ్చిన తర్వాత తన పర్సనల్ లైఫ్ మీద, తన భార్య మీద ఘోరంగా ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. కొందరు మాత్రం పాపం మణికంఠ తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు అని జాలితో మాట్లాడుతున్నా కూడా మరికొందరు మాత్రం తన భార్యను కుమారీ ఆంటీతో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఏం జరిగింది

అసలు తన వైవాహిక జీవితంలో ఏం జరిగిందో, తన భార్య నుండి తను దూరంగా ఎందుకు ఉంటున్నాడో నాగ మణికంఠ పూర్తిగా బయటికి చెప్పలేదు. భార్యతో కలిసి అమెరికా వెళ్లిపోయానని కానీ అక్కడ తనకు సంపాదన లేకపోవడంతో అందరు తనను తక్కువ చేసి చూడడం మొదలుపెట్టారని, అందుకే సంపాదించడం కోసం ఇండియా వచ్చేశానని బిగ్ బాస్ నామినేషన్స్‌లో చెప్పాడు. కానీ తను చెప్పిన మాటలను నమ్మనని శేఖర్ భాషా ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చాడు. ఇప్పటికీ బిగ్ బాస్ షో చూస్తున్న కొందరు నాగ మణికంఠ చెప్పిన విషయాలు పూర్తిగా నిజాలు అని నమ్మలేకపోతున్నారు. అందుకే తన పెళ్లి వీడియోను కూడా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Related News

Bigg Boss 9 Promo: బిగ్ బాస్ మరో టాస్క్.. మరీ అంత ఆటిట్యూడ్ ఎందుకు?

Bigg Boss 9 Telugu : హీటేక్కిస్తున్న నామినేషన్స్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె..?

Bigg Boss : బిగ్ బాస్ షోకు బిగ్ షాక్.. బ్యాన్ చెయ్యాలంటు డిమాండ్.. ఏం జరిగిందంటే..?

Bigg Boss 9 Telugu : ఇమ్మూ ఫ్యాన్స్ కు రక్తకన్నీరు… ముద్దుబిడ్డకు అడ్డు తొలగించడానికే ఈ బిగ్ ప్లానా ?

Bigg Boss 9 : పోకిరి లెవెల్ ట్విస్ట్, దివ్య కు ఇచ్చి పడేసిన భరణి, అసలైన విలనిజం

Bigg Boss 9 Telugu Day 64 : దివ్యను దులిపేసిన రీతూ… భరణి భయ్యా ఇదస్సలు ఊహించలే… కెప్టెన్ ఇమ్మూకు క్రేజీ షాక్

Bigg Boss 9: ఈవారం నామినేషన్స్ లోకి వచ్చింది ఎవరంటే?

Bigg Boss 9 Promo : ఫుడ్‌పై ఉన్న ఫోకస్ గేమ్‌పై లేదు… గౌరవ్‌ను గజగజ వణికించారు.!

Big Stories

×