Harry Brook: క్రికెట్ చరిత్రలో అనేక రకాల షాట్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఈ అదిరిపోయే షాట్స్ ఆడడంలో.. ఎబి డివిలియర్స్ ముందు వరుసలో ఉంటాడు. 360 డిగ్రీ ప్లేయర్ గా పేరుగాంచిన అతను… ఇప్పటికే చాలా షాట్స్ ఆడాడు. అయితే ఇప్పుడు రోజుకో ప్లేయర్ కొత్త షాట్.. కనిపెడుతున్నారు. లేటెస్ట్ గా ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ( Harry Brook ) అదిరిపోయే సిక్సర్ తో దుమ్ము లేపాడు. ఎవరు ఊహించని విధంగా వికెట్ల వెనుకకు.. స్కూప్ షాట్ ఆడి దుమ్ము లేపాడు హ్యారీ బ్రూక్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఉదయం నుంచి వైరల్ అవుతోంది.
Also Read: Watch video: ఇదేం రనౌట్ రా బాబు…100 ఏళ్ళ క్రికెట్ చరిత్రలో తొలిసారి…చూస్తే నవ్వుకోవాల్సిందే
ది 100 లీగ్ 2025 టోర్నమెంట్ ( The Hundred Mens Competition 2025 ) ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నమెంట్ లో అనేక రకాల రికార్డులు నమోదు అవుతున్నాయి. ఇక ఈ టోర్నమెంట్లో భాగంగా… నిన్న నార్తర్న్ సూపర్ చార్జర్స్ vs బర్మింగ్ హామ్ ఫీనిక్స్ ( Northern Superchargers vs Birmingham Phoenix) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లీడ్స్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో 36 పరుగుల తేడాతో నార్తర్న్ సూపర్ చార్జర్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా హ్యారీ బ్రూక్ ( Harry Brook ).. 31 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సిక్సర్లు, రెండు బౌండరీలు ఉన్నాయి.
అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ( Harry Brook ) కొట్టిన సిక్సర్ అందరిని ఆకట్టుకుంది. వికెట్ల ముందు కూర్చొని…. వెనకాలకు స్కూప్ షాట్ ఆడాడు. దీంతో ఈ బంతి నేరుగా సిక్స్ గేట్ లోకి వెళ్ళింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ షాట్ చూసిన క్రికెట్ అభిమానులు… షాక్ అవుతున్నారు. ఇదెక్కడి షాట్ రా నాయనా.. సరికొత్తగా కనిపెట్టావ్ అంటూ హ్యారీ బ్రూక్ ( Harry Brook ) ను మెచ్చుకుంటున్నారు.
ఇది ఇలా ఉండగా…. ఈ మ్యాచ్ లో నార్తర్న్ సూపర్ చార్జర్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఐదు వికెట్లు నష్టపోయిన నార్తర్న్ సూపర్ చార్జర్స్ 193 పరుగులు చేసింది. ఇక ఈ లక్ష్యాన్ని…బర్మింగ్ హామ్ ఫీనిక్స్ ( Birmingham Phoenix) చేదించలేకపోయింది. లక్ష్యాన్ని చేదించలేక… 100 ఓవర్లు ఆడి… తొమ్మిది వికెట్లు నష్టపోయి 157 పరుగులు మాత్రమే చేసింది. చేజింగ్ చేసే క్రమంలో లియామ్ లివింగ్టన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయినప్పటికీ మ్యాచ్ గెలిపించలేకపోయాడు. అటు జాకబ్ కూడా 48 పరుగుల తేడాతో రాణించాడు. మిగతా ప్లేయర్లు పెద్దగా రాణించకపోవడంతో మ్యాచ్ ఓడిపోయింది. దీంతో 36 పరుగులు తేడాతో నార్తర్న్ సూపర్ చార్జర్స్ విజయం సాధించింది.